
ఎలాగోలా సంవత్సర కాలం గడిపా
నాకిష్ట మోచ్చినట్లు రాసుకొని, పూస్కోని, మిమ్మల్ని విసిగించాను.
అనవసర ప్రసంగం చేసాను. అవసర నైవేద్యమూ చేసాను.
కొన్ని నాకు నిజమైన తృప్తి కలిగించాయి.
కొన్ని మీకు బలమైన సుత్తిలా తగిలుంటాయి.
చాలా సార్లు నేనూ నా ఫ్రెండూ గంటలు గంటలు
సొల్లేసుకుంటూ " ఈ జన్మ లో మనం మంచి పుస్తకాలు చదివి ఆనందిస్తున్నాం కదా,
కనీసం వచ్చే జన్మలోనైనా అవి రాసే స్థాయిలో పుట్టాలని " అనుకుంటూ వుండేవాళ్ళం.
దానికి రిహార్సల్లా నా ఈ బ్లాగ్ మొదలు పెట్టాను.
చదివి, చక్కదిద్ది, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ నా నమస్సులు.