ఈ సారి నిజమైన ఆనందకరమైన మరియూ సురక్షిత మైన దీపావళి జరగాలి.
ఈ మధ్య కాలం లో దీపావళి సందర్భంగా టీవీ లలో పేపర్లలో వచ్చే ప్రకటనలు ఇంకా సెలెబ్రిటి లు నాయకుల ఇచ్చే సందేశాలలో " ఆనందకరమైన మరియు సురక్షిత మైన దీపావళి మీకు మరియూ మీ కుటుంబానికి.." అంటూ చెప్తున్నారు కదా
అందులో భాగం గా ఎన్నో జాగ్రతలు ఉంటాయి.
పిల్లలను ఒంటరిగా టపాసులు కాల్చనివ్వద్దు అని.
బట్టలు నూలు వి వాడండి పట్టు మరియు టెర్లిన్ దుస్తులు వేస్కో కండి ..
దగ్గరలో నీటి బకెట్, ఇసక నింపిన బకెట్ ఉంచుకొండి..
ప్రధమ చికిస్థ సామాను రెడీ గా ఉంచుకోండి అని.
గట్టిగా శబ్దం వచ్చేవి కాల్చకండి అని బోలెడు జాగర్తలు చెప్తారు కదా
మరి నువ్వేమన్నా అమలవా ? లేక జెనీలియా వా నువ్వేమి సందేశాలు చెప్తావోయ్ అని అనుకుంటున్నారు కదా
అవును మీకు తెలిసినవే ఆయినా మీకు సంభందం లేక పోయినా సరే
కొన్ని ఉన్నాయి అవి మళ్ళీ తిరగేస్కుందాం
ప్రతీ పండగ లాగా నే దీపావలికీ కొత్త బట్టలు మిఠాయిలు కొనుక్కోవటం మామూలే
కాక పోతే దీపావళి కనుక టపాకాయలు కూడా కొనుకోవచ్చు
అందుకే ఈ దీపావళి కి నా సందేశం బలవంతంగా మీకు వినిపిస్తా
అన్ని పండగలలో వృధా ఎక్కువయ్యే పండగ దీపావళి
కారణం టపాసులే చాలా వేల డబ్బు ఇచ్చి కొన్ని నిముషాల లో తగల బెట్టే టపాసులు
దానికి మనం వెచ్చించే ధనం...
ఏంటో ఈ ఆత్రేయ ఎప్పుడూ పిసినారి మాటలు రాస్తాడు అనుకో కండి
బాగా చిన్నప్పుడు నాకూ ఇష్టమే అలా తగలేయటం
మా నాన్న ఎన్ని కొన్నా ఇంక కొనచ్చుగా అనుకునే వాడిని బహుశా డబ్బు విలువ అప్పుడు అంత తెలియక పోవటం వల్ల
క్రమేపీ ఆ కోరిక తగ్గిపోయింది
నేను టెన్త్ లోకి వచ్చేసరికే నాకు టపాసుల మీద ఆసక్తి పూర్తిగా పోయింది
అప్పటికి నాకు కొంత అవగాహన రావటం వల్ల కావచ్చు లేదా వేరే ఏదైనా కారణం కావచ్చు
నాకు బాగా గుర్తు " చిన్నపిల్లలు మిణుగురు పురుగులు చూసి పడే ఆనందం ఆశ్చర్యం ముందు
పెద్దాళ్ళు వేలు పెట్టి కొని కాల్చే బాణసంచ వెలుగులు ఏ మాత్రం ?"
ఈ వాక్యము నేను ఇలాగే చదివి ఉండక పోవచ్చు ఆ వాక్య నిర్మాణం వేరే రకం గా ఉండి ఉండవచ్చు కానీ భావం మాత్రం నా మనసులో బలం గా నాటుకు పోయింది.
అప్పటి నుంచి నేను బాణా సంచా వదిలి మిణుగురు పురుగుల కోసమై ఆశగా వెతకటం మొదలు పెట్టా...
ఫలితం నేను ఎన్నో వెలుగులు చూసా మనసులో నింపుకున్నా అజ్ఞాతంగా నైనా ..
పండగ ముందు ఈ సుత్తి ఏంటి అనుకోకండి ..
మన ఇంటి ముందు ఎన్నో పదుల, వందల దీపాలు వెలిగించే ముందు చుట్టుపక్కల ఎక్కడన్నా చీకటి పేరుకు పోయిందేమో వెతుకుదాం...
ఆ చీకటి లో ఒక్కటన్నా చిరు దీపం ఉంచి అప్పుడు మన గుమ్మం, ఇల్లు కాంతి మయం చేస్కుందాం.....
అప్పుడే శ్రీ మహా లక్ష్మి మరింత సంతోషిస్తుంది .. మన జీవితం కాంతి మయం చేస్తుంది.
ప్రాక్టికల్ గా చెప్పుకుంటే .... మన దీపావళి ఖర్చు లో ఒక పాతిక శాతం తగ్గించి ఏదైనా బీద కుటుంబానికి సాయం చేస్తే( దీపావళి చేస్కోవటానికి కాదు బతక టానికి ) అది విద్య కోసం కావచ్చు వైద్యం కోసం కావచ్చు లేక అసలు తినటానికే కావచ్చు.
ఆ తృప్తి ముందు ఆ ఆనంద కాంతి లో మరే మతాబాల అవసరం ఉండదు.
మరే టపాసుల ఢమ ఢమ లు వినిపించనంత శ్రావ్యం గా ఆ ఆనంద రవం ఉంటుంది.
ఈ దీపావళి రోజూ మీ గుమ్మం లోకి నిజం గా లక్ష్మి దేవి రావాలని మనసారా కోరుకుంటూ....
there are many families who are directly dependent on this industry for their livelihood. we may only hope for an eco friendly Diwali.
రిప్లయితొలగించండి