17, ఏప్రిల్ 2011, ఆదివారం
ఐ లవ్ వంశీ
నాకూ వంశీ కు మధ్య ప్రేమ
ఇది చూడగానే నేనేదో ఆ టైప్ అనుకోకండి. నిజ్జం గా ఐ లవ్ వంశీ.
అవును ఆ వంశీ నే.... ఎందుకని వంశీ ని అంతగా లవ్ చేస్తున్నాను ? ఏమో నాకు క్లారిటీ లేదు.
బహుసా వంశీ రచనల్లో ఎప్పుడు చూడని కొత్త లోకం ఉంటుందనా ?
లేక మన చుట్టూ ఉన్న లోకాన్నే దిగంబరం చేసి (రాసి) చూపుతాడనా ?
ఎటువంటి కౌపట్యం లేని సాదా సీదా మనిషనా?
లేక భావోద్వేగాలు కూసింత ఎక్కువున్న కళారాధకుడనా ?
సినిమాల సంగతి పక్కన పెడితే, రచయితగా అయన మాత్రం నాకు లవబుల్ మాన్.
చాలా సార్లు అనుకుంటా వంశీ లాంటి మిత్రుడుంటే, భలే ఉంటుందే అని. నా మిత్రుడైన వంశీ దర్సకుడవక్కర్లేదు . రచయిత కూడా కానక్కర్లేదు. అసలు లోకం లో జనాలకి తెలియక్కర్లేదు. నాకు మాత్రమే తెలిసి, అయన చదివిన పుస్తకాలు నాకు వివరిస్తూ ... సైకిలేసుకొని గోదారెంట వెళుతూ ఏ కిళ్ళీ కొట్లోనో సోడా కోసం ఆగి కాసిని సోడా నీళ్ళు మొహమ్మీద పోస్కోని భలే ఉంది బాసూ అనుకుంటూ, ఆనక బయలు దేరి చిన్న గోల్డ్ ఫ్లాక్ సిగరేట్టన్టించి గట్టిగా దమ్ము లాగి, ఈ గోదారంటే నాకు భలే ఇష్టం బాసూ అని చెబుతూ.. ఏ మాధవ రావు హోటల్లోనో వేడి ఇడ్లీలో పెసరట్లో తినిపించి అయ్యాక ఏ కొబ్బరి చెట్ల సందునో దూరి పడుకొని ఆకాశం వంక చూస్తూ, జీవిత మంటే ఇంతే, ఏదో లేదని ఉన్న సుఖాన్ని పోగొట్టుకో కూడదు అని హితభోధ చేసే వాడై ఉండాలి.
ఏం మాయరోగం వీడికి పాత టపాల్లో కొన్నింట్లో చాలా నీతులు చెప్పాడు. ఇప్పుడేమో మారుమూల పల్లెలో వంశీ తో రొమాన్సు ఆడాలని ఉవ్వి ళ్ళూరుతున్నాడని అనుకో బాకండి.
గత నెల రోజుల పైగా విపరీత మైన పని వత్తిడి తో మతి కొంచం చలించి, దారి తప్పి కరీం బీడీ కావాలని, తాటి కల్లు కావాలని, వంశీ లాటి మగాడితో మధుర క్షణాలు గడపాలని కోరుకుంటోంది.అది దాని తప్పు కాదు.
నా తప్పూ కాదు. చాలా రోజుల తర్వాత ఈ రోజు పూర్తిగా ఖాళీగా ఉంది " వంశీ కి నచ్చిన కధలు " పుస్తకం చేబూని యాదృచ్చికం గా చదవటం చేశా. ఎన్నో సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ కొత్త గా అనిపించే , ప్రసిద్ధ రచయితల యాభై కధలు ఒక పుస్తకం గా అచ్చేసి, ప్రతీ కధ చివర ఎందుకు నచ్చిందో అన్న విషయం చిన్నగా తాళింపెట్టి మరీ ఒదిలారు.
ఈ అర్దరాత్రి ఎవరికీ చెప్పను ఆ కధల మత్తు మహత్తు. ఇలాంటివి చెప్పుకొని ఆనందించే మా ప్రెబాకరు గాడు ఇదివరలోలా స్పందిచట్లేదు. పక్కనున్న మా ఆవిడ కి వివరిద్దామా అంటే అప్పటికే సైలెన్సర్ తీసేసిన లూనా లా గుర్రు గుర్రు అంటోంది, పోనీ ఇంజను ఆపి విషయం చెబ్దామా అంటే మంచం మీద నుంచి నన్ను కిందకు తోసేయగలదు. అన్న భయం ఉంది. అప్పుడు ఉన్నట్టుండి గుర్తొచ్చింది.
నా లిపిలేనిభాష లో భాద పడి చాలా రోజులయింది అని. అంచేత ఆ పుస్తకం గురించి మీతో పంచుకుందామని ఇలా మొదలెట్టా. వివిధ విషయాంశాల తో , మాండలీకాలతో, ప్రదేశ వర్ణనలతో, ఉన్న ఆ కధలు వంశీ గారికి నచ్చటం ఏమంత కొత్త విషయం కాదు. చాలా కధల్లో కధావస్తువు రాత్రి ,అడవి,నది, వాన కొండ ప్రాంతం ఇలా ఉన్నాయి. నాకెందుకో చిన్నప్పటి నుంచి ఏజెన్సీ ఏరియా అన్నా కొండలు గుట్టలన్న భలే ఇష్టం , వాటి చుట్టూ తిరిగే కధలుంటే అందునా చేయి తీరిన రచయితలు రాసిన వంటే ఇక చెప్పక్కర్లేదు. బహుశా వంశి గారికి కూడా అలాంటి ఇష్టమే ఉంది అనుకుంటా.
ఆ పుస్తకం మొదటి సారి చదివి నప్పుడు ఒక విచిత్రమైన పోలిక తో కూడిన జ్ఞాపకం, చాలా ఏళ్ళ క్రితం వృత్తి పరం గా నాకో స్నేహితుడుండే వారు వయస్సులో నాకన్నా ఇరవై ఏళ్ళు పెద్ద. వృత్తి రైల్వే కాంట్రాక్టర్, కెరీర్ లో అప్పుడప్పుడే పైకి వస్తున్న నాకు ఆయన వ్యాపార దక్షత చూస్తే భలే ఆశ్చర్యం గా ఉండేది. ఆయనింటికి ఎప్పడన్నా మధ్యాన్నం వెళితే భోజనం చేస్తూ నన్నూ రమ్మనే వారు. నేను చేయనని ఒద్దంటే కొంచం టిఫిన్ తినండని, భార్యకు పురమాయించే వారు. మీరు నమ్మరు ...ఆమె సుమారు పదిహేను అంగుళాల వ్యాసమున్న పెద్ద ప్లేట్ లో రకానికొకటి చొప్పున కజ్జికాయ, పాలకోవా, లడ్డు , జిలేబీ చుట్ట, బర్ఫీ, నాలుగు గవ్వలు రెండు చేగోడీలు, ఒక జంతిక , గుప్పెడు కారప్పూసా, గరిటెడు బూంది, ఇలా మొత్తం నింపేసి , ఆయన భోజనమయ్యే లోపు ఈ కాసిని నమలండి అని తెచ్చిపెట్టేది. నేను అన్నీ ఒక్కక్కటే తింటూ, లడ్డు మధ్య లో చేగోడి కొరికి, కారప్పూస తింటూ కోవా కొరికి, ఇలా చాలా హడావిడి పడేవాడిని. విడివిగా తిన్నా, కలిపి తిన్నా, కొంచం కొంచం తిన్నా, మొత్తం తిన్నా భలే రుచి గా ఉండేవి తియ్యగా కమ్మగా ఆ స్నేహితుడి ప్రేమంత హాయిగా, ఆమె అభిమానమంత చల్లగా.
అలాగే ఈ కధలు చదువుతూ అనుభూతి పొందుతూ ఒక కధ లోంచి ఇంకో కధ లోకి, ఒక పేజీ లోంచి ఇంకో పేజీ లోకి దూకుతూ అవి సంకలన పరచిన వంశీ గారి అభిరుచి కి జేజేలు చెప్పుకుంటూ ఉంటాను.
ఈ పుస్తకాన్ని సమీక్షిస్తూ చాలా బ్లాగుల్లో టపాలు వచ్చి ఉండొచ్చు. అయినా వంశీ ని ఇంతగా ప్రేమిస్తూ నేనూ మెచ్చుకోలు మాటలు రాయక పోతే చదివిన పుస్తకం లో లైనులు లెక్క పెట్టినంత పాపం.
చివరగా పైన చెప్పిన పోలిక లోని నా మిత్రులు శ్రీ ..... గారు ఎంతో పెద్ద వ్యాపారవేత్త అయుండి, విధివశాత్తు ఆర్ధికం గా దెబ్బతిని, కనుమరుగై ఎక్కడో దూరంగా మళ్ళీ జీవితం ప్రారంభించారు.
అయన మళ్ళీ బాగా పుంజుకుని పూర్వపు వైభవం తెచ్చుకుని, అయన భార్య నాకు థాలీ నిండా తినుబండారాలు పెట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
nice post.madhilo medhile bhaavaavesham panchukovadaanike..aksharam undhi.. ani mee..ee.. post cheputhundhi..tharachu.. vraayandi.. Thanak you.
రిప్లయితొలగించండి"నేనూ మెచ్చుకోలు మాటలు రాయక పోతే చదివిన పుస్తకం లో లైనులు లెక్క పెట్టినంత పాపం" ...:)
రిప్లయితొలగించండిబాగున్నాయండి వంశీ కబుర్లు.
భాగా రాసారు !
రిప్లయితొలగించండిఈ పుస్తకాన్ని సమీక్షిస్తూ చాలా బ్లాగుల్లో టపాలు వచ్చి ఉండొచ్చు.>> అవును వచ్చాయి కాని మీ సమీక్ష మాత్రం కొత్తగానే ఉంది, ఇది మీకు ఆ పుస్తకం ఎంత నచ్చిందో చక్కగా చెబుతుంది .
మీతో పాటు గా నేను కూడా మీ మిత్రుడు బాగా పుంజుకుని పూర్వపు వైభవం తెచ్చుకోవాలి అని కోరుకుంటున్నాను .
btw నాదో సలహా మీ ఆవిడ గారికి మాత్రం మీ ఈ పోస్టు ఈ ఆదివారం బాగా సుస్టు గా (అంటే రాత్రికి తినకపోయినా పర్వాలేదు అన్నట్లు ) తిన్నాకా ఈ పోస్టు చూపించండి , లేకపోతే పాపం సెలవు రోజు ఉపవాసం ఉండాలిసోస్తుంది :)
emandee cheppatam marichaanu ee roju mee, maa ,mana vamsi gaarki buddhavarapu chaaritable trust tarapuna rajamundry lo sanmaanam vundi.
రిప్లయితొలగించండిgodarenta velthu ye killi kotlono sodatho moham kadukkuni, kobbari chettu needalo ala vaali akasam chooddam ..... eppudu choodaledu anubhavinchanu ledu kaani mee raathalu aa anubhavanni kaligichayi... thnks andi.
రిప్లయితొలగించండి@వనజ :అవును పుస్తకం మంచి నేస్తం, చదవటానికైనా , రాయటానికైనా
రిప్లయితొలగించండి@త్రిష్ణ: మంచి రచయిత గురించిన కబుర్లు ఎప్పుడు బాగుంటై
@శ్రావ్య : నా భావాలు మీరూ భావించి నందుకు ధన్యవాదములు ( వంశి & నా స్నేహితుని బాగు)
@msr : మా అందరి తరుపునా వంశి గారికి అభినందనలు తెలుపండి
@ లక్ష్మి: అనుభవించటానికి గోదారే అక్కర్లేదు ఉన్నచోటే మనుషులతో మనుషుల మధ్య భౌతికం గా మానసింకం గా ఉంటే చాలు లైఫ్ ఈస్ బ్యూటిఫుల్
I love Vamsy......and the count goes on..........
రిప్లయితొలగించండిహృదయ స్పందనలకు అక్షరరూపమే రచనలు ...వంశీరచనలు
రిప్లయితొలగించండి(వర్డ్స్ వర్త్ మహాశయుడి మాటలలో..)
శ్రీదేవి
బాబాయ్ ఎంత బాగా చెప్పారు .. :)
రిప్లయితొలగించండిమీకో విష్యం తెల్సా చిన్నప్పుడు ఏదో టేలెంట్ టెస్ట్ రాయడానికి ఎదురులంక రేవు వెళ్లి గోదావరి మీద లాంచి లో కాకినాడ వెళ్ళాం .. ఆ రోజు రాత్రి తిరిగి వచ్చేప్పుడు .. లేట్ అయ్యి .. వెన్నెల్లో గోదావరి చూసాను తెల్సా ..
మీరు కుల్లుకునే ఇంకో విషయం .. అక్కడే గోదారి గట్టు మీద ఏదో పాక హోటల్ లో .. కలర్ షోడ తాగి మైసూర్ బజ్జి తిని గంట సేపు కబుర్లు చెప్పుకుని .. తర్వాత పంటి ఎక్కి ..
మీరు రాసిన పోస్ట్ చూసి .. అక్కడకి వెళ్ళిపోయా ..
వంశీ గారు అంటే .. నేను అయన పుస్తకాలెం చదవలేదు కాని .. స్వాతి లో అయన పసలపూడి కధలు కొన్ని చదివా .. ఒక కదా నాకు గుర్తుండిపోయింది .. ఒక గ్రహణం మొర్రి ఉన్న అమ్మాయి కధ చాల హత్తుకునేలాగా ఉంటుంది ..
ఇప్పుడు మీరు రాసిన ఈ బుక్ నాకు చదవాలని ఉంది . ఎలాగా ??? స్కాన్ కాపి ఏమైనా దొరుకుతుందా ??
ఒక థాలీ నిండా ఉన్న వివిధ తినుబండారాలు ,
రిప్లయితొలగించండిఒక మంచి పుస్తకం లోని వివిధ రచనలు,
మీ పోలిక చాలా బాగుంది
నేనూ చాలా సార్లు ఇలాంటి హడావిడి పడిఉన్నా,
అది గుర్తొచ్చి నవ్వుకున్నా..
కీప్ రైటింగ్ !!
@ కావీ..
రిప్లయితొలగించండినేనేం కుళ్ళు కొను అలాంటి అనుభవాలు నా జ్ఞాపకాల పొది లో కో కొల్లలు
ఏటి మీది గోదారేటి ?
స్కాన్ కాపీ లేదు పైరసీ ఆక్ట్ ఒప్పుకోదు
ఇండియా వచ్చినప్పుడు కొనుక్కో లేదా తెప్పించుకో.
@ రాగిణి ఆ హడావిడి భలే ఉంటుంది ధన్యవాదాలు
ఇంత రాసి అసలు విషయం రాయడం మర్చిపోయా .. హ్మ్
రిప్లయితొలగించండిమంచి చేసిన వారికి దేముడు ఎప్పుడు మంచే చేస్తాడు .. మనుషులు మోసం చెయ్యచ్చు కాని దేముడు చెయ్యడుగా ..
ఆయన తప్పకుండా పూర్వ వైభవం తెచ్చుకుంటారు .. ఆయన చల్లగా ఉండాలి అని మనసార కోరుకుంటున్న ..