(ఫోటో గూగుల్ ఇమజేస్ నుంచి గ్రహించ బడినది )
ఖరనామ సంవత్సర ఉగాది !! ఈ బ్లాగ్ లోకం లో ఒక మరపురాని యుగాది. ఏదో ఎవరి గోలలో వాళ్ళు గా రాసుకు పోతున్న బ్లాగ్ మిత్రులందరికీ ఒక నిజమైన పండగ గా అవతరించింది. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ పూనుకొని బ్లాగులని, బ్లాగ్ రచయితల్నీ కూడా సాహితీ సేవకులుగా గుర్తించి, గత సంవత్సర కాలం లో వాళ్ళ కృతులన్నీ పరిశీలించి వివిధ విభాగాలుగా విభజించి, అందులో చక్కటి రచనలకు పురస్కారాలు ప్రకటించింది.
వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
మొదట గా
సాహిత్య / పద్య విభాగం లో నమోదై నిత్యం కవితా పూరణ మీద అద్వితీయం గా బ్లాగ్ నడుపుతున్నకొన్ని బ్లాగులు
శ్రీ నింపే సమస్యా రావు గారి "చేతనైతే పూరించు "
శ్రీ ఎర్ర మల్లెలయ్య గారి "విప్లవ నాదం"
శ్రీ గోల బుల్లెస్వర రావు గారి "పద -రోద"
శ్రీ హరి విశ్వాసం గారి " నిత్య దైవనుతం "
శ్రీ నింపే సమస్యా రావు గారి : " చేతనైతే పూరించు " బ్లాగ్ కి ఉత్తమ బ్లాగ్ గా నిర్ణయించట మయినది.
వారి బ్లాగ్ లో ఒక మచ్చు తునక
సమస్యా: ' ...బండ గా హాయైన నిదుర బోయే !!'
పూరించిన వారు అపర చాకచక్యం గారు :
"బగలంత సీరియళ్ళు చూసి మరువంగ
ఆహార నియమము విడువంగ పిల్లలున్
భర్తయున్ అలసి నింటికి చేరంగ సొలసిన యా
పడతి ఫోమ్ బెడ్ పై బండగా హాయైన నిదుర బోయే:"
ఆధ్యాత్మికం విభాగం లో స్వదైవ నమస్మరణ పర మతదూషణ బాగా చేసిన కొన్ని బ్లాగ్ నమోదులు
శ్రీ రామదాసు గారి "అంతా రామమాయం .."
శ్రీ భోలేనాద్ గారి " జై బోలో శంకర్ "
శ్రీ తుకారం గారి "నిత్య జీవితం లో దైవ స్మరణ"
శ్రీ రెట్ట మతబాబు గారి " మా మతమే మతం"
శ్రీ వికారి గారి " మీ దేవుడికేం రావు...."
ఈ విభాగం లో శ్రీ వికారి గారి బ్లాగ్ "మీ దేవుడికేం రావు..."
అందులో ఒక ముచ్చు విరుపు
" ............ఫలానా మతం వాళ్ళు ఊరికే రొద పెడతారుగానీ, వాళ్లకేం తెలీదు. చాందసం గా ప్రవర్తించటం తప్ప. అసలా మాట కొస్తే వాళ్ళ దేవుడికే ఏమీ తెలీదు.
అజ్ఞాన వర్గాల భోగట్ట ఏంటంటే వాళ్ళ దేముడు వారానికోసారి హెలికాప్టర్ లో అర్దరాత్రి దిగడి పోయి మన దేవుడిని భక్త జన ఆకర్షణ కిటుకులూ,ధర్మ సందేహాలు అడిగి తెలుసుకొని, తెల్లారి ఏమీ ఎరగనట్లు కూర్చుంటాడట "
సాంకేతికం విభాగం లో నమోదైన బ్లాగులు
శ్రీ టెక్నో రావు గారి " మీరూ మీ కంప్యూటరు"
శ్రీమతి విద్యుల్లత గారి " షాకుల్లేని కరెంట్ "
శ్రీ జాకీ గారి " మీకు కారుందా..."
ఈ విభాగం లో శ్రీ విద్యుల్లత గారి "షాకుల్లేని కరెంటు "
అందులోని చిన్న షాక్
"ఈ సారి నా బ్లాగ్ టపా లో కరెంట్ వాడకం - పొదుపు లో మెలకువల గురించి రాస్తాను. ఎంతో మంది అభిమాన చదువరుల కోరిక పై ఎలెక్ట్రిక్ ఇంజనీరు నైన నేను ఒక ఉపయుక్తమైన టపా రాయాలని ఇది మొదలెట్టా..
సాధారణం గా మన అతివలు వంటింట్లో
మిక్సీ, గ్రైండర్ , ఓవెన్, కరెంటు స్టవ్వులు, ఇంకా బాత్ రూములో గీజర్లు, ఇలా ఎన్నో కరంటు పరికరాలు వాడతాము. వాడి మళ్ళీ బిల్లోచ్చాక బెమ్బెలేట్టటం మామూలే ...
అలా బిల్లు రాకుండా చూసేందుకు కొన్ని చిట్కాలు
మిక్సీ లో పచ్చళ్ళు చేయకుండా రోట్లో నూరుకోండి, అలాగే ఇడ్లీ పిండి కూడా అందులోనే కానిచ్చేయండి.
ఓవెన్లు , కరెంట్ స్టవ్వులు కరంటు బాగా లాగుతాయి కాబట్టి అసలవి కొనకుండా ఉంటె బిల్లు తగ్గు, ఇంకా డబ్బు ఆదా.
బాత్రూం లో గీజర్ విషయం లో .. స్నానానికి గంట ముందు బకెట్ నీళ్ళు డాబా మీద ఎండలో పెట్టి ఆనక అక్కడే స్నానం చేస్తే కరంటు సమస్యే లేదు.
హాస్యం విభాగం లో నమోదైన కొన్ని పువ్వులు
శ్రీ రుబాబు గారి : "నవ్వండి బే..."
శ్రీమతి మటం మోహ గారి : " నవ్వొస్తే ఏమనుకోవద్దు .."
శ్రీ చిరు నగేస్వరరావు గారి : "ముసి ముసి "
శ్రీ అడవి ఆర్భాటం గారి : "వికటాట్ట హాసం "
హాస్య విభాగం లో కూడా ఆడ లేడీస్ కే పట్టం కట్టాం
శ్రీమతి మటం మోహ గారి "నవ్వొస్తే ఏమనుకోవద్దు .." లో ఒక తటపాయింపు
"ఈ సారి టపా లో కూడా ముందుగా మీ అందరినీ క్షమించమని కోరుకుంటున్నా, ఎందుకంటే క్రితం రాసిన టపా లోని హాస్య తరంగం మిమ్మల్ని అంతగా తడప లేక పోయిందని మీ వ్యాఖ్యల ద్వారా తెలిసి కొంచం ఫీలయ్యా.
అందుకే ఈసారి రాసే జోక్స్ మిమ్మల్ని అంతగా అలరిస్తాయో లేదో అని నేను తటపాయిస్తున్నా ఏమైనా తిరిగే కాలు తిట్టే నోరు రాసే బ్లాగు ఊరికే ఉండవని నానుడి కదా అందుకే మరికొన్ని జోక్స్ ఈ టపా లో పొందుపరుస్తున్నా.
దయచేసి ఏమనుకోకండి ......."
ఇలా సాగింది
సినిమాలు - పాటలు విభాగం లో వెల్లువెత్తిన కొన్ని కెరటాలు..
శ్రీ పనిలేని గాలేష్ గారి " బాక్సాపీసు "
శ్రీ ముసలి వయోజన్ గారి "సినిమా కనుమా"
శ్రీమతి చిత్రా చలన్ గారి " నా పిచ్చి- ఆ సినిమాలు "
శ్రీ తరుణ్ హరన్ గారి " హాలుకే అంకితం "
శ్రీ సినికపి గారి "సినిమా పాటలు -క్విజ్ "
ఈ విభాగం లో రెండు పురస్కారాలు ఇచ్చాం
శ్రీ తరుణ్ హరన్ గారి "హాలుకే అంకితం "
టపా : నా వారాంతాలు ..టపా లోంచి రెండు వాక్యాలు
నాకు సినిమా అంటే ఎంత పిచ్చి అంటే మాటల్లో చెప్పలేను. అందుకు కారణం కూడా ఉంది లెండి, నేను పుట్టిన ఆసుపత్రి డాక్టర్ కు రెండు సినిమా హాళ్ళు ఉన్నాయి, ఆ హాళ్ళు, ఆసుపత్రి ఒకే భవన సముదాయం లో ఉన్నాయి, ఆ డాక్టరూ నర్సులూ బేరాలేనప్పుడు టికెట్లు చింపే పనిలో ఉండే వాళ్ళుట అలాంటి చోట పుట్టిన నాకు ఆ మాత్రం సినిమా పిచ్చి లేక పోవటం తప్పుకదా. అందుకే వారాంతాలు రెండు రోజులూ సినిమా హాళ్ళలో గడిపేస్తూ ఉంటాను . మిగతా అయిదు రోజులూ ఆఫీస్ లో ఎలాగు ఆన్ లైన్ మూవీస్, డివిడి లలో చూస్తూ ఉంటాలే... ఇలా నిరంతరం కాల హరణ సినిమాల ద్వారా చేస్తూ తరిస్తూ ఉంటాను...- మీ తరుణ్
రెండో టపా
శ్రీ సినికపి గారి "సినిమా పాటల -క్విజ్ "
లో ఒక ప్రశ్నా శరం
ఈ పాట ఎందులోది ? పల్లవి, సందర్భం రెండూ రాయండి
'.....నువ్వు చెయ్యలేక మంగళ వారం అన్నావే ...'
జవాబు గా
తాయారు " చిత్రం : పక్కలో బల్లెం "
పల్లవి : అనుకున్నా నేననుకున్నా నీకు చేతగాదని అందుకే ఇలా ....
అందులో హీరోయిన్ జనమాలి హీరో సాకుల్రావ్ కు గడ్డి పీకటం రాదనీ ఆట(?) పట్టిస్తూ పాడే అల్లరి సాంగ్
సినికపి : తాయారు గారు ఈసారి కూడా మీరే ముందు కరక్ట్ సమాధానం రాసారు. హాట్స్ ఆఫ్
అసలంత తయారు గా ఎలా ఉంటారు తాయారు గారూ ..?
ఇక వంటా- వార్పూ విభాగం లో నమోదులు
శ్రీమతి అమృతహస్తం గారి : మా పాకాల వంటలు
శ్రీమతి పుష్టి వర్ధని గారి : మృస్టాన్నం
శ్రీమతి ఆశ గారి : పెసర మొలకలు
శ్రీ గరిట తిప్పేస్వరరావు గారి : " మోగాళ్ళే వంటలో మొనగాళ్ళు "
ఈ వంటా-వార్పూ విభాగం లో
శ్రీమతి ఆశ గారి " పెసర మొలకలు " లో ఒక మొలక టపా
" కొత్తిమీర తరుగుడు లో మెళకువలు "
అందులోంచి కొంత తరుగు (అంటే తరిగినది అని)
కొత్తిమీర రోజూ వాడతాం. అయితే అది తరుక్కోవటం కొంచం కష్టమని కొంతమంది చదువరులు నన్ను ఒక టపా రాయమని కోరారు
వాళ్ళ కోరిక మీద ఈ టపా తరిగాను, సారీ రాసాను.
ముందుగా కొత్తిమీర కట్ట నీళ్ళలో ముంచి వెల్ల కున్న మట్టి పోయే దాకా కడగాలి
కట్ట విప్పకుండా కట్టింగ్ ట్రే మీద పెట్టి కుడి చేత్తో కట్ట ఆకులు చేతి కింద వచ్చేలా పట్టుకొని వేళ్ళు బయటకు ఉండేలా చూస్కోవాలి, ఇప్పుడు కత్తి ఎడమ చేత్తో పట్టుకొని జాగ్రత్తగా కోయాలి. ఇప్పుడు తరిగిన వేళ్ళు బిన్ లో పారేసి ఆకులు మాత్రం చిన్న చిన్న గా తరుక్కోవాలి. ఇలా తరిగిన ఆకులు కూరల్లో, చారు లో, పప్పు లో వేసుకోవచ్చు. కుడి చేతి వాటం వాళ్ళు నే చెప్పిన పద్ధతి రివర్స్ లో చేయ్యాలండోయ్. నాది ఎడమ చేతి వాటం లెండి.
ప్రత్యేక పురస్కారం గా తిప్పేస్వరరావు గారి టపా బంగాళ దుంప ఎపుడు కి ఇవ్వబడింది.
దాంట్లోంచి చిన్న ముక్క
" ఈ సనాదారాలు గాలి తిరుగుడు తిరక్కుండా ఇంటికాడనే ఉన్న గా, అందుకే నోటికి కారం గా ఏదన్నా తినాలనిపించి కూరల బుట్ట ఎతికా ... నాలుగు పెద్ద దుంపలూ
రెండు బుడ్డ ఉల్లి గడ్డలు కానడ్డాయి. ఎంటనే అవి తరిగి, పొయ్యి మీద మూకుడెట్టి అందులో రెండు కిలోల చమురేసి ముక్కలు ఏపేసి ఆనక పావుకిలో ఉప్పు కారం దూసేసి, ఏడి అన్నం లో ఏస్కోని కుమ్మేసా....."
ఇక పోతే మిగతా చిల్లర బ్లాగుల్లో
శ్రీ భేతాళ్ గారి బాక్స్ బద్దలు కొడతా
"...నాయాల్ది ఆ నాకొడుకులు అసలు మా కులపోల్ల జోలికొస్తే ఈ సారి నా బ్లాగులో రక్తం కారేలా (ఎవరికి?) రాస్తా .......
శ్రీ లడ్డు గారి గారి " తినదగు నెవ్వరు పెట్టిన "
"ఆ రోజు కూడా ఎప్పటిలాగే మా ఇంట్లో భోంచేసి పక్క వీధిలో ఉన్న మా చిన్నక్క ఇంటికేళ్ళా, వాలింట్లో ఆ పూట తలకాయ మాంసం, ఇంకా తప్పేదేముండీ మళ్ళీ కూర్చున్న బోయినాలకి...."
శ్రీ చలనం గారి " మగాడు తిరక్క చెడ్డాడు "
"...జంట నగరాలలో ఉన్న అందమైన ఆడాల్లందరూ ఎమన్నా ఇబ్బంది వస్తే( ఏమి ఇబ్బంది?) నా నెంబర్ కి ఫోన్ చెయ్యండి నేను అంతుచూస్తా ఇబ్బందిదేలే... "
( ఈ బ్లాగ్ లో రచయిత అందమైన ఫోటో అదుర్స్ ..మరియూ ఉచితం కూడా)
శ్రీమతి ఉల్లాస గారి "మనసా కొట్టుకోకే "
"....పేరుకి ఆనందం గా ఉన్నా నా మనసెప్పుడు ఎందుకో ఒకందుకు కొట్టుకుంటూ ఉంటుంది, ఎందుకో తెలీదు, తెలిస్తే చెబ్దురూ ......"
శ్రీ మొగ్గ గారి " సరసం విరసం "
" అప్పుడు నేను ఇంటర్ ఐదో సంవత్సరం చదువుతుండే వాడిని , మా పక్క ఇంట్లో కొత్తగా ఒక జంట అద్దెకి దిగారు, ఆమె బాగుంది కదా అని మొదటి రోజే లైను వేసా
వారం తిరిగే సరికి వాళ్ళ అయన లైను లో నేనే పడ్డా, ఇప్పటికీ ఆయనా నేను ఇద్దరం కలుస్తూనే ఉంటాం. ఆ సరదాయే వేరు.
శ్రీమతి మృణ్మయ గారి " నా కెమెరా విన్యాసం "
ఆ రోజు మా పెళ్లిరోజు గుడి కెళ్ళాం. శ్రావణ మాసం అవటం వల్ల అమ్మవారి గుడి బాగా రష్ గా ఉంది పూజారిగారు శఠ గోపం పెట్టి అక్షింతలు వేసారు.గుడి లోంచి బయటకి వచ్చేసరికి సన్నగా వాన, రొమాంటిక్ గా ఉంటుందని తడుస్తూనే ఇంటికేల్లాం, మా అయన వెనక నుంచి వచ్చి నా తలలో ఏవో చిన్న చిన్న మొలకలు ఉన్నాయని చెప్పారు, వెంటనే చూస్కుంటే అవి అక్షింతలు వానకి మొలకలోచ్చాయి. అద్దంముందు నా కెమేరాతో నేనే ఫోటో లు తీస్కున్నా
బుజ్జి ముండలు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి
(స్థలా భావం వల్ల ఫోటోలు ఇప్పుడు పెట్టలేదు)
శ్రీ చంచా గారి " విపరీత నటుడు చిరాయువు "
మన అభిమాన నటుడు చిరాయువు ఆయన తమ్ముళ్ళు మేనల్లుళ్ళు, మనవళ్ళు నటించిన చిత్రాలు ఈ వారం విడుదల సందర్భంగా అందరికీ (మాకెందుకూ ?) అభినందనలు .....
వీరందరికీ ప్రత్యేక ప్రశంసా పత్రాలు ఇవ్వబడతాయి.
ఇంకా వేరే వాళ్ళని బూతులు తిట్టటానికి, దుమ్మెత్తి పోసే బ్లాగులను పరిశీలించి అనర్హం గా నిర్ణయించాం.
రాష్ట్ర ప్రభుత్వం మాదే కనుక మా పార్టీ కి వ్యతిరేక బ్లాగులు ప్రతిపక్ష అనుకూల బ్లాగులూ చూడనే లేదు.
విమర్సలకు బెదిరి అసలు రాజకీయ బ్లాగులనే పక్కన పెట్టాం.
కొస మెరుపు: అందరి మీదా పడి ఏడ్చే ఆత్రేయ బ్లాగ్ " లిపి లేని భాష " తీసి తుంగలో తొక్కాం.
ఇది సరదా కోసమే కానీ ఎవ్వరినీ కించపరచాలని కాదు.
:D :D
రిప్లయితొలగించండిఅలాక్కాదుగాని,, మీ బ్లాగును తుంగలో తొక్కినందుకు ఈ అవార్డులన్నీ మీరే తీసేసుకోండి.. ...
రిప్లయితొలగించండిఇప్పుడు తరిగిన వేళ్ళు బిన్ లో పారేసి .....ఏ వేళ్ళు? చేతి వేళ్ళా లేక కొత్తి మీర వేళ్ళా?:-))))))
రిప్లయితొలగించండి@అను: రెండు చుక్కలు పెద్ద D అలా రెండు సార్లు అంటే ఎంటండి ?
రిప్లయితొలగించండి@జ్యోతి: మీ సూచన ఆత్రేయ గారికి పంపబడినది. -పురస్కార సంఘం
@నీలాంచల: మీరూ తరిగితే ఏవి కట్ అవుతాయి . వేళ్ళు అంటే మొక్క చివర భూమిలో ఉండే భాగం. అవి తినరు.
:-)) ఉగాది శుభాకాంక్షలు
రిప్లయితొలగించండినాయనా బజ్షీ, "చేయలేక మంగళవారం" జోకులు కూడా బ్లోగుల్లో వస్తున్నవా నాయనా? అంటే, నీకు అవిమాత్రమే కనపద్దవా అంటావు..
రిప్లయితొలగించండిఅన్నీ చాలా చాలా నచ్చినాయ్. లిపి లేని బ్లాగు ఎంత వెదకినా తుంగలో దొరక లేదు. ఎప్పాటికో బయటకి వచ్చి గుర్తింపు పోందుతుంది.
బాబాయ్
@రమణి ఉగాది శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి@బాబాయి : మన సినిమా పాటల్లో మాటల్లో ఒక్క మంగళ వారమేంటి, అన్ని వారాల బూతులూ ఉన్నాయ్. కేవలం ట్రెండ్ చూపటానికే తప్ప నాకేమీ ప్రత్యేక శ్రద్ధ లేదు ఆ పాటల మీద.
ఉగాది శుభాకాక్షలు
ఆత్రేయ--మీ మిగతా టపాలన్నిటి లో కన్నా ఈ టపా లో అశ్లీలం, హింస, వెటకారం అన్నీ ఎక్కువయ్యాయి. ఎందుకంటారు ?
రిప్లయితొలగించండినిజమే అజ్ఞాత !! విజయ్ మాల్యా, రాంగోపాల్ వర్మ, ప్రభావం నామీద ఎక్కువయింది.
రిప్లయితొలగించండివెటకారం మాత్రం నా సొంతం.
BRILLIANT!! still laughing.
రిప్లయితొలగించండిసదరు బ్లాగర్లందరూ మీమీదకి కేసులు పెట్టేందుకు వస్తే దిట్టమైన లాయర్ను సిద్ధం చేసి ఉంచండి!
@కొత్తపాళీ : ధన్యవాదాలు. సదరు బ్లాగ్ ఓనర్లు వస్తే పురస్కారాలతో ఎదుర్కుంటా...
రిప్లయితొలగించండివినలేదా.....ఎంత రాసినా, ఎంత దూసినా ... ఎంత వారాలైనా ............
ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరిని పేరడీ చేసారో అస్సలు గుర్తుపట్టలేకపోయానండి ఒక్కరిని తప్ప :( మిగతావన్నీ ఎంత ఆలోచించినా తట్టట్లేదు. ఓ 2-3 గెస్ చేస్తున్నాగానీ డౌటే.
రిప్లయితొలగించండిఅది పక్కనపెడితే మీరు రాసిన విధానం చాలా నవ్వు తెప్పించింది....బలే నవ్వుకున్నాను. :)
@సౌమ్య నవ్వుకున్నందుకు థాంక్స్. మీరు కనుకున్న ఆ ఒక్కరు ఆ ఒక్కరు కాదేమో , అసలవి ఎవరి పేరడీలూ కావు, నాకై నేను రాద్దామనుకున్నా వివిధ టపాలు. అయినా అవార్డు లన్నీ నాకే దానమిచ్చాకా ఇంకెవరికీ ఆ అవకాశం ఇవ్వను కాక ఇవ్వను.
రిప్లయితొలగించండినవ్వినా వాళ్లకి, రువ్విన (రాళ్ళు) వాళ్లకి అందరికీ
ఈ ఆనందం లో నేను పాడే పాట...
కోటి దండాలు.. శతకోటి దండాలు ..
నలభై ఐదు కూ నాలో రేగిన ఈ మర్కట భావాలకూ
కోటి దండాలు .. శతకోటి దండాలు..!!