7, జనవరి 2011, శుక్రవారం
విజయవాడ పరిచయపత్రం (ప్రాస్పెక్టస్)
మా ఊరుకి నేను ఇల్లరికపు కొడుకుని. కొత్త మాటలా ఉందని తప్పు పట్టకండి.మా అత్తారూరు విజయవాడ కాదు కాబట్టీ , గత ఇరవై ఒక్క ఏళ్ళగా ఇక్కడే ఉంది పోయా కాబట్టీ ఇల్లరికపు కొడుకు సరైన మాటే.
ఉద్యోగరిత్యా ఒకే ఊర్లో ఉండటం వరమా ? శాపమా? నాకైతే ఇప్పటికీ తేల్చుకోలేని స్థితి. ఒకరకంగా వరమే. కరెంటు కోత, మంచి నీళ్ళ ఎద్దడి, వేరే ఏ రకమైన ఇబ్బందులూ లేని మా విజయవాడ లో దిగ్విజయంగా ఇప్పటికి 21 ఏళ్ళ పైగా సర్వీసు పూర్తి అయింది, ఇంకో పదిహేను సంవత్సరాల రెండు నెలలు మిగిలి ఉంది.
నేను ఊరు మారాలంటే ఒకే మార్గం ప్రమోషన్ మీద వెళ్ళటమే, అలా మారాల్సి వస్తుందని దాని వంకే చూడని నేను హాయిగా ఇక్కడే ఉండి పోయా. కొంచం వేడి ఎక్కువైనా మంచి వాతావరణం, విద్యా , వైద్య వసతులు బాగుండి ,అన్నిటి కన్నా మంచి మనుషుల మధ్య బతకటం అలవాటై పోయి నాకు విజయవాడ ఒదిలి వెళ్లాలని లేదు.
ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసేవాళ్ళు బాంకుల్లో పని చేసే అధికారులు బదిలీల మీద బదిలీలు అవుతూ రెండు మూడేళ్ళకో ఊరు వెళ్తూ రకరకాలా భాషలు సంస్కృతులు చవి చూస్తూ ఎదిగి పోతూ ఉంటె నేను మాత్రం ఒకే ఊర్లో ఉంటూ ఒకే భాష మాట్లాడుతూ( అది కూడా సరిగ్గా రాదు) పొరుగు రాష్ట్రము వెళ్తే ఏమి మాట్లాడాలో తెలీక తెల్ల మొహం వేస్తానని ఇప్పటికీ మా అన్న మూడు భాషల్లో బూతులు తిట్టి మరీ చెప్తాడు. ఏమి చేస్తా అది నా ప్రారబ్ధం. అందరికీ అన్నీ కుదరద్దూ.. ఒకవేళ ఆరాటాల పోరాటాల కారణం గా రాష్ట్రము తెలంగాణా, సీమ, కోస్తా, ఉత్తరాంధ్రా, ఇలా ముక్కలైతే నాలాటి వాడికి ఇక ఇబ్బంది ఉండదు. నాలుగైదు రాష్ట్రాల లో ఇంచక్కా తెలుగే మాట్లాడి నెగ్గుకు రాగలను.
ఇక పోతే మా విజయవాడ లో ఉన్న అదనపు సౌకర్యాలు మంచి సినిమా హాళ్ళు, ఇప్పుడిప్పుడే వెలుస్తున్న షాపింగ్ మాల్స్, ఒకట్రెండు థీమ్ పార్కులు, లెక్కలేనన్ని మంచి టిపిని సెంటర్లు, పెద్ద రైల్వే జంక్షను, అన్ని ప్రాంతాలకూ బస్సులున్న బస్టాండ్, మంచి రోడ్లు రోడ్ మీద పెరిగిన ట్రాఫిక్కూ. ఊరు చుట్టూ పొలాలు, కొండలూ, మామిడి తోటలు,ఒక వైపు కృష్ణమ్మా, వీటన్నిటి పైన అండగా కనకదుర్గమ్మ... పది మైళ్ళు వెళితే మంగళగిరి పానకాల స్వామి. ఎంత ప్రమోషన్ ఇస్తే మాత్రం ఇన్ని హంగులూ అండ దండలూ ఉన్న మా బంగారు విజయవాడ ని ఒదిలి ఎలా వెళ్లనూ ? అందుకే మరి కొంత కాలం ఇక్కడే ఉండ దల్చుకున్నా.
నెలకో సారి పని వత్తిడి కి చిరాకేస్తే ప్రకాశం బారేజ్ దాటి గుంటూరు జిల్లాలోకి తొంగి చూసి, అమరావతి రోడ్ కేసి వెళ్తే దారి పొడుగుతా పచ్చని పొలాలు, దాంట్లో పనిచేస్కుంటున్న రైతులు, అమరావతి లోకి అడుగు పెడితే వినిపించే ఆ పరమశివుడి జేగంట, పక్కనే గలగలా పారే కృష్ణమ్మా, అది దాటి వెళ్తే వచ్చే చిన్న చిన్న లంకలూ...సత్యం శంకరమంచి ఏమి చూసి పరవశించి అమరావతి కధలు రాసారో చెప్పకనే చెప్తాయి.
కొండపల్లి వెళ్లి ఖిల్లా మీంచి కిందకి చూస్తె కనపడే చిన్న చిన్న పెంకుటిళ్ళు, మనుషులు , వాహనాలు, ఆ కొండపల్లి బొమ్మల తయారీకి ప్రేరణ ఏంటో చెప్తాయి. అక్కడ ఉన్న శిధిలాలలో తిరుగుతూ ఆ రాతి తిన్నెల మీద కూర్చుంటే కలిగే రాజ ఠీవీ, దర్జా ముందు ఏ పదవైనా బలాదూరే. కొండ పల్లి ఖిల్లా ఎక్కాలంటే అందరూ కార్లోనో బండి మీదో ఘాట్ రోడ్ మీద వెళ్తారు కానీ అసలు మజా కావాలంటే బుద్దిగా మన వాహనం కొండ కింద నిలిపేసి. అడ్డం గా ఆ కొండ ఎక్కటమే సరైన పద్ధతి. కాకపోతే కాళ్ళకి ట్రెక్కింగ్ షూస్, పక్కన మనతో సమానం గా స్పందించగల స్నేహితుడూ, ఇద్దరి మధ్యలో భావ సారూప్యం ఉన్న విషయ పరిజ్ఞానం ఉంటే రోజులో నాలుగు సార్లు ఎక్కి దిగొచ్చు. మీకు ట్రెక్కింగ్ అభిలషణీయం కాదా ఒదిలేయండి. బండి మీదే వెళ్లి పైన కూర్చొని అలా చూస్తూ ఉండండి చాలు. మిగతాది ప్రకృతే చూస్కుంటుంది.
అసలు అంత దూర మెందుకూ.. ఆయాసం అంటారా నగర నడి మధ్యలో ఉన్న మొగల్రాజ పురం లో కొండ మీద ఒరిజినల్ దుర్గమ్మవారు ఉన్నారు, అంటే దుర్గమ్మ మొదట గా పదం పెట్టిన పీఠం, అక్కడ గుడి ఉంది, పచ్చని పౌర్ణమి రోజు ఆ కొండ నడిచి ఎక్కి (నడిచే ఎక్కాలి ఇంకో మార్గం లేదు) అక్కడ అమ్మకి దండం పెట్టుకొని, ముఖాన కుంకం బొట్టేట్టుకుని,కొబ్బరి ముక్కలు తింటూ చీకటి పడేదాకా కూర్చుంటే నిండు పాల బిందె తొణుక్కుంటూ వస్తుంటే తెల్లని పాలు చిమ్మినట్లు, చల్లని వెన్నెల చిమ్ము కుంటూ చందమామ వస్తాడు. చూస్తూ కూర్చుంటే నడి నెత్తిమీదకి వచ్చిన సంగతి కూడా తెలీదు. ప్రయత్నించండి...
వేసవి లో చల్ల గాలుల నిచ్చే కృష్ణవేణమ్మ ఘాట్లు, ఆవల కెళ్తే సీతానగరం లో ఉన్న స్వాములార్ల ఆశ్రమాలూ, గుళ్ళూ.. ఇసక తిన్నెలూ ..ఒకటేమిటీ.. ఎన్నో మా విజయవాడ లో. మీకో సంగత్తెలుసా కృష్ణ ఒడ్డున గట్టున కూర్చొని కాళ్ళు నదిలో వేసి ఆడించుకుంటూ టైం వేస్ట్ చేస్తుంటే, ఎంత వేస్ట్ చేసామో మనకే తెలీదు. సత్తె పెమానికం గా చెప్తున్నా నే చాలా సార్లు చేసా ఆపని. మీకు ఈత వస్తే మొలలోతు నదిలోకి దిగి ధైర్నం చేసి ఇంకొంచం ముందుకెళ్ళి బారలేస్కుంటూ ఆవలి కెళ్లటానికి ఆలీసం ఎందుకు?
మీకు తిండి మీద మంచి అభిరుచి ఉందా.. మా ఊళ్ళో ఎన్నో మంచి హోటళ్లు ఉన్నాయ్ . అప్పుడెప్పుడో స్వచ్చమైన నెయ్యేసి ఇడ్లీలు, పెసరట్టుప్మా లూ పెట్టేవారట, ఇప్పుడూ అక్కడక్కడ వాసనలోస్తాయి. నాకైతే ఎన్నో ఏళ్ళ తరబడీ పేరు మోసిన హోటళ్ళ కన్నా , రోడ్ పక్క బండి హోటళ్లు భలే మంచి టిఫిన్ పెడతాయి అనిపిస్తాయి. ఆవిర్లుకక్కే ఇడ్లీలు, వేడి వేడి దోశలు, ఉబ్బెత్తుగా ఉన్నాయికదాని పొడిస్తే వేడి సెగతో వేళ్ళు చురుక్కుమనిపించే పూరీలు, అందులోకి కొబ్బరి చట్నీలు, బంగాల దుంప కూరలూ.. రోడ్ మీద నుంచొని తింటున్నామనే స్పృహ ఒదిలేస్తే మహా రుచి గా పెట్టగల టిక్కీ హోటల్లు ఎన్నో ఉన్నాయి. వన్ టవున్ లో మార్వాడి తిళ్ళు భలే ఉంటాయి. అసలు విషయం చెప్పక పోతే ఆనక తిడతారు మా విజయవాడ మిరపకాయ బజ్జీలు, చిన్న చిన్న పునుకులు ఇంకెక్కడా దొరకవు కావాలంటే పైపందెం లో మా బీసంట్ రోడ్ రాసేస్తా అంత ధైర్యం నాకు ఈ విషయం లో...
బట్టల కొట్లైతే ఇంక చెప్పక్కర్లేదు. అందరు బ్రదర్సూ తమ తమ కొట్లని ఇక్కడ తెరిచారు. సిస్టర్స్ కి బోలెడు తగ్గింపు నిస్తూ.... కోరుకోవటం ఏరుకోవటం ఇక మన ఇష్టమే. బంగారమూ మినహాయింపు కాదు, ఖాన్లూ, ఖజానాలు, కీర్తులూ ఇలా ఎన్నో పేరుమోసిన దుకాణాలు. అయినా మా వన్ టవున్ బంగారం పని వాళ్ళ చేతుల్లో మంచి కళ ,నమ్మకం ఉంది.
కక్షిదారుల శ్రేయస్సు కోసమే హై కోర్ట్ బెంచ్ ఏర్పాటు చెయ్యమని ఆందోళన చేసే లాయర్లూ, లెక్కకి మిక్కిలి డాక్టర్లూ, సందు సందు కీ ఉన్నారు . మాఊర్లో డాక్టర్ల కోసమైతే ఒక రోడ్డే ఉంది అయితే దానిపేరు నక్కలరోడ్, ఎందుకో అడక్కండి నాకూ తెలీదు.
సినిమా హాళ్ల విషయాల కొస్తే ఇక తిరుగే లేదు, కొత్త సినిమా వస్తే పొద్దున్నే ఆరింటికే మీరు బోలెడు హడావిడి చూడొచ్చు, ఇంకేం పని లేదన్నట్టు అక్కడే తచ్చాడే అభిమాన సంఘాలనీ చూడొచ్చు.
ఇన్ని చక్కని వసతులు ఉన్న మా విజయవాడ భూతాల క్షమించాలి భూతల స్వర్గం.
ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్పానో అర్ధం అయిందా? ఏ తెలంగాణ నో వస్తే పెట్టుబడీ దారులూ, భూస్వాములూ, విద్యావ్యాపారులూ, రియల్ ఎస్టేట్ ఆసక్తి దారులూ, సినిమా వాళ్ళు మా విజయవాడ రండి.
ఇక్కడ జమిలి గా పెట్టుబడి పెట్టండి లాభాలు పొందండి, మాక్కూడా పంచండి.
విన్ విన్ ఫార్ములా అన్నమాట.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పర్లేదే, మా కాకినాడ తర్వాత ఇంకో ఊరు ఈ స్టేట్ లో ఉందన్నమాట. :)
రిప్లయితొలగించండిమన ఊరి గురించి బాగా రాశారు,కానీ మంచి రోడ్ లు ఎక్కడ ఉన్నాయండి?ఒక్కసారి ఆటోనగర్ వైపు వస్తే తెలుస్తుంది-రోడ్లు ఎంత దరిద్రంగా ఉంటాయో
రిప్లయితొలగించండి"...నక్కలరోడ్, ఎందుకో అడక్కండి నాకూ తెలీదు....."
రిప్లయితొలగించండిఒకానొకప్పుడు, విజయవాడలో ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు కాలి బాటలుగా ఉన్న రోజుల్లో అంతా ఆడివి లాగా ఉండేదిట. మెల్లి మెల్లిగా పట్టణం, నగరంగా మారుతున్న సందర్భంలో 1920 లు 30లలో ఇప్పుడు నక్కలరోడ్డుగా పేరుబడ్డ చోట ఇళ్ళు వెలిసి రోడ్లు వేసుకున్నారు. అప్పుడు కూడ రాత్రిళ్ళు ఆ రోడ్డు మీద నక్కలు సంచరించేవట వాటి ఊళ వినబడేదిట. అందుకని ఆ రోడ్డుకు నక్కల రోడ్డు అని పేరు వచ్చింది.
గవర్నరు పేటలో చెట్ల బజారు అని ఉన్నది. మా చిన్నప్పుడు (1970 ల్లో) కూడ కొద్దిగా చెట్లు ఉండేవి అక్కడ. ఇప్పుడు వెతికితే ఒక్కటి కూడ కనపడదు.
విజయవాడ రాష్ట్ర రాజధాని కాకపోవటమే మంచిది. ఇప్పుడున్న అందాలు అన్నీ కూడ చెరిగిపోతాయి. కాకినాడ కాని మరే ఇతర చిన్న ఊళ్ళు కాని రాజధాని చేస్తే అవి అభివృధ్ధి చెందుతాయి. విజయవాడ మరింత పెరగటానికి రాజధాని చెయ్యనక్కర్లేదు, దానంతటదే బాగుపడగలదు.
'ఆరాటాల పోరాటాల కారణం గా రాష్ట్రము తెలంగాణా, సీమ, కోస్తా, ఉత్తరాంధ్రా, ఇలా ముక్కలైతే నాలాటి వాడికి ఇక ఇబ్బంది ఉండదు. నాలుగైదు రాష్ట్రాల లో ఇంచక్కా తెలుగే మాట్లాడి నెగ్గుకు రాగలను.'
రిప్లయితొలగించండిహహహ్హ్హాహ్హా..ఇక్కడ నేను..శ్రీ లంకన్లతో వచ్చీ రాని తమిళం లోను, పాకిస్తానీలతో కొంచెం ఉర్దూ లాంటి హిందీ లోనూ మాట్లాడేసీ మా దేశ భాషతో సహా నాకు మూడు దేశాల భాషలొచ్చని గర్విస్తూ చెప్పుకుంటాను...మీరూ అలా చెప్పుకోవచ్చు ఇంచక్కా.
@ శంకర్ : కూపస్తః మండూకః , పైన శివ ఏమన్నారో చూడండి
రిప్లయితొలగించండి@అను: రోడ్స్ ఇంతకు ముందు కన్న పర్లేదు కదండీ ప్రస్పెక్టాస్ లో అన్నీ బాగున్నాయనే రాస్కోవాలి రియల్ ఎస్టేట్ బ్రోషర్ చూడలేదా ఎప్పుడూ?
@శివ: డాక్టర్లు ఉన్నారని అలా అంటారని లోపల్లోపల చెప్పుకుంటారు (అర్ధం చేస్కోరూ ) మనకు రాజధాని ఒద్దు ఏదో చండీఘర్ లా పెరిగితే చాలు
ఎన్నేలమ్మా ఏదో ఇలా పామర భాష తో నెట్టుకొస్తున్నా ..
కూపస్త: మాండూక: అంటారా,మా కాకినాడ వాళ్ళని, హన్నా, ఇది మీ కృష్ణా సీమాంధ్రుల (అంటే అచ్చంగా కృష్ణ జిల్లాలోనే ఉండే సీమాంధ్రులు అన్నమాట...మా తూగోజి వాళ్ళు ఇందులోకి రారు) కుట్ర. యాభై ఏళ్లుగా మా కాకినాడ ట్రైన్స్ అన్నీ బలవంతం గా కాసేపు మీ వూళ్ళో ఆపేసుకుంటున్నారు. మీ కృష్ణా జలాల్ని కాకినాడ రాకుండా అడ్డుకుంటున్నారు(మా గోదారి మా ఇష్టం). దీన్ని నేను ఖండిస్తున్నాను. దీని మీద "కృష్ణ" అని పేరు లేని ఏదయినా కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాను.
రిప్లయితొలగించండిఇంక పాయింట్ కొస్తే మా ఊరు చూసి మూడేళ్ళు అయిందండీ. మీకేం, పుట్టి పెరిగిన ఊళ్ళో ఉండి ఎన్నైనా చెప్తారు. నేనేదో ఊరికే అంటే మీరు కుసింత ఫీలయినట్టు ఉన్నారే.
@ శివ గారు
ఎవరన్నారు కాకినాడ చిన్నదని? మాది సెకండ్ మెడ్రాస్. మీ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోకపోతే ఆత్రేయగారు ఆమరణ నిరాహార దీక్ష చేసే దాకా రాష్ట్రాన్ని స్తంభింప చేస్తాం. కాస్కోండి.
Saran, Thanks,you projected your city rather than narrated,Yes it is very painful to leave our beloved home town for bread and butter,but just think of those services with inter state transfers, extreme climatic conditions,and normal civic amenities,a study on these two sections say's people those who move on transfers and their children are far more better in their out look,harmony,and over all personality,even today after 6th pay commission,a inter state transfer is a kind of financial,social,emotional,even say sentimental set back to every employ specially with children,I was part of this system and with no children I know each time the kind of distress I faced,it has got it own pros and cons,the pleasure when we step down from GT or T.Nadu on platform no 5/6,the emotion starts from rainapadu stn it self as my father's younger brother was SM on duty sometimes on my return,when it is kept at outer for some reason those few minutes are much more un bearable than the 30 hrs journey,yes you woke up those "dead" memories,let us hope on this holy friday Mata Durga bless for same golden days,very impressive God Bless you.
రిప్లయితొలగించండిశంకర్ !! మొత్తానికి తూ.గో.జి గడుసుదనం సాంపిల్ వేసరన్నమాట
రిప్లయితొలగించండిఐ హర్ట్ నాకూ కె సి ఆర్ క్షమాపణ చెప్పాలి
ఆత్రేయ గారూ...
రిప్లయితొలగించండిఅక్కన్న మాదన్నల గుహలు మర్చిపోయారు.
ఆ గుహల్లో కూర్చుంటే... "సిటీకి నడిబొడ్డున ఉన్నామా..!!!" అని ఆశ్చర్యపోక తప్పదు. పైన అంతపెద్ద ఇంద్రకీలాద్రి గుడిలోని హడావుడి ఏ మాత్రమూ తెలీదు కిందున్న గుహల్లోకి.
Abba abba mana vijjivadani entala varninchesaru, Other states nunchee vachetappudu especially in the night times (Tamilnadu) lo Kondapalli dataaka Ibrahimpatnam vidyut plant kantulu, konda meeda illu dooraniki planetorium ni talapistoo nakshatra kantulu virajimme lights hammayya vooru vachesindi ani anandam. artharatri kuda pellivarillu la kala kala lade rly stn. aha enta varninchina tanivi teeradu. Lenin centre lilly pula ghuma ghumalu, eluru road pustakala shops marchipoyarandoi. unna vooru kanna talli enta cheppukunna tappu ledu.
రిప్లయితొలగించండిThanks mee madhura jnapakala post ki.
Sree Raaga
జజ్జనక.. జజ్జనక.. హే.. మీది విజయవాడ, మాది విజయవాడ.. కేకసారు. భలే బాగా వ్రాసారు. ఈ సారి నేను విజయవాడ వచ్చినప్పుడు మనం తప్పని సరిగ్గా కలుద్దాం.
రిప్లయితొలగించండిaatreya garu, prati paragraph chaduvutunnantha sepu, aa jaagalloki vellipoyenu.. mokka jonna kandela gurinchi raayaledemi?.. paala kandelu.. Raj Yuvaraj theatre mundara ammevaaru.. Ramakoti lo Tyagaraja utsavaalu, Hanumantharaya granthalayam lo jarige Naatakotsavalu, Sarabhayya gudi daggara dorike panasapottu :) ivannee maaku gurtuku testunna AATREYA garu, dhanyosmi ..
రిప్లయితొలగించండిఓహో...మీరు మా విజయవాడ వారు అన్న మాట...అందుకే మీకంత తొందర. మీరు ఇల్లలిముచాట్లు బ్లాగ్ లో నా మీద వేసిన అభండానికి ఒళ్ళు మండి మీ బ్లాగ్ చూస్తుంటే యీ పోస్ట్ కనేపించిందే. అసలు సంగతి ఇప్పుడు అర్థమైందే.
రిప్లయితొలగించండి