24, ఫిబ్రవరి 2011, గురువారం

ముళ్ళపూడి ...గొంతు పూడి....


గతం లో ఎప్పుడో ఒక రోజు , రాత్రి ఒంటి గంట నా ఫోన్ ట్రింగ్ ట్రింగ్ .... చేసింది మా ఉయ్యూరోడు ప్రెబాకరు.
నేను " హలో ..... ఏరా పక్కా !!"
"ఏమి చేస్తున్నావురాండి ? "
" ఏమీ లేదు రమణీయం నూట తొమ్మిదో సారి చదువు తున్నాన్రాండ్రి"
ఎరా ఒరేయ్ అనుకునే మా మధ్య అండి ( రా + అండి ) రాండి లు చొప్పించిన చిలిపి రమణ గారు లేరుట.
నా ఆరో ఏట నుంచి నుంచి బుడుగు తో మొదలెట్టి, అయన రాసిన వన్నీ చదివి చదివి ఆయనకి పెద్ద పంఖా లా
తయారయ్యి.. నా వయసు తో బాటు పెరుగు తున్న శరీరం తో బాటు అయన మీద ( అయన సహచరుడు బాపు గారి తో కలిపి)
విపరీత
మైన ప్రేమ అభిమానం గౌరవం పెంచుకొని,
సొంత బంధువు లా,
మరింత దగ్గరి చుట్టం లా,
ఎంతెంతో కుటుంబ సభ్యునిలా....
చేస్కున్న అయన ఇక లేరు
అయన లాంటి ఒక పెదనాన్న, ఒక బాబాయి, ఒక తాత, ఒక అన్న, మేన మామ , తమ్ముడు , చివరాకరికి ఒక బుడుగు
లాంటి కొడుకు ఉంటె బాగుండనిపించే విశిష్ట వ్యక్తిత్వం "ముళ్ళపూడి " గారిది.
కస్టాలకేం పని లేదు వాటికేం తోచక మనకొస్తాయి,
ఇష్టాలతో పనిలేకుండా వాటిని ఆహ్వానించు, ఆస్వాదించు ,
ఆనక ఆనందంగా సాగ నంపు అనే అయన జీవిత వేదాంతం అయన రచనల్లో చదివి నిజం గా ఒంట పట్టించుకున్నా..
కేవలం నవ్వుకుంటే వచ్చే కంటి తడే కాదు
తవ్వుకుంటే వచ్చే బాధ తడి కూడా నవ్వుతూ తుడిచేసుకునే నేర్పు నేర్పారు.
అయన కేమిచ్చి తెలుగు సాహితీ ప్రియులు ఋణం మాఫీ చేయించుకో గలరు ?? ( ఇవ్వాలంటే ఆయనేరి ?)
జీవితం లో నేను చూసిన అతి కొద్ది అద్భుతాలలో బాపు రమణ గారు ఒకళ్ళు ( అవును వాళ్ళు ఒకళ్లె )
ఇది రాస్తుంటే
పక్కాగాడి ఫోన్ ఎంటిరా ఇలా జరిగింది అంటూ..
భోరు మని ఏడిచే వయసు కాక పోయినా
హోరున తుళ్ళి పడుతున్న మనసుల అలల చెమ్మ ఇరు వైపులా తెలుస్తోంది.
అయన లేక పోతే మనకే ఇలా ఉంటె ఇంకా బాపుగారికెలా ఉంటుందో.
ఏమైనా మన ఏడుపు మనమే ఏడవాలి
మన కంటి తడి మనమే తుడవాలి
బాపు గారి కి
వెంకట రమణ గారి కుటుంబానికి
రమణ గారి అభిమానులందరికీ
ప్రగాఢ సంతాపం.. తో ...
ఏమి రాయాలో తోచని దిక్కులేని మనసు తో !!

6 కామెంట్‌లు:

  1. kondharu shreeralanu vadhili aatmani vadhili velathaaru. aa.. kondharilo.. Ramana garu. vaari aatma.. "Bapu" gari chelimi lo.. mamekamai undagaa.. vaarini vidadheeyadam yevari tharam. Ramana gaari maranam abhimaanulake baadhaakaram. very sad.

    రిప్లయితొలగించండి
  2. ముళ్ళపూడి అన్ని రచనలకన్నా, చిన్నప్పుడు నేను చదివి మర్చిపోలేనిది - కృష్ణ లీలలు. అందులో కన్నయ్య కధ - దానికి బాపు బొమ్మ - ఒక వేణువు, ఒక నెమలి ఈక ! సింపుల్.... ! అత్భుతం. ఆ రచైత చనిపోవడం ఏంటి ? అన్యాయంగా ? చిన్ని కృష్ణుడి కధ ఉన్నంత వరకూ, బాపు బొమ్మల్లో ముద్దుగా పొదిగి దాక్కునే వుంటారు.

    రిప్లయితొలగించండి
  3. మహానుభావులు.ప్రత్యక్షంగా హరిసేవకోసం తరలివెళ్లారు.

    రిప్లయితొలగించండి
  4. మన బుడుగు గారు ఒక సారి తన కన్న ఎంతో పెద్ద దైన రాధ తో "నువ్వేం బాధపడకు, నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాలే" అని ఓదార్చడం దానికి తగ్గట్టు బాపు గారి బొమ్మ... పడి పడి నవ్వలేక చచ్చాను (ఆ రోజుల్లో)

    రిప్లయితొలగించండి
  5. chennailo babugaru ramanagarliddaru pakka pakka illallo untarani vallu evaru vachina saadaramga ahvanisthu chakkaga maatladatharani ee madhyane telisi na paathaka hrudayam pongi poyindi. vari rachanalu bommalu chadavadam chooddame kakunda, vaari prathyakshyam ga choodochu ane anandam inka poorthiga anubhavinchaneledu..... ramanagaru "babu garini choosthe nannu choosinatle" antu thappukunnaru, mahanubhavulu... variki naa namassumanjalulu.

    రిప్లయితొలగించండి
  6. లక్ష్మి గారు మీరు పొరపాటుగా "బాపు" గారి బదులు "బాబు" గారు అని రాసినట్టున్నారు. హాయిగా లేఖిని లో గాని, బరహా లో గాని రాయండి. మీకు, మాకు ఈ తిప్పలు ఉండవు.

    రిప్లయితొలగించండి