నా రెండు పాత ఏడుపులు చూసి ఏమనుకున్నారో ఏమో గానీ .....
ఈ సారి ఒక కొత్త రకం ఏడుపు గురించి చెప్తా ... గుండ్రాల్లోకి వెళ్తునా వెల్థూ వెల్ వె ...........
అప్పుడు నేను ఎనిమిదో క్లాసు చదువు తున్నప్పుడు ....... మా పక్క ఇంట్లో ఉండే ఫ్రెండు ప్రకాష్ ... అంటే మా క్లాసో లేక సీనియరో అనుకునేరు ప్రకాష్ b com స్టూడెంట్ హాస్చర్య పడకండి చిన్నప్పటి నుంచి అలా పెద్ద పెద్ద వాళ్ళతో తో తిరిగి ముదురు లా అయ్యాను పోన్లే ఇప్పుడు ముదుర లేత కాదు టాపిక్ .... ఆ ప్రకాష్ కి బాబు అనే ఫ్రెండు ఉండేవాడు బాబుమంచి ముజీసియన్ అంటే గిటార్ డ్రమ్స్ కీ బోర్డు ఇలా చాల వాయించే వాడు అలంటి బాబు దగ్గర నేను గిటార్నేర్చుకోవాలని అనిపించేది ప్రకాష్ వాళ్ళ అన్న చిన్న ( ca చేస్తూ ఉండేవాడు) చెప్పాగా మనం ఆ మాత్రం వయసు లేకపోతే మాట్లాడే వాళ్ళం కాదు. ఆ చిన్న తో కలిసి ఇంగీష్ హిందీ సినిమాలు బాగా చూసేవాడిని అందులో హమ్ కిసీ సే కంనహీ యదొంకి బారాత్ ఇలాంటివి చూసి చూసి మనం కూడా తెల్ల కోటేస్కోని నల్ల బో టై ఎర్ర బూట్ల తో హిందీ సినిమా హీరోలాగ గిటార్ వాయించాలని పిచ్హ పిచ్హ గా కలలు కనే వాడిని దానికి తోడు నా మీద నాకు బోలెడు నమ్మకం (సీరియల్నమ్మకం కాదు) అలాంటి సదుద్దేశం తో బాబు దగ్గర గిటార్ నేర్చుకుడానికి డిసైడ్ అయ్యా ...
ఈ విషయం ఇంట్లో మా నాన్న గారికి తెలిసేలా చేశా ఎందుకంటే డైరెక్ట్ గ చెప్పే తెగువ నాకు లేదు. సరే విషయం శ్రీ కోర్ట్వారి సమక్షం లో ఉంచాం కదా ఏమయుతుందో అని ఎదురు చూస్తున్నా...
ఒక మంచి ఆది వారం మధ్యాన్నం మా నాన్న పిలిచి ఏదో నేర్చుకుంట నన్నావత వెళ్లి సంగీతం క్లాసు లో జేరు కర్ణాటకవోకల్ నేర్చుకో కొంత కాలమయ్యక వైలిన్ గానీ వీణ గానీ నేర్చుకుందువు అని తీర్పు ఇచేస్సారు. నాకు తెల్ల సూటు నల్లబో టై మాయమై ఎర్ర శాలువా కద్దర్ పంచె మెళ్ళో పులి గోరూ కాన పడ్డాయి ... నాకు ఏ సంగీతం వద్దు అని తీర్పు తిరగరాయించే ప్రయత్నం చేశా ... కొన్ని రోజులయ్యాక ప్రకాష్ జోక్యం తో మా నాన్న గిటార్ క్లాసు కి ఝండా ఊపారు.
హుషారు గా జేరి పోయి మా గురువు బాబు దగ్గర గిటార్ మొదలెట్టా .. వారంయ్యాక బాబు నా ఎలెక్ట్రిక్ గిటార్ మీదప్రాక్టీసు కుదరదు నువ్వు ఇంట్లో ప్రాక్టిసు కోసం గిటార్ కొనుక్కో లేక పోతే రాదు అని చెప్పాడు . నేను ఇంట్లో అర్జీపెట్టకున్నా మా నాన్న చూడడం లే ముందు బాగా నేర్చుకో అప్పుడు కొందాం అన్నారు అలా రెండు వారాలయ్యి నేనుఇంకా కచేరీ ఇద్దమనుకునే టైం లో కూడా గిటార్ కొనలేదు మా గురువు చివరకి తెగేసి చెప్పేసాడు ఇంట్లో గిటార్ లేక పోతేకష్టం శిష్య నువ్వు ఇలయ రాజ కి పోటీ ఇవ్వలేవు అని. ఆ విషయం ఇంట్లో చెప్పా ఉహు నో యూస్ అలా ఇంకో నెలఅయింది ఉహుహు నో నో యూస్ యూస్ చివరకి బాగా ఏడిస్తే కొంటారని మా నాన్న ఉన్న పక్క గది లో కూర్చొనిసౌండ్ వచేలాగా ఏడుపు మొదలెట్టా సౌండే కని ఈడుపు లేదు బాసూ అని శంకరశాస్త్రి లా చెప్పాడు ఆ విషయం నాకూతెలుసు కాని ఫీల్ లేదు కదా లోపల అందుకే ఆర్థ్రత నా వాళ్ళ కాలేదు ......
ఆర్థ్రత లేదు కాబట్టి మా నాన్న కూడా లైట్ తీస్కున్నారు ...... అలా ఒక దొంగ ఏడుపు ఇప్పటికీ గుర్తుంది పోయింది..
ఇప్పుడు గిటార్ కొనుక్కునే స్వాతంత్యం ఉన్నా కొనుక్కోలేదే..? హబ్బే మనకంత టైం హేదేండీ.....!!
.....balam.......emitanukuntunnara mee quote poorthichesa.... baalayam rodanam balam... roda kaadulendi.bagundi.
రిప్లయితొలగించండి