6, నవంబర్ 2011, ఆదివారం

ఇప్పుడు మళ్ళీ .. మరింత శక్తి తో..

Image courtesy cartoonstudio.com

రెండు నెలల నిశబ్దం తర్వాత, మళ్ళీ చెయిజేస్కొని బ్లాగ్ దులిపా. ఎందుకో పెద్ద ఖాళీ ఏర్పడింది. రెండు నెలలూ నా బ్లాగ్ జోలికి రాలేదు కానీ, అన్నీ బ్లాగులూ చదువుతూనే ఉన్నా. మనసు పుడితే కామెంట్లు కూడా రాసా. రెండు నెలలూ నా బ్లాగ్ లో పోస్ట్స్ వ్రాయటం కన్నా వేరే వాళ్ళ బ్లాగులు చదివి విసుర్లు, చతుర్లు వేయటం చేసాను. అలా చేయటం చాలా బాగుంది. బాగుంది అనటం కన్నా తేలిక అనటం సబబేమో. ఇద్దరు ముగ్గురు మిత్రులు నాకు ఇలాగే సెటిల్ అయిపో నీ అసలు రాతల కంటే కొసరు కోతలే బాగున్నాయి, మేమంతా సుఖ శాంతులతో ఉన్నాం అని కబురెట్టారు. ఖాళీలో బ్లాగ్ చదువర్లందరూ చాలా సుఖం గా ఉన్నారనిపించారని పించింది. నా గోల లేక మీరంతా నిశ్చింతగా ఉండటం నాకే మాత్రం ఇష్టం లేదు.
అందుకే మళ్ళీ వచ్చాను...
అదేదో వాణిజ్య ప్రకటనలోలా
సారి మరింత ....తో...
మరింత ఎక్కువ .... తో...
మరింత .. గా..
కాసుకోండి సారీ కోసుకోండి సారీ సూస్కోండి.!!

2 కామెంట్‌లు:

  1. కొంపతీసి ఈ రెండు నెలలు "జిమ్" కెళ్ళారా?

    రిప్లయితొలగించండి
  2. చాలా కాలానికి పునర్దర్శనం. వచ్చిన వారు ఒక మంచి టపా కూడా వేయచ్చు కదా! మీ మరింత ............. కోసం ఎదురుచూస్తూ..............

    రిప్లయితొలగించండి