5, నవంబర్ 2010, శుక్రవారం

రోలు కి కట్టేసినందుకు....


దీపావళి పండగ ఎందుకు జరుపుకుంటామో మన అందరికీ తెలుసు కదా మళ్ళీ చెప్పేదేముంది
కానీ ఈ రోజూ పొద్దున్నే పేపర్ చదువుతుంటే అందులోని ఒక శీర్షిక లో ఇంట్లో చనిపోయిన పెద్దల జ్ఞాపకార్ధం వాళ్ళకి స్వర్గ మార్గాన వెలుగు చూపటం కోసం దీపాలు పెడతారని... చదివా.
అయినా దైవ స్వరూపులైన స్వర్గస్తులకు మనం దీపం చూపట మేంటి అని నేను మా లేడీసు వితండ చర్చ చేస్కున్నాం.
ఆమాట కొస్తే దేవుడి ముందు చేసే దీపారాధన పెట్టే నైవేద్యం కూడ అంతేకదా..
దేవుడి కి లేకనా అయన అడిగారా మనల్ని
చీకట్లో ఉన్నాను బాబోయ్ కాస్త దీపం చూపించండి,
ఆకలేస్తుంది అమ్మాల్లారా ఏదన్నా పెట్టండి అని .....
మనమే దేవుని మీద నమ్మకం మీద,
అయన ఉన్నాడని ఆయనే మనకి అన్నీ సమకూరుస్తున్నాడని ,
అందుకే దేవునికి ఆ కృతజ్ఞాత చూపటానికి దీపం నైవేద్యం పెడుతున్నాం.
అంచేత పెద్దల కోసం ఇంటి ముందు దీపాలు వెలిగించుదాం,
గతించిన మన పెద్దల జ్ఞాపకార్ధం కోసమే కాదు
మన రక్షణ కోసం ప్రాణలోడ్డిన మన అమర సైనికుల కోసం కూడా
చెడు మీద మంచి గెలుపుకు చిహ్నం గా
చెడ్డ నరకాసురుడి మరణం గుర్తుగా
శత్రు దేశాల మీద మన సైన్యం విజయం జ్ఞాపకం గా
మన గుమ్మం ముందు దీపాలు ఉంచుదాం.
మా తాతయ్యలు అమ్మమ్మ నాయనమ్మ మా నాన్న, పెదన్నాన్న ,
ఇంకా మమ్మల్ని కన్న పిల్లల్లా చూస్కున్న మా చిన్నప్పటి ఇంటి ఓనర్ తాతయ్య అమ్మమ్మ బాబాయ్,
నాకు చదువు చెప్పి గతించిన కొందరు టీచర్లు,
నా ఉద్యోగమ్ లో ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు
ఇంకా విధి వశాత్తు మరణించిన ఒకళ్ళిద్దరు స్నేహితులు
అందరి ఆత్మ శాంతి కోసం మా ఇంటి ముందు నేను కూడ దీపాలు ఉంచుతా
లోక సమస్తా సుఖినో భవంతు.
విరకొట్టే వార్త ( బ్రేకింగ్ న్యూస్) ఇది రాస్తున్న ప్పుడే మా అమ్మాయి మేసేజ్ పంపింది
రావణుని చంపి అయోధ్యలో మొదటిసారి అడుగు పెట్టిన శ్రీ రాముని విజయం,
నరకాసురుడుని చంపిన శ్రీ కృష్ణుని జయం,
ఇంకా రోజే అమ్మ యశోద అల్లరి కృష్ణుని రోలు కి కట్టేసిందట
( ఎంత ముద్దుగా ఉందొ ఆలోచన మా అమ్ముగాడిలా ) అందుకే దీపావళి .
అందుకే అనందం లో దీపావళి చేస్కుందాం.




8 కామెంట్‌లు:

  1. tappakumDaa......
    frist of all దీపావళి శుభాకంక్షలు......

    రిప్లయితొలగించండి
  2. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

    - శి.రా.రావు
    శిరాకదంబం

    రిప్లయితొలగించండి
  3. పాడి పంటలు బాగా వుండి.. ఒక్కడు తెస్తే..పదిమంది తినే రోజుల్లో.. ఈ పండగల వంకన.. ఇంటిల్లపాదీ కావలసినవి చేసుకుని తింటూ..కొత్త బట్టలు కొనుక్కొని..ఎంజాయ్ చేసేవారని నా అభిప్రాయం..నిజమైన స్వాతంత్రం రానట్లే.. నిజమైన పండగలు మనం చేసుకుంటున్నామా ! అధ్యక్షా ?

    రిప్లయితొలగించండి
  4. @ హను, ఎస్ ఆర్ రావు గారు మీక్కూడా శుభ దీపావళి
    @ వోలేటి గారు మీరు కూర్చోండి మీరు కూర్చోండి ప్లీస్ టేక్ యువర్ సీట్ మీరు కూర్చోండి కూర్చోండి ప్లీస్ ...

    రిప్లయితొలగించండి
  5. ఆత్రేయగారూ!మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  6. విజయమోహన్ గారూ మీ దీపావళి బాగా జరిగిందని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  7. LOL .. బావుంది. ఈ వోలేటి గారెవరో విప్లవోద్యమ ఖార్యకర్తల్లా ఉన్నారు! ఓ అర్రకండువా కప్పి కూర్చో పెట్టండి!! :) All in "light"er vein on this festival of lights!!

    రిప్లయితొలగించండి