
విన్నపము
ఈ రోజు తో కలిపి ఇంకో ఏడు రోజులు అంటే సరిగ్గా వారానికి నా పుట్టినరోజు.
నాదంటే నా మనసుకి,
నా లిపిలేని భాషకి,
నా బ్లాగుకి,
శ్రీరామ నవమికి ముందు సందాలు ఒసూలు చేసి
సలవ పందిళ్లేసి సీరియల్( టీవీ లోవి కావు ) లైట్లు తగిలించి,
రేకు ( కోన్ ) మైకెట్టి సీతారాముల కల్యాణం చూతం రారండీ ... అనే పాటలేసి
పెద్ద పెద్ద మట్టి బానలు కొత్తవి కొని వాటిని మంచి నీళ్ళతోనూ ,
మజ్జిగ తేట తోనూ ( ఉప్పు నిమ్మరసం కరివేపాకు/ దబ్బాకు కలిపి మరీ ) నింపి,
దారే పోయే వాళ్లకి పిలిచి మరీ ఇచ్చి,
రామనవమి కి మీరు రావాలండీ, పన్లలో ఓ చెయ్యి వేయాలండీ,
అలాగే మీకు తోచినంత సందా ఈడబ్బా లో వేయాలండీ,
మన కోసం కాదండీ, మీకు పుణ్యమనండీ, అంటూ హడావిడి చేసినట్లు,
ఈ వారం రోజులూ మీకు రోజుకో చిన్న విషయం నా బ్లాగుకు సంభందించినది, తెలుపుకుంటాను.
ఆనక ఆ రోజు అంటే పుట్టిన రోజున మీకు విధాయకంగా కృతజ్ఞతలు తెలుపు కుంటాను.
మీరంతా ఆ రామ భక్తుల్లాగా సాహితీ భక్తులు గాన
నన్ను అసీరదించి,
నన్ను ఆనందం లో ముంచి ,
తడిపి పిండి, ఆరేయ
ప్రార్ధన
ఇట్లు భవదీయుడు
ఆత్రేయ