జీతమ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జీతమ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, అక్టోబర్ 2010, ఆదివారం

కోట్లు కూడ బెట్టండి...




చాలా వీజీ .. నెల రోజుల క్రితం ఒక సెలవ రోజు ఏదో పుస్తకం చదువుతూ దీవాన్ మీద దొర్లుతున్న నాకు అంకుల్ అంకుల్ అన్న పిలుపు వినబడింది, ఎవరా అని చూస్తే ఎదురింటి ఆదిత్య. MTech పూర్తి చేసాడు . కాంపస్ లోనే మంచి కంపెనీ లో ఉద్యోగం వచ్చింది. చాలా మంచి అబ్బాయి( నాలాగే) ఈ తరం ప్రతినిధి కాదు. బెంగుళూరు లో ట్రైనింగ్ ఈ రోజు రాత్రి వెళ్తున్నాను అని చెప్పాడు. కంపెనీ వివరాలు , ట్రైనింగ్ గురించీ అడిగి జీతం మాత్రం ఆడగలా మరి ఆదిత్య మగాడు కదా (మగాడి జీతం అడగ కూడదు అని పెద్దలు చెప్పారు) మంచి ఆఫర్ వచ్చింది అని సంతోషించా.
ఒక్కసారి నా ఉద్యోగపు కొత్త రోజుల్లోకి వెళ్ళా.. 1989 ట్రైనింగ్ లో చేరా 1250 ట్రైనింగ్ స్తైఫండ్ తో .. దాదాపు నాలా ఇంకో నలుగురు ఉండేవాళ్ళం ఒకే వయసు ఒకే ఉద్యోగం ఒకే జీతం తో కానీ వివిధ ఆర్ధిక స్థితి గతులతో. వ్యక్తిగత ఖర్చులు అందరికీ ఒక్కటే అలవాట్లు అవసరాలు కూడా. అలా మూడు నెలల తర్వాత ప్రొబేషన్ లోకి జంపాం.(దూకాం). అప్పుడు జీతం 2850 + ఇయర్లీ ప్రోడక్టివితి అప్రైసల్ తో ఒక 20000 పాకెట్. ఇక అక్కడ నుంచి ప్రతి ఏడాది రెట్టించిన ఉత్సాహం తో జీతం ఇంకా ఇన్సెంటివ్ కలిపి బాగానే ఈ రోజుల్లో సాఫ్ట్ వేర్ వల్ల కన్నా మంచి సంపాదన. ప్రతీ రూపాయి న్యాయమైన నాణ్యమైన వాసి గల సంపాదన. అందుకే రోజుకి ఎన్ని గంటలు పని చేసిన అలసట గానీ టెన్షన్ గానీ అస్సలు విసుగు గానీ ఉండేవి కావు. రోజు పని పూర్తి చేసి రాత్రి 8 గంటలకి ఒక చోట చేరే వాళ్ళం తిండి తింటూ తర్వాత ఏమి చెయ్యలా అని ప్లాన్ వేస్తూ.... సినిమా కి ( నాకు ఇష్టం లేక పోయినా) లేక రోడ్ పక్కన బైకులు పెట్టి కబుర్లు. ఎవరన్న రాక పోతే వాడి మీద జోకులు తో ( అందుకే రాకుండా ఉండే వాళ్ళం కాదు) , ఆ రోజు పని లో జరిగిన సంఘటనలు అనుభవాలు చెప్పుకొని , గడపి రూములకి చేరే వాళ్ళం. అందరం విడి విడి గా ఉండే వాళ్ళం అందుకని తలా ఒక దారి పట్టేవాళ్ళం. ఇక ఆర్ధిక పరిస్థితి కొస్తే ఖర్చులన్నీ EDV ( ఎవడి డబ్బులు వాడివే ) పద్ధతి లో నడిచేవి.
ఆదాయ వ్యయాలన్నీ ఒకే లా ఉన్నా కుటుంబ స్థితుల్లో పద్దతుల్లో చిన్న చిన్న తేడాలు ఉండేవి మాకు. దానివాల్ల అప్పుడప్పుడూ పక్క వాళ్ళ దగ్గర చిన్న చిన్న చేబదుళ్లు. ఎదుటి బ్యాంకు లో అప్పులు ఉండేవి మాలో ఒకల్లిద్దరికి. ఇంకో విషయం కూడ గమనించా మాలోని ఐదుగురినీ A B C D E గా అనుకుంటే మా విభిన్న గతులు ,పరిస్థితులు చెప్తా చూడండి ...

A: ఉద్యోగం లో చేరే నాటికి మధ్య ఎగువ తరగతుల మధ్య గా తూగే కుటుంబం. అన్నీ ఖర్చులు తీరి చిన్న వయసు నుండే ఆర్ధిక ప్రణాళిక సరిగ్గా ఉన్న కుటుంబం అస్సలు ఆడంబరాలు ఆర్భాటాలు లేని విధానం.

B: తరగతి పైన చెప్పిందే కానీ విధానాలు, కుటుంబ పరిస్థితులు, తేడా ఇంకా పూర్తవని అవసరాలు ఒక ఆడపిల్ల పెళ్లి , ఇంకో చదువు ఉద్యోగం లేని అబ్బాయి , ఇంకా బాగా ఆడంబరాలు లేని పోనీ ఆర్భాటపు ఖర్చులు.
C : అదే తరగతి కానీ ఇంక అవసరాలే లేని అంతా ఉద్యోగాలోచ్చిన కొడుకు లున్న కుటుంబం ఆర్భాటాలు ఆడంబరాలు చెయ్యగలిగిన స్తోమత ఉంది
D : ఆస్తి ఏమీ లేని ఖర్చులు కూడా ఏమీ లేని కుటుంబం కొంచం అయోమయపు పోకడ
E : మధ్య తగతి ముగ్గురు ఆడపిల్లల పెళ్లి భాద్యత ఇంకా తమ్ముడి చదువు, తండ్రి చిన్నప్పుడే పోయారు , ఒక తాతల నాటి ఆస్తి అద్దేలోచ్చే ఇల్లు ఆధారం

వీళ్ళని విశ్లేషిస్తే ఇలా ఉంది ఇప్పటి వాళ్ళ వాళ్ళ స్థితి

A బాగా జాగ్రత పరుడు తండ్రి నుంచి నేర్చున్న నిభద్దత పొడుపు, డబ్బు దాచటం మీద తెలివి, రేపటి గురించి చింత లేని వాడు అప్పులు లేవు ఒక్క ఇల్లు కార్ స్థిరఆస్తి కొనటం కోసం తప్ప అప్పు చేయడు.
B జాగ్రత పరుడు కుటుంబానికి బాసట గా ఉండే వాడు కానీ కుటుంబ ఆడంబరాలని ఏమాత్రం ఆపలేని నిస్సహాయుడు ఇప్పటికీ ఆడంబరాలకీ అప్పులు చేస్తాడు, గొప్పలేక్కువ.
C సంపాదన బాగా ఉంది కాబటి కుటుంబ భాద్యత కూడా లేని వాడు కాబట్టి నిశ్చింత గా ఖర్చు పెట్టె వాడు. మాలో ఇప్పటికీ బాగా ఆస్తి పరుడు. అప్పుల వసరం లేదు. ఇల్లు కార్, స్థిర ఆస్తి కొనుగోలు కై తప్ప అప్పు చెయ్యడు.
D మంచి సంపాదన తో బాటు , కుటుంబ అవసరాలు లేని వాడు కావటం తో ఇబ్బందులు లేని వాడు.. అప్పులు చేసే అవసరం లేదు ఇల్లు, కార్, ఆస్తులు కొనటం ఇలాంటి వాటికీ తప్ప.
E చిన్నప్పటి నుంచి ఆర్ధికం గా నియంత్రణ లో పెరిగాను, కాబట్టి ఇప్పుడు నో కంట్రోల్ అని చెప్పుకుంటూ ఖర్చు పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడని మనస్తత్వం, కానీ కుటుంబ భాద్యత లలో మాత్రం పాలు పంచుకునే వాడు. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేయటానికి అప్పులు చేసి అవి తీర్చటానికి కాస్త ఇబ్బంది పడ్డ వాడు. అదే అలవాటు ఇప్పటికీ విలాసాల కోసం అప్పు చెయ్యటానికి వెనుకాడడు.

ఎంత పెద్ద సంపాదన పరులైనా మాలో
ఒకళ్ళిద్దరి చేతిలో ఎప్పుడూ క్రెడిట్ కార్డు బిల్లులు, సెల్లు లో ఫైనాన్సు కంపెనీ రిమైన్డర్స్, నోట్లో ఎప్పుడూ సారీలు, టేబుల్ మీద బ్యాంకుల నుంచి డిఫాల్ట్ నోటీసులు ఇలా ఉంటూనే ఉంటాయి. పర్సు లో కనీసం రెండు వేలు డబ్బు, బ్యాంకు లో పది వేలు బాలన్సు కూడ లేనంత టైట్ వుండి అసలు అంత సంపాదన ఏమి చేస్తారో అనుకునేలా ఏమి కొనాలన్నా వాయిదాల పద్ధతి మీద నడిచే వాళ్ళున్నారు.
నే చెప్పోచే దేంటంటే కొద్ది పాటి నిబద్దత తో జీవితం జీతం రెండూ సమంగా తూస్తూ ఆనందం గా బతకొచ్చు.

ఈ తరం సంపాదన పరులను చూస్తే భలే ఆశ్చర్యం గా ఉంటుంది.


నాకెందుకో వారెన్ బఫ్ఫెట్ ప్రవచనాలు ఎప్పుడూ గుర్తుంటాయి
ఆయనకి క్రెడిట్ కార్డు లేదు
అయన బ్రాండెడ్ వస్తువులు వాడరు.
అయన లగ్సరి కార్ వాడరు
ఆయన ఆడంబరాలకి దూరం
అయన నమ్మిన సిద్దాతాల కోసం ఎవరే మానుకున్న ఏమీ మారలేదు

ఇంతకీ మా ఆదిత్య కి నేను ఇచ్చిన సలహా ఎంతంటంటే
౧ జీతానికి మించిన ఖర్చు పెట్టకు
౨ ఎంత అవసరమైన ఎవ్వరికీ అప్పులు ఇవ్వకు ఎవరినీ అప్పులు అడగకు
౩ నీ నెల జీతం లో 15% సవింగ్స్ ఉండేలా చూస్కో
౪ జీవిత కాలం లో ఎవరికీ గ్యరంటారు గా ఉండకు సురిటీ ఇవ్వకు
౫ పొడుపు పధకాలు మదుపు విధానాల పై అమ్మే వాళ్ళు చెప్పే దానిపై పూర్తిగా ఆధార పడకు
౬ పై విషయాల పై వివిధ వ్యక్తుల సలహా తీస్కో ఒక్కళ్ళు చెప్పిందే పాటించకు.
డబ్బే జీవితం కాదు కానీ...... జీవితమే డబ్బు ( చాల విషయాలు డబ్బుతో ముడి పది ఉన్నాయ్)
అన్నిటికన్నా తృప్తి ని మించిన ఆస్తిలేదు అప్పుని మించిన దారిద్ర్యం లేదు

ఇవన్నీ పాటిస్తే మనం కోటీస్వర్లు, ఉహు కాదు కొటెం లెక్క ఈరోజుల్లో అపర కుబెర్లు అవచ్చు...