2, సెప్టెంబర్ 2011, శుక్రవారం
గణేషుని ఒకరోజు...
లొకేషన్ : హై ప్లేస్ గణేష్ లోకం
వినాయక అవెనూ
గణనాధ టవర్స్
పదహారో ఫ్లోర్ సుమారు కొన్ని లక్షల చదరపు అడుగుల వైశాల్యం ఉన్న బహుళ అంతస్తుల భవనం అది. అందులో పదహారో ఫ్లోర్ లో వేల చదరపు అడుగుల ఆఫీసు. నలువైపులా గాజు పలకలతో కట్టిన సోఫీస్టికెటెడ్ కార్యాలయం. హిందూ మతాచారం ప్రకారం విఘ్నాలని తొలగించి, ఆశీర్వదించే గణాధ్యక్షులవారి కార్యాలయం కాబట్టి, చాలా అధునాతనంగా ఉంది. దేవుడు ఒక్కడే కానీ కొలిచే వాళ్ళు వందల రకాలు కాబట్టి
ఆ ఫ్లోర్ అంతా క్యూబికల్స్ తో విభజింపబడి అన్నీ సీట్లలోను వినాయకుడే వివిధ రూపాలతో, వివిధ సంస్కృతులతో వివిధ ప్రాంతాల భక్తుల పూజలందుకొంటూ వాళ్ళ వాళ్ళ ఫైల్స్ చూస్తున్నాడు.
అన్నీ క్యూబికల్స్ మీద ప్రాంతాల పేర్లు రాసి వున్నాయి . కోస్తా వినాయకుడు, తెలంగాణా గణేష్, ఉత్తరఆంధ్రా విఘ్నేశ్వరుడు , సీమ గణపతి, ఏరియాల వారీ కాబిన్లు వాటిల్లో వివిధ వినాయక సాములు ఆసీనులై సీరియస్ గా ఫైళ్ళు చూసుకుంటున్నారు. కొంచం దూరం గా వేరే రాష్ట్రాల కాబిన్లు ఉన్నాయి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు.
మా టీవీ సున్నా ( టీవీ 0 ) విలేఖరి తెలుగు వాడు కాబట్టి ఫోకస్ తెలుగు కేబిన్ల పై మాత్రమే చేసాడు.
ఆ టైం లో సున్నా టీవీ విలేఖరి మొబైల్ మోగింది. ఫోనులో న్యూస్ రీడర్ కుతూహల, విలేఖరి గ్రాహక్ ని అడుగుతోంది " గ్రాహాక్ అక్కడ పరిస్థితేంటి ? "
విలేఖరి గ్రాహక్ " కుతూహలా ఇక్కడ పరిస్థితి చాలా సందడి గా ఉంది మన ప్రభుత్వ కార్యాలయాల్లోలా కాక ఇక్కడ అందరూ సీట్లలోనే ఉన్నారు ఎవరి పని వాళ్ళు చూస్తున్నారు" అన్నాడు.
"ఇంకా ఏమి జరుగుతోంది గ్రాహక్ ?" ఆత్రం గా కుతూహల.
"కుతూహలా జరిగేది, ఇంకా, ఇక్కడ, చెప్పాలంటే ,నిరంతరం వార్తలు, ఉన్నాయి " అంటూ ...కొన్ని పడికట్లేసి... కెమెరా ఆన్ చేసాడు.
తెలంగాణా గణేష్ పక్కన కేబిన్ల వైపు చూస్త "ఏంటి భాయ్ మీ ఆంధ్రోల్ల కి మా వాళ్ళని సూసి కాపీ కొట్టుడు ఎక్కువైంది పెద్ద పెద్ద విగ్రహాలూ, పెద్ద లడ్డూలు, భుజంనికి సెమ్కీ గుడ్డలూ, తలకి కాషాయ రిబ్బన్లూ అంతా మా వాళ్ళని కాపీ యే అన్నాడు టీసింగ్ గా.
కోస్తా ఆంధ్ర వినాయకుడు క్యూబికల్ పార్టిషన్ మీంచి చూస్తూ " ఏంటి గణేష్ మీ వాళ్ళు మాత్రం చేసేదంతా సొంత స్టైలా పాడా మహారాష్ట్ర వాళ్ళని ఉత్తరాది వాళ్ళనీ చూసి అనుకరిస్తున్నదే కదా" అన్నాడు రిటార్ట్ గా.
" పైగా మా ఆంధ్రా వాళ్ళ బిరియానీ పేడలా ఉంటుంది, వంటలు అదేదోగా ఉంటాయి, మీ పూజార్లు ముదుర్లు, మా వాళ్ళు లేతకువ్వలూ అనే మీ వాళ్లకు మా గోదావరి వంట వాళ్ళ లడ్డు తప్ప గతిలేదా? మీ దగ్గర అంత పెద్ద లడ్డు చేసే బావర్చీలు లేరా? " అన్నాడు వెటకారంగా.
తెలంగాణా గణేష్ కొంచం ఇబ్బందిగా చూస్తూ " గదేమ్లేదు ఏదో మీ వైపోల్లని పైకి తెద్దామని ..." అంటూ ఉండ్రాళ్ళు నమిలాడు.
ఉత్తరాంధ్రా విఘ్నేశ్వరుడు మిగతా అందరినీ చూస్తూ " ఈసారి రికార్డ్ లడ్డు మాదే 6000 కిలోలు, లడ్డూస్ బుక్ అఫ్ రికార్డ్స్ లోకి మేమే ఎక్కుతాం" అంటూ గీర పోయాడు.
తెలంగాణ గణెష్ "మా వాళ్ళు ఏదో ఉద్దెమం హడావిడి లో ఉంది ఈ సారి ఛాన్స్ మీకోదిలారు గానీ పెద్ద లడ్డూలు పెద్ద విగ్రహాలు ఏదైనా మమ్మల్ని కొట్టేవాల్లుందరు. అసలు ఈసారి మా వాళ్ళు విగ్రహాల విషయం లో కొంచం ఎక్కువ ఆలోచించే వాళ్ళు , బుద్ధ విగ్రహానికి పది రెట్లు విగ్రహం పెడదామని అనుకున్నారు కానీ మానుకున్నారు. అసలే హుస్సేన్ సాగరంతా ఆల్ రెడీగా విగ్రహాలున్నాయి కదా మల్ల ఇది కూడా సాలదని ఊరుకున్నారు. మీ పుల్లారావులు అడ్డం పడక పోతే త్వరలో మా సొంత రాష్ట్రం లోమా సొంత లడ్డూలతో, మా సొంత స్టైల్లో చాలా రికార్డులు నెల కొల్పుతాం. అప్పుడు మాట్లాడండి " అన్నాడు ఆశావహం గా. పైగా
తెలంగాణా గణేష్ కోస్తా వినాయకుడుని చూస్తూ "ఇది చూడయ్యా మీ దగ్గర ఒక ప్రధాన నగరం లో ఇద్దరు నాయకులు పోటీలు పడి విగ్రహాలు పెట్టారు. లడ్డూలు కూడా పోటీలు పడ్డాయి . ఇలాంటి వీధి నాయకులు ఎంతమంది ఉంటే అన్ని విగ్రాహాలు నీకు,. ప్రజా సేవ లో లేని పోటీ తత్వం వినాయక సేవ లో ఉండటం గుడ్డిలో మెల్ల కదా." అన్నాడు.
సీమ గణపతి సీట్లోంచి కేచి రెండు చేతులూ పైకెత్తి వేళ్ళూ కలిపి వెనక్కి తిప్పి మెటికలు విరుచుకొని " అబ్బ ఆపండి మీ గోల అసలే మా వైపు ప్రజల కన్నా పాలకులే భక్తెక్కువై ఆ మైకం లో గుల్లల్లోకి చెప్పులు టక టక లాడించు కుంటూ వస్తుంటే మీరేంటి లడ్డూ సైజు, విగ్రహం సైజు అంటూ పాత విషయాలు మాట్లాడతారు ? " అన్నాడు నిరశన గా. ఇంకా దారుణం ఏంటంటే ఆస్పత్రుళ్ళలో డాక్టర్లు వినాయక చవితి భక్తి లో మునిగి " పదిమంది పైగా పిల్ల మరణానికి కారణమయ్యారు " అంటూ దుష్ప్రచారం తప్పు కదా. అయినా వాళ్ళు మాత్రం మనుషులు కారా ... నన్ను పూజించుకోవద్దా? ఏమైనా జనానికి ఇవేమీ పట్టవు. రెండు రోజులు సెలవుమీద ఉంటే ఇంత గోల చేస్తున్నారు."
మిగతా ఏరియాల వినాయకుళ్లన్తా ఫైళ్ళు పక్కన పెట్టి సీమ గణపతి చుట్టూ చేరారు ఏమిటా చెప్పుల గోల మాకు చెప్పు అంటూ..
అప్పుడు సీమ గణపతి కొంచం పానకం తాగి గొంతు సవరించు కొని " ఆ ఏముందీ ఎప్పటిలాగానే మా ప్రాంత నాయకి ప్రభుత్వం తరుపున నాకు పట్టు బట్టలు పెట్టడానికి వస్తూ చెప్పులు విడవలేదని మా ప్రజలూ, గుళ్ళో పూజార్లు దుమ్మెత్తి పోశారు. అయినా ఆ రుణసుందరి కి ఇదేం కొత్త కాదుగా ఆమె వెనక పోనీటైలు వంకర కదా" అన్నాడు కసిగా.
ఇంతలో టీ బ్రేక్ బెల్ మోగింది... అందరూ కాంటీన్ కేసి నడిచి బల్ల చుట్టూ కూర్చొని ..ఇలా అనుకున్నారు.
"ఈ మనుషులకి ఎప్పటికి బుద్ది వస్తుందో ?
భక్తంటే భారా ఖర్చు కాదనీ
పూజంటే భారీ సైజు కాదని
శ్రద్ధ అంటే చెప్పులు మేక్అప్ లు కాదని
జీడి పప్పులతో,
వెయ్యిరూపాయల నోట్లతో,
టన్నుల కొద్దీ ఆపిల్ పళ్ళతో
కూరగాయలతో చేసే విగ్రాహాల ఖర్చు బదులు
భక్తి తో చేసే ఒక్క నమస్కారం దేవుళ్ళని చేరుతుందని"
అన్నార్తులకి పిడికెడు కూడు పెట్టని పూజ, బండెడు ప్రసాదం తో చేసినా అది దండగేననీ..!! తీర్మానించి,
ఇష్టం లేక పోయినా లంచం తీస్కోని పనిచేసే మామూలు ఉద్యోగుల్లా
వాళ్ళ ఫైళ్ళు చూడటానికి సీట్లలోకి వెళ్ళిపోయారు.
మన గ్రాహక్ కుతూహల ని దగ్గరనుంచి చూడాలనే కోరిక తో మళ్ళీ టీవీ సున్నా కార్యాలయానికి చేరాడు.
దేవతల పాత్రలను హాస్యానికి వాడుకునే సినిమా వాళ్ళనూ, రచయితలనూ అసహ్యించుకునే నేను
ఈరోజు నా బ్లాగ్ టపా కోసం వినాయకుడిని వాడుకున్నా, తప్పలా
నేను రాయటం మొదలెట్టాగా, నాకూ కోరికా , ఆశా, జేబూ, మెడా ఉన్నాయిగా..!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
bagoledu..:(
రిప్లయితొలగించండిఆత్రేయ గారూ, మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిచాలా బాగుంది. మీ కోరిక తీరినట్లే.. బోల్డన్ని హిట్స్ మీ జేబులో..పడినట్లే!మీ మెడ కి..ఓ..మల్లె పూల దండ అభినందలలతో..పడటానికి..వేచి చూస్తుంది..
రిప్లయితొలగించండి@అజ్ఞాత : అవును బాలేదు నాకూ అనిపించింది. మీరిలా అజ్ఞాత గా కామెంటడం కూడా బాలేదు.
రిప్లయితొలగించండి@సూరి గారు : ధన్యవాదములు మీకూ మీ కుటుంబానికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు
@వనజ : ధన్యవాదములు. పొగడ్తల అడగ్తలు దాటేసి చాలా కాలమయింది, ఈ టపా బాలేదని నాకనిపించింది. మీకేమో మొహమాటమెక్కువ....
గణేశ్ విగ్రహాల ఎత్తులు, భారీగా చేసే భక్తిలో ఏదైనా హైటెక్ వ్యాపారం వుందేమో అని ఎప్పట్నుంచో నా అనుమానం...
రిప్లయితొలగించండిvinayakudiki short cut lu istam, GANAPATHI post kosam shortcut lo pani kaanichhadu.Tanani dhyanam cheyyadaniki short cut slokale korukuntadu. Tana vahanam kuda shorttee. Anni short cut lu korukunna LAMBODARUDNI - LAMBO,JAMBO MENUDI ga teerchididdadamlo neepadyanayakulu REAL ESTA'STARS' unnnaru mari VOLETIGARU!
రిప్లయితొలగించండి