11, ఆగస్టు 2011, గురువారం
ఇట్లు భవదీయుడు
విన్నపము
ఈ రోజు తో కలిపి ఇంకో ఏడు రోజులు అంటే సరిగ్గా వారానికి నా పుట్టినరోజు.
నాదంటే నా మనసుకి,
నా లిపిలేని భాషకి,
నా బ్లాగుకి,
శ్రీరామ నవమికి ముందు సందాలు ఒసూలు చేసి
సలవ పందిళ్లేసి సీరియల్( టీవీ లోవి కావు ) లైట్లు తగిలించి,
రేకు ( కోన్ ) మైకెట్టి సీతారాముల కల్యాణం చూతం రారండీ ... అనే పాటలేసి
పెద్ద పెద్ద మట్టి బానలు కొత్తవి కొని వాటిని మంచి నీళ్ళతోనూ ,
మజ్జిగ తేట తోనూ ( ఉప్పు నిమ్మరసం కరివేపాకు/ దబ్బాకు కలిపి మరీ ) నింపి,
దారే పోయే వాళ్లకి పిలిచి మరీ ఇచ్చి,
రామనవమి కి మీరు రావాలండీ, పన్లలో ఓ చెయ్యి వేయాలండీ,
అలాగే మీకు తోచినంత సందా ఈడబ్బా లో వేయాలండీ,
మన కోసం కాదండీ, మీకు పుణ్యమనండీ, అంటూ హడావిడి చేసినట్లు,
ఈ వారం రోజులూ మీకు రోజుకో చిన్న విషయం నా బ్లాగుకు సంభందించినది, తెలుపుకుంటాను.
ఆనక ఆ రోజు అంటే పుట్టిన రోజున మీకు విధాయకంగా కృతజ్ఞతలు తెలుపు కుంటాను.
మీరంతా ఆ రామ భక్తుల్లాగా సాహితీ భక్తులు గాన
నన్ను అసీరదించి,
నన్ను ఆనందం లో ముంచి ,
తడిపి పిండి, ఆరేయ
ప్రార్ధన
ఇట్లు భవదీయుడు
ఆత్రేయ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
తప్పకుండానండి.. మీరింతగా అడిగాక కూడా తడిపి పిండి, ఆరేయకుండా ఉంటామా? కానివ్వండి. :)
రిప్లయితొలగించండినన్ను ఆనందం లో ముంచి ,
రిప్లయితొలగించండితడిపి పిండి, ఆరేయ ... Sure Sure.
ఆ సుదినాన్ని రానివ్వండి అలాగే చేస్తాం.
రిప్లయితొలగించండికానివ్వండి.. కానీ మధ్య మధ్య వ్యాఖ్యలు మిస్సయితే తిట్టుకోకూడదు..శెలవులు హడావుడీ కదా..:)
రిప్లయితొలగించండి>>>మీరంతా ఆ రామ భక్తుల్లాగా.....
రిప్లయితొలగించండిఇదేదో కొంచెం అనుమానించాల్సిన విషయం లాగానే ఉంది. :):)
ఆవేళ కి వచ్చి మీరు పెట్టే పట్టువస్త్రాలు కట్టుకొని ఆశీర్వదించి, భోజనం చేసి వెళతాము. సరేనా.
@ శిశిర : కానీలు ఇప్పుడు లేవుకదండీ ఎలా ఇవ్వాలి ?
రిప్లయితొలగించండి@ సుజాత: చూస్తుంటే మీ IFB ఫ్రంట్ లోడ్ తో రెడీ గా ఉన్నట్లున్నారే
@ విజయమోహన్: మీ మాటలకి నాకెందుకో భయం గా ఉంది
@ తృష్ణ : మిమ్మల్ని బయటకి ఎప్పుడు తిట్టాను? (లోపల్లోపల తిట్టుకుంటానుగానీ )
@ బులుసు గారూ : "ఆ" రామ భక్తులు కాదండీ, ఆ రాముని భక్తులు.
అందరికీ ధన్యవాదములు.
చివర్లో దక్షిణ తాంబూలాలు వుంటాయనే సంగతి మీరు ప్రత్యేకించి చెప్పక పోయినా, అర్ధం చేసుకునే విశాల హృదయం వున్న వాళ్ళం లెండి.. కానీయండి..
రిప్లయితొలగించండి