26, జనవరి 2011, బుధవారం

ఏంటి ? ఈవ్ టీసింగా..?


  గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !!                         చిన్నప్పుడు స్కూల్ రోజుల్లో ఆగస్ట్ పదిహేను కోసము, జనవరి ఇరవై ఆరు కోసము తెగ ఎదురు చూసే వాడిని. పుట్టిన రోజు కోసం ఎదురు చూసినంత ఆత్రుత తో
                 కొత్త బట్టల్లేని పండగ, పిండి వంటల్లేని
పండగ. అయినా బోలెడంత ఉద్వేగం, చాలినంత ఉత్సాహంతో రోజు కోసం ఎదురు చూసేవాడిని
            నాకు బాగా గుర్తు పొద్దున్నే రేడియో లో వినిపించే దేశ భక్తి గీతాలు వింటూ పొద్దున్నే మా అమ్మ వండిన వేడన్నం లో పెరుగు కలుపుకొని తిని ఆకుపచ్చ లాగు పైన తెల్ల చొక్కా వేస్కొని జేబుకి కాగితం ఝండా తగిలించుకొని ఏడింటికల్లా మా అమ్మ తో బడికెళ్లే వాడిని. మా అమ్మ టీచరు గా ఉన్న స్కూల్లోనే నేను చదివా కాబట్టి బాగా పెందలాడే వెళ్ళేవాడిని.

           అక్కడ
స్టేజి ముందు ఝండా దిమ్మ చుట్టూ ఉన్న మూడు మెట్ల పై పూల తో అలకరించటం, తర్వాత మా ఎండిఎస్సు టీచరు గారు (NDS టీచరు పేరు రాజేశ్వరి గారు) ఝండా ని ఎంతో నైపుణ్యం తో ముడేసి తాడుతో పైకి లాగి, ప్రిన్సిపాల్ గారు ఒక్కసారి సుతారం గా లాగ గానే జూలు విదిల్చిన సింహం లా గ ర్వంగా ఎగిరెలా ఏర్పాటు చెయ్యటం ముప్పై అయిదు ఏళ్ళ క్రితం జరిగినా  
 ఇప్పటికీ బాగా గుర్తు. టీచర్ ఎన్ని సార్లు
ఝండా కట్టినా అది ఎప్పుడు పైకి ఎగరటానికి మొరాయించంటం కానీ,
లేదా
మన కంపు రాజకీయ పార్టీ అఫీసుల్లోలా తలకిందులు గా ఎగరవేయ బడటం జరగా లేదు. మా టీచర్ కి ఝండా అన్నా, దేశమన్నా అంత గౌరవం భక్తి ఉండేవి. ఝండా వందనం అయిన తర్వాత ఒక గంట సేపు మీటింగ్ జరిగేది ప్రిన్సిపాల్ గారు ,టీచర్లు, పెద్దలు అంతా మాట్లాడేవాళ్ళు . టైం లో మా ధ్యాస అంతా ఝండా మీదే ఉండేది ఉండేది , వీచే గాలికి ఝండా రెప రెప లాడుతుంటే బోలెడు ఆనంద మేసేది. అందరూ ఝండా వంక చూసే వాళ్ళం "ఝండా ఎగురు తోంది .. ఝండా ఎగురు తోంది.. అంటూ గుస గుస లాడుతూ..

సరదా సంబరం ఇప్పుడు నాకు లేవు. ఆఫీసు లో ఝండా వందనం గురించి కన్నా , తర్వాత ఏమి తినాలో అని రెండు రోజులు ముందే ప్లాన్ చేసే మనుషుల మధ్య ఉంటూ, ఆఫీసు ఖర్చే కాబట్టి సాధ్యమైనంత ఖరీదైన హోటల్ నుంచి వీలైనన్న ఎక్కువ అయిటేమ్స్ తెప్పించండి గురూ అని ఉబలాట పడే టిఫిన్ దోశ భక్తుల మధ్య సరదా ఎప్పుడో సమాధి అయింది.

అయితే
గత వారం రోజులుగా ఒక విచిత్ర మైన కోరిక కలిగింది.
అందరూ స్వాతంత్ర దినోత్సవం గణ తంత్ర దినోత్సవం 
పండగ సెలవలు జరుపు కుంటారు కదా..
అసలు రెండిటికీ తేడా ఏంటో ఎంత మందికి తెలుసు ? అని.
మీరు
నమ్మాలి... సుమారు యాభై మందిని అడిగి చూసా ముగ్గురు మాత్రమే సరిగ్గా చెప్ప గలిగారు. అందరూ చదువు కున్న వాళ్ళే , కునే వాళ్ళే.
పన్నెండు
మంది మధ్య వయస్కులు నాకు పరిచయ మున్న పెద్ద హోదా లో ఉద్యోగం చేసే వాళ్ళు. ఇరవై మంది నన్ను ఎరుగని వ్యక్తులు, మార్కెట్ లో రోడ్ మీద మాల్స్ లో తిరుగుతూ అడిగా ,
ఆరుగురు
ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులు,
పది మంది స్కూల్ విద్యార్థులు, ఒకళ్ళిద్దరు అటో వాళ్ళని అడిగా,
ఒక
స్కూల్ విద్యార్ధి, ఒక ప్రభుత్వ అధికారి, ఒక రోడ్ మీద అపరిచిత వ్యక్తి సరిగ్గా చెప్పారు.
మిగతా
వాళ్ళు ఏదో చెప్పారు
కొంత
మంది మాకు తెలీదని,
కొంత మంది మర్చిపోయామని.
ఒకళ్ళు నేను చెప్పనని,
ఇద్దరు మీరెవరు ఎందుకు అడుగుతున్నరూ అనీ,
కొంత మంది మీరు టీవీ వాళ్ళా కెమెరా ఎక్కడ దాచారు అంటూ సరసమాడి తప్పించుకున్నారు.
ఒక
పాతికేళ్ళ అమ్మయితే " ఏంటి ఈవ్ టీసింగా అంది". అంతే గానీ తెలీదని ఒప్పుకోలా.

ఆగస్ట్
పదిహేను భారత దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఒదిలి స్వతంత్రం వచ్చిన రోజైతే.
ఇరవైఆరు
జనవరి అంటే మన భారత రాజ్యాంగం 1950 నుంచి అమలు లోకి వచ్చిన దినం.
రెండు
వందల ఏళ్ళ బ్రిటీష్ పాలన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏక్ట్ 1935 ని తోసిరాజని భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చింది.
అప్పటి
వరకూ భారత ప్రభుత్వానికి సరైన రాజ్యంగా పరమైన శాశ్వత నియమావళి లేదు, ఉన్న నియమాలన్నీ బ్రిటీష్ ప్రభుత్వ రాచరికానికి అనుగుణం గా ఉన్న గవర్నమెంట్ అఫ్ ఇండియా 1935 చట్టానికి లోబడినవే.
అందుకని
మన కంటూ మనచే నిర్ణయించ బడిన, నిర్మించ బడిన రాజ్యాంగం అవసరమని భావించిన అప్పటి రాజకీయ మేధావులు పెద్దలు కూర్చిన రాజ్యాంగం అమలు లకి వచ్చింది.
జనవరి
26 తారీకు ప్రాముఖ్యత ఏంటంటే అదే రోజు 1930 లో భారత జాతీయ కాంగ్రెస్స్ పూర్ణ స్వరాజ్ ప్రకటించిన దినం. అప్పటి కల మహాత్ముల కృషివల్ల త్యాగాల ఫలం గా 1947 ఆగస్ట్ 15 భారత దేశం స్వతంత్ర దేశమైతే,
పరిపాలనా
పరం గా మరింత పటిష్టం అవటానికి మేధావుల కృషి వాళ్ళ మూడు సంవత్సరాల కాలం లో సుమారు మూడు వందల మంది నాయకులూ ఆమోదించిన, రాజ్యంగ ప్రతి, రెండు భాషల్లో రాయబడి 26 నవంబరు 1949 దాఖలు చేయబడింది. రాజ్యాంగం పూర్తి స్థాయి లో అమలు లోకి రావటానికి ఇంకొన్ని నెలలు పట్టి జనవరి 26 , 1950 భారత దేశము ప్రపంచం లో అతిపెద్ద గణతంత్ర దేశం గా అవతరించింది.

అదీ కధ అని నేను క్లుప్తం గా చెప్తే విని జాతీయ ఝండా లోంచి నాలుగు పూలు, అక్షింతలు నెత్తిన వేస్కొని , రెండు చాక్లెట్లు నోట్లో వేస్కొన్న దేశ భక్తులందరినీ భారత మాత చల్లగా చూస్తుంది.

జైహింద్ !!





10 కామెంట్‌లు:

  1. First two paragraphs take me to in my childhoods days..the golden days. :)
    the rest...the current ugly reality..

    Thanks for the first two paragraphs. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !!

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞాత26 జన, 2011 2:23:00 AM

    Well done!
    మంచి పని చేసారు. స్వాతంత్ర్య దినానికీ, గణతంత్ర దినానికీ తేడా తెలియకపోవటం విచారించాల్సిన విషయం! ఈ విషయాన్ని అందరి దృష్టికీ తెచ్చినందుకు అభినందనలు.

    శారద

    రిప్లయితొలగించండి
  3. మా కివన్నీ ఎందుకు మాష్టారూ
    తిన్నామా? పడుకున్నామా? తెల్లారిందా?
    ఈ పని చేస్తే నీ కెంత? నా కెంత?
    తొక్కలో ఈ రూల్స్, రాజ్యాంగం అవీ, ఇవీ అని ఎగస్ట్రా లు మాట్లాడేరనుకోండి, షెడ్ మూసేస్తాం, ఇలా మట్లాడేవళ్ళందర్నీ ఏసేసి, ఇంటికెళిపోతాం. అమ్మ (భారమాత)
    మీద ఒట్టు అడ్డంగా నరికేస్తాం

    రిప్లయితొలగించండి
  4. అజ్ఞాత26 జన, 2011 9:53:00 AM

    ఈవ్ టీసింగా అన్నదా.? భలే రిస్క్ తీస్కున్నారు మీరు.
    దోశ భక్తులా ? భలే అన్నారు
    బాగుంది మీ పోస్ట్
    - వి కె రాం

    రిప్లయితొలగించండి
  5. మీ టపా చాలా బాగుంది. మీ సర్వే కూడా! మేమైతే ఆశ్చర్యపోం! చాలామందికి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియదు. రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం అంటే రెండూ వేరు వేరు అనుకునేవాళ్ళూ ఉన్నారు. :)

    రిప్లయితొలగించండి
  6. @మంజుల: మిరపకాయ బజ్జి మొత్తం తినాలి, పైన శనగ పిండి తిని మిరపకాయ పారేసే వాళ్ళని చిన్న పిల కాయలంటారు.
    @శారద : ఇంకా వివరంగా రాయాల్సి ఉంది మరీ సోషల్ పాఠం లా ఉంటుందని ఊరుకున్నా
    @ఓలేటి: తమ్ముడు రాహుల్ తోడు మీతో అస్సలు పెట్టుకోము
    @వికె రామ్ : ఇంకా చాలా మాటలు పడ్డా కానీ చెప్పుకోలేను
    @ఆదిలక్ష్మి: నా ఆ చిన్న సర్వే లో ఇంకా చాలా ఆశ్చర్యకర విషయాలు బయట పడ్డాయి. గాంధి నెహ్రు అనగానే వెంటనే విజయవాడ లో ఉన్న మా లోకల్ వ్యక్తులు స్పురించారు కొంత మందికి. 10000 KV షాక్ నిచ్చే నిజాలు బయట పడ్డాయి.

    రిప్లయితొలగించండి
  7. modatininchi anni gurthu cheseru but tookiga.....bagundi. mee survey kaastha dheerula lakshaname. last lo cheppina janavari 26 pramukhyatha mathram assalu marchipoya.......malli gurthu chesinanduku thnks.

    రిప్లయితొలగించండి
  8. అజ్ఞాత30 జన, 2011 8:36:00 AM

    oka rachayite anukunna neelo dagundi,oka TV reporter kuda vunnadani telisindanna ippude !

    రిప్లయితొలగించండి
  9. katti anna nuvvu katti ! ee generation pillakayalaku neelaga cheppakapote..cheyakapote...jyanodayamu avvadu

    రిప్లయితొలగించండి
  10. అవును ఇంకా చాలామంది ఉన్నారు నాలో
    అన్నీ చూసే ఓపిక ఉందా.. నీ ఊహకు అందనన్ని.
    నా సామాజిక భాద్యత సినిమా హళ్ళ దగ్గర, పిక్నిక్ స్పాట్ల దగ్గర వేస్ట్ అవనీయను.
    తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ..? ఇది కాదు నేను

    రిప్లయితొలగించండి