22, జులై 2011, శుక్రవారం

తగుల బెట్టేస్తే ..?


"హలో "
"హలో చెప్పండి "
"హలో హల్లో ఎవరూ ..?"
"హల్....నే ... తోందా?"
" ఎవరు ..?"
" నేనే ...హన రావ్ ని
" హలో సరిగ్గా వినపడట్లేదు .."
" హ..లో నే...అస..న రావు నండీ "
ఒక్క క్షణం అనుమానం ఆసన రావా ? అనాస రావా? ఆయాస రావా?
మళ్ళీ "హలో ఎవరూ..?"
"నే.. .. సహన రా.."
"సహన రా?"
".. న పడు... oదా?"
సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా.
"మళ్ళీ కాల్ చేస్తా ఈ నంబరు కే చెయ్యనా?"
"నే అసహన రావ్ ని ...తోందా?"
"లేదు "
"ధూ దీ న... ఫోనూ ధాల్ కనక్ ఛి డం "
చూస్తే కాల్ దిస్కనేక్టేడ్
ఈ సారి నేనే చేశా "కు.. కు.. కు.. మీరు డయలు చేసిన వాడి ఫోన్ స్విచాఫ్ చేయబడి ఉంది దయచేసి మళ్ళీ ప్రయత్నించండి"
గంట తర్వాత ఆఫీసు లో నా ముందు ఒకాయన ఉన్నాడు.
నమస్తే సార్ నా పేరు అసహన రావ్ (ఎక్కడో విన్నట్టు ఉందే..)
నేనే సార్ ఇందాక ఫోన్ చేశా సరిగ్గా వినపడలేదు.
అవును ఏదో పెద్ద శబ్దం తోకట్ అయింది మళ్ళీ నేనే కాల్ బాక్ చేశా స్విచాఫ్ అని వచ్చింది.
అవును సార్ కోపమొచ్చి నేల కేసి కొట్టా పగిలిపోయింది. మళ్ళీ చేద్దామంటే ఫోన్ లేదు మీ నంబరు కూడా లేదు.

ఆగు ఆగక్కడ సిగ్నల్ సరిగ్గా లేక పోతే ఫోన్ నేల కేసి కొడతావా...

అతనొచ్చిన పని ఒదిలేసి నా ఆలోచన లో నేను ... " ఏంటీ ఈ అసహనం? చిన్న విషయాలకే ఇంత రియాక్షనా?"
ఫోన్ సిగ్నల్ లేక పోతే మళ్ళీ కాల్ చేసి ప్రయత్నించాలి. అంతే గానీ ఫోన్ నేల కేసి కొడితే జరిగేది ఏంటి అసలు కే మోసం
అందుకే ఈయన పెద్దలు అసహన రావ్ అని పేరుపెట్టారు.

టీవీ లో స్క్రోల్ ...

జూనియర్ఇంటర్ చదివే పిల్ల కార్పరేట్ కాలేజీ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య
వత్తిడి తట్టు కోలేక అమ్మ నాన్నలని నిరాశ పరచలేక
నేను ప్రాణం ఒదిలేస్తున్నా నన్న లేఖ

ఇంకో ఛానల్ లో ఎక్స్ క్లూసివ్ మాదే...

ప్రేమికురాలి నిరాకరణ తో
ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య

పేపర్ లో....
ఆర్ధిక ఇబ్బందులూ అప్పుల బాధ తాళలేక కుటుంబం ఆత్మహత్య
హాస్పిటల్ లో రక్షింపబడి పదేళ్ళ బాలుడు అనాధగా మిగిలాడు

బ్రేకింగ్ న్యూస్
మా రాష్ట్రం మాకు ఇవ్వలేదని ఉరేసుకున్న పాతికేళ్ళ యువకుడు.

వీళ్ళందరికీ తల్లిదండ్రులూ,చదువు, సమాజం, వెనక నుండి నెట్టే నాయకులూ ఏమీ నేర్పరా ?

జీవితమన్నది ఒక్కటే నని,
చదువు, ప్రేమ, కుటుంబ బాధలూ, సొంత రాష్ట్రాలూ
ఇవన్నీ వివిధ మజిలీలనీ
అవి చేరక పోతే పోయేది ఏమీ పెద్దగా ఉండదనీ,

మళ్ళీ ప్రయత్నం చేయటం ద్వారా అవి సిద్దించ వచ్చని
అమాయకంగా ప్రాణాలు తీసుకుంటే మళ్ళీ తిరిగి రావనీ

ఇవన్నీ లేకుండా కూడా జీవితం ఉంటుందనీ
చచ్చి సాధించటానికి యిది అమర జీవుల శకం కాదనీ.

ఇంట్లో పిల్లలనుంచీ మొదలిడి బయట బంధు మిత్రుల దాకా
ఎవరైనా మానసిక ఒత్తిడికి గురైతే
డిప్రెషన్ లో ఉన్నట్లు కనపడితే
చేర దీయండి, నాలుగు మంచి మాటలు చెప్పి
ఏమార్చండి . అంతే కానీ పోయాక
సంతాప సభలు, ఓదార్పు యాత్రలూ, శవరాజకీయాలూ
ఎవడినో బాగు చేస్తాయి కానీ జీవితాన్ని తిరిగి ఇవ్వవు.

సెల్ అయితే మళ్ళీ కొనుక్కోవచ్చు, పరీక్ష పోతే మళ్ళీ వ్రాసి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు,
ప్రేమ ఇంకోళ్ళనుంచి పొందొచ్చు, రాష్ట్రం బతికుండి సాధించు కోవచ్చు.

కానీ జీవితం ఒక్కటే అది మళ్ళీ రాదు,
పనికి మాలిన విషయాలకు, ఆశయాలకు దాన్ని బలి చేస్కోవద్దు.

చిన్నప్పుడు ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూసిన ఒక చెక్ సినిమా గుర్తొస్తోంది

ఒక ఫాక్టరీ కార్మికులు హక్కుల సాధనకై సమ్మె చేస్తారు. ఎన్ని రోజులు పోయినా యాజమాన్యం దిగి రాదు.
కార్మికుల కుటుంబాల లో కష్టాలు వివరం గా చూపిస్తారు.
చివరాకరికి విసుగొచ్చిన కార్మిక నాయకులు ఒక రాత్రి ఫ్యాక్టరీని తగుల బెట్టిస్తారు.
కార్మికులు విజయ గర్వం తో ఇంటికెళ్ళి కుటుంబ సభ్యులకి చెప్పి పడుకుంటారు.
తెల్లవారాక ఒక కార్మిక కుటుంబం లో దృశ్యం
అలవాటుగా కార్మికుడు యూనిఫారం తొడుక్కొని స్టీల్ టోపీ పెట్టుకొని గుమ్మం దాట బోతుంటే ...
వాళ్ళ పదేళ్ళ కూతురు ఇలా అంటుంది "
Otec Kam jdeš ..?"
(నాన్న ఎక్కడికి వెళ్తున్నావ్)

జీవితం కూడా ఫాక్టరీ లాంటిదే తగుల బెట్టేస్తే ఎలా జీవిస్తాం ?


9 కామెంట్‌లు:

  1. "శభాష్ బాగా రాశారు" అని భుజం తట్టి చెప్పడానికి దురదృష్ట వశాత్తూ మీరు ఎదురుగా లేరు. సమస్యని పరిష్కరించుకోడానికి ప్రయత్నించడం మానేసి ఛస్తే అసలు సమస్యే ఉండదనుకునే మూర్ఖత్వం మెల్లిమెల్లిగా ఈ సమాజంలో వేళ్ళూనుకుంటోంది.

    రిప్లయితొలగించండి
  2. ప్రాణ త్యాగాలు..విజయ కేతనాలు కాదని పెద్దవాళ్ళకి తెలుసు. అవేశాకావేశాలను.నాయకులు అణు చుకున్నట్లు .. పాపం ..యువతకేం తెలుసు.? వారు బలి పశువులు. వీరికి.. శిలా విగ్రహాలు, నాయకులకి పదవులు. తల్లిదండ్రులకి..కన్నీళ్లు. . ఉద్యమ ఫలాలు.. అందుకునే రుధిర కుక్షిలున్న నాయకత్వాలు..ఉన్న చోట.. ఎన్ని ప్రాణ త్యాగాలు చేస్తే..అంత.. గొప్ప ..ఏమో! ఎవరు చెప్పగలరు?చెప్పండి

    రిప్లయితొలగించండి
  3. andariki anni telusu. chesukune vaariki cheyinche vaariki kooda. aina nakenduku ano......inthakanna emi chestham ano jeevithanni bali icheyyadam oka rakam ga chala pedda duralavataipothondi mana samajam lo...raajakeeya nayakulaki vidhyarthula jeevitham pai virakhthi puduthundi. vidhyarthulaki jaruguthunna paristhithulameeda virakthi kaluguthundi......mothaniki balevarayya ante vidhyarthule, amayakapu jeevithalu.....meeru cheppina example chala correct. mana sareeranni maname thagulabettukovadam....manasuni champukovadam kanna heenam. bathikunte balusaaku thinachu antaru peddalu... evaru vintaru peddala maata?

    రిప్లయితొలగించండి
  4. జీవితంలో వచ్చే టెంపరిరీ ప్రొబల్మంస్‌కు పర్మనెంట్ సొల్యూషన్ ఆత్మహత్య.


    ఎందుకు బ్రతుకుతున్నామో, ఎవది కొసం బ్రతుకుతున్నామో తెలియనపుడు ఆత్మహత్య చేసుకుంటే తప్పేమిటి ?

    రిప్లయితొలగించండి
  5. మితిమీరిన మీడియా ఎక్ష్పోజర్ వల్ల అవసరం లేని భావోద్వేగాలు ఏర్పడుతున్నాయి. ఇరవై నాలుగు గంటల న్యూస్ చానెళ్ళు ఆపకుండా సోది చెప్పాలి కాబట్టి ఎక్కెడెక్కడి చెత్తా పోగేసి వార్తల కింద, బ్రేకింగ్ న్యూస్ కింద చూపింస్తూ అందరి బుర్రలూ చెడగొడుతున్నాయి. ఎక్కడో ఎవ్వడో బలహీనుడు చేతకానితనంతో ఆత్మహత్య చేసుకుంటె ఆ విషయాన్ని తరచి తరచి చూపిస్తూ తోచిన మాటలన్నీ మాట్లాడుతూ ఆ శవాన్ని చూపిస్తూ గంటల కొద్దీ ప్రసారాలు జరుగుతున్నాయి. వీటి ప్రభావం బలహీనుల మీద తప్పనిసరిగా ఉన్నది. మునుపు క్రౌడ్ మెంటాలిటీ అనేది ఒక గుంపులో ఉంటేనే కలిగేది కాని ఇప్పుడు మనిషి ఒంటరిగా గదిలో కూచుని ఉన్నా కూడా టి వి న్యూస్ చానెళ్ళు క్రౌడ్ మెంటాలిటీను ప్రేరిపిస్తున్నాయి.

    ప్రయోజనాల కన్నా అనర్ధాలకే ఎక్కువ దారి తీస్తున్న ఈ న్యూస్ చానెళ్ళు ఇరవై నాలుగు గంటలూ ఉండాలా. రోజుకి రెండు మూడు సార్లు న్యూస్ తెలుసుకుంటే చాలదా? మనకి ఇరవైనాలుగు గంటల న్యూస్ చానేళ్ళు అవసరమా!

    ఇప్పుడు మనం చూస్తున్న "అతి" ప్రవర్తనకి టి వి న్యూస్ చానెళ్ళు, రోజువారి ధారావాహికలు దోహదపడుతున్నాయి అని నా ఉద్దేశ్యం.

    రిప్లయితొలగించండి
  6. అంతే కదా మిత్రమా చక్కగా చెప్పారు .
    పోగొట్టుకుంటే తిరిగి రాదు జీవితం.
    పెద్దలనబడే పెద్దలకు బుద్ధులు చెప్పే పెద్దలు
    యెప్పుడొస్తారో గదా!
    మంచి పోస్ట్

    రిప్లయితొలగించండి
  7. చదివిన కామెంటిన పెద్దలందరికీ పేరు పేరునా ధన్యవాదములు.
    అజ్ఞాత : శంకర్ s గారు చెప్పినట్లు ఎదురు ఉన్నట్లయితే చంప మీద కొట్టి అడిగి ఉండేవాడిని
    సమస్య తాత్కాలికం జీవితం పర్మనంట్ ( ఆయువున్నంత వరకూ) అని మీరే అన్నారు.
    మీ రుణావేశాన్ని తగ్గించుకోండి. బహుశా మీరూ సరదాగా అన్నట్లు గా తోస్తోంది. లేదు నిజమే అయితే వెంటనే నాకు మెయిల్ చెయ్యండి చని పోవటానికి మీరు ఒక కారణం చూపిస్తే బతకటానికి లక్ష కారణాలు నేను చూపగలను. నేనే కాదు మీ చుట్టూ ఉన్న వారు ఎవరైనా చూపగలరు.

    రిప్లయితొలగించండి
  8. ఆధ్భుతం గా రాసారు. కానీ ఇవన్నీ చెవిటి వాడి ముందు శంఖమేగా.

    రిప్లయితొలగించండి
  9. ///కానీ జీవితం ఒక్కటే అది మళ్ళీ రాదు,
    పనికి మాలిన విషయాలకు, ఆశయాలకు దాన్ని బలి చేస్కోవద్దు////

    బాగ చెప్పారు, ఆచార్య ఆత్రేయ.

    బాగ చెప్పారు, ఆచార్య ఆత్రేయ.

    ఒక సందేహం .. సెల్‌ఫోన్ పోతే మరో సెల్‌ఫోన్ కొనుక్కున్నట్టే ఓ దిక్కుమాలిన శవం పోతే మరో దిక్కుమాలిన శవం శవరాజకీయాలకు పడుతోంది కదా ప్రతి వెదవ జీవితమూ విలువైనదైతే మనకు 1.2బిలియన్లున్నాయి.

    Good one, అజ్ఞాత 22 జూలై 2011 11:45:00

    రిప్లయితొలగించండి