31, ఆగస్టు 2010, మంగళవారం

మన లొ ఫస్త్ ఐడియట్ రంచో ...

ఆదర్శం

అతడొక వీచే పవనమ్ ...
అతడొక ఎగిరే పతంగి ...
ఎక్క మాయమయ్యాడో ...ఎక్కడికి వెళ్ళాడో వెతుకుదాం ..
మనమంతా దారి వెతుకుతుంటే తను నడిచే దోవ నే దారి చేస్కున్నాడు
కొన్నిసార్లు పడి, కొన్నిసార్లు నిలదొక్కుకొని .. కానీ అన్నిసార్లు ముందే ఉండేవాడు ..
మనం భవిష్యత్ గురించి వ్యధ పడుతుంటే .. తను వర్తమానాన్ని ఆనందిస్తూ ఉండేవాడు ...
ప్రతి క్షణం పూర్తిగా ఆస్వాదిస్తూ .....
ఎక్కడినుంచి వచ్హాడు? మన హృదయాలని తట్టి లేపి!! ఎక్కడికి వెళ్ళాడు...?
మండే ఎండలో చల్లని నీడలా... ఎడారి లో నీటి బుగ్గ లా... గాయపడిన గుండె కి చల్లని పూత లాంటి తను ఎక్కడ..?
మన మంత భావి లో కప్పల ఉంటె... తను నదిలో ఎగిసిపడే చేప లా ఉండేవాడు...
జలపాతానికి ఎదురు ఈదగల తను ఎక్కడ ...
అదుపులేని పిల్ల తెమ్మెర లా... ఒక ప్రియమైన నేస్తాన్ని ఎక్కడున్నాడో వెతుకుదాం రండి.....

మంచి కవిత్వం రాసానని అనుకున్నారా... చాలా మంది ఈపాటికి అర్థం అయి ఉంటుంది అది ఎక్కడో విన్నట్టుందే అని... అవును మధ్యే రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మీద రవీంద్రభారతి లో ఒక చల్లని సాయంత్రం చదివి పెట్టా.... ఉహు నమ్మలేదా సరే నిజం చెప్తున్నా స్వనంద్ కిర్కిరే రాసిన ఇదియట్స్ లో ని బెహ్తీ హవా సా తా వో... పాట... సినిమా మనలో చాలా మందే చూసాం బాగా ఉత్తేజితులయ్యాం. ఫ్రెండ్ అంటే అలా ఉండాలి మనం కూడా కాస్త ట్రై చేసుంటే కాలేజీ రోజుల్లో అలాగే ఉండేవాళ్ళం కదా, మిగతా స్టూడెంట్స్ కి దార్సనీకుడుగా . అని ఫీల్ కూడా అయిఉంటాం . ఎంతో ఔస్తాహికం గా అందరికి ఆప్తుడిగా ఉండాలని కోరిక ఉండే ఉంటుంది. సినిమా అయ్యాక మెల్లగా ఇంటి కొచ్చి మరుసటి రోజుకల్లా మన గోల లో మనం పడిపోయాం ... రోజులు దొర్లిస్తూ ఉన్నాం ... ఎప్పుడన్నా పాట విని ఆనందిస్తున్నాం.
ఎప్పటిలాగే భేతాలుడు చెట్టు మీదకి చేరిపోతాడు .. దైనిక విషయాల మౌన భంగానికి... ఇంకా ఇంకోకొల్లని ప్రేరేపించే టైంఏదీ..? హబ్బే దానికి వేరే వాళ్ళు ఉంటారండి పర్సనాలిటీ డెవలపర్స్.... అని వాళ్ళు డబ్బూ అదీ పుచ్చుకొని ఆ పని చేసిపెడతారు, మనకెందుకు లేస్తూ అంటారా .... సరే మీ ఇష్టం మీలో ఒక అమీర్ ఖాన్ ని నిద్ర లేపుదామని అనుకున్నా.. కనీసం నాలోని అమీర్ ని లేపుదామనుకున్న బాగా కష్టం గా ఉంది అయినా ప్రయత్నిస్తూ నే ఉంటా..
"నేను మారా మిమ్మల్ని మారుస్తా వెంకన్న మీద ఒట్టు.." అన్న
తెలుగు సంస్కృతి మనది కాబట్టి ప్రయత్నిద్దాం.........
మనం మారుదాం , ఇంకోళ్ళని మారుద్దాం..
ఆదర్శం అంటే ఆదరిన లేదని నిరూపిద్దాం. అందరం 'రాంచో' లు అవుదాం.

మంచి
పాటని అలా ఇస్తామొచినట్లు రాసి పాడు చేసినందుకు క్షమించండి.

ఇట్లు


అప్పుడప్పుడూ మారే
రాంచోడ్ దాస్ సామలదాస్ చాంచడ్ .


30, ఆగస్టు 2010, సోమవారం

జన్మా స్టమి శుభా కా౦ క్షలు

[cheta+venna.bmp]

ఇప్పుడొక నిజం ఏడుపు

ఏంటి వీడు అసలు నిజం గా ఏడవడ ని డిసైడ్ అయిపోయారా .... అయితే ఇది చదవండి
నేను అప్పటికి ఇంకా హై స్కూలే మా అన్న నాకన్నా 4 ఏళ్ళు పెద్ద చిన్నపటినుంచీ వైర్లు రెంచ్ లు మోటార్లుఇలాంటివాతిపైనే దృష్తి చదువంటే పెద్దగా శ్రద ఉండేది కాదు అసలు కుదురే ఉండేది కాదు వాడితో మా అమ్మ నాన్నలుచెప్పి చెప్పి విసిగి పోయి ఉండేవాళ్ళు పైగా కాలేజీ కొచిన తర్వాత సహవాహ దోషం కావచు కొత్త గా వచ్చిన స్వతంత్ర్త్యంకావచు లేక వాతావరణ ప్రభావం ఏదైనా మన వాడు కాలెజీ మానేసి తిరగటం సిగరెట్టులు అల్లర్లు ఇలాంటివినేర్చేసుకున్నాడు రోజూ ఏదో ఒక గోల గంతులు వేస్తూ ఉండేవాడు .. ఇవన్ని మా నాన్నగారికి బాగా కోపం తెప్పించేవి .. ఇంటర్ పరీక్ష తప్పి పాస్ కావటానికి మూడేళ్ళు పట్టింది పైగా ఖాళీ ఎక్కువ అవటం తో మరింత గోలా గందరగోళం ... ఇలాసని అస్తమ గృహం లో ఉంది మా ఇంట్లోకి వక్రం గా చూడటం ఎక్కువైనా రోజుల్లో మా అమ్మ "పోనీ ఇకడనుంచి పంపెద్దంఊరు మారితే గోల ఛాన్స్ ఉండదు కదా అని అలోచించి మా నాన్న ను ఒప్ప్పించి మా పెద్దమ్మ ఇంటికి పంపడానికినిర్ణయించింది. అంతే మా వాడు ఊళ్ళో మిగిలిన గొడవల టార్గెట్ పూర్తి చేస్కొని హైదరాబాద్ వెల్ల టానికి రెడీఅయిపోయాడు. అక్కడ ఏరియా అఫ్ ఆపరేషన్ ఎక్కువ కదా అని మా వాడి ఆనందం.
ఇప్పుడు అమెరికా వెళ్ళే కుర్రల్లలగా కొత్త పెట్టె బట్టలు బ్లాడ్లు రేజార్ సర్దుకొని బందరు నుంచి హైదరాబాద్ వెళ్ళే రైల్ఆపాటికి డైరెక్ట్ రైళ్ళు లేవు నర్సాపూర్ కి విజయవాడ లో మా బోగీ కలిపే వాళ్ళు .. దానికి టికెట్ కొనుక్కొని లోకల్ఫ్రెండ్స్ రౌడీస్ అందరికీ పార్టీ ఇచేసి వీసా వచ్చిన వాడిలా తయారయ్యాడు. మా అమ్మ వాడి పెట్టె బాగ్ అన్ని సర్ది రిక్షామాట్లాడి నన్ను పెద్ద మనిషి లాగ వెంట ఇంచి స్టేషన్ లో రైలు ఎక్కించు అని పంపింది. నేను ఒప్పెస్కోని
స్టేషన్ కి వెళ్లి రైల్ ఎక్కించి రైల్ కదిలే దాక ఉండి ( మళ్ళీ వెనక్కి వస్తా డెమో అని భయం తో ) టాటా చెప్పి ఇంటికొచ్చ
సరికి మా అమ్మ చిన్నపుడు తనతో చదువు కొని బందర్ లో కలిసిన ఫ్రెండ్ వాణి ఆంటీ అండ్ వాళ్ళ పిల్లలు తో డాబామీద కబుర్లు చెప్పుకుంటూ ఉంది. వాణి ఆంటీ మాకు ఫేవరిట్ ఎందుకంటే వంట భలే చేసేది మమ్మల్ని డిన్నర్ లకిపిలుస్తుడేది అన్నిటికన్నా ముందు మా అమ్మ చిన్నపాటి దోస్తు కదా బాగా క్లోజ్ ఉండేది మా తో... సేర్ కధలోకి వతే రోజు రాత్రి భోజనాలయ్యాక మేడ మీద చాప లేస్కోని కబుర్లాడుతుంటే ...
నాకూ ఏదో వెలితి కాన పడింది కొట్టుకోవటానికి తిట్టుకోవటానికి ఒక మనిషి కరువైన వెలితి ... దాంతో లోపల నుంచిగుబులు తన్నుకోచింది .. గుబులు
ఏడుపు లోకి దింపింది ... వానే ఆంటీ కొడుకు వాసు నన్ను చూసి మా అమ్మ తోఆంటీ మీ బుజ్జి ఏడుస్తున్నాడు అని చెప్పాడు , దాంతో అందరి దృష్తి నా మీద కి మళ్ళింది ఎందుకు "ఏడుస్తున్న వంటేచెప్పలేదు చెప్పలేను కూడా.. కాసేపటికి అర్థమయ్యింది అందరికి మెల్లగా మా అక్క కూడా వెక్కటం మొదలెటింది దాంతోమా వాణీ ఆంటీ పిల్లలు జ్యోతక్క వాసు అరుణ అక్క అందరూ ఏడవటం మొదలెట్టారు చివరకి మా వాణి ఆంటీ కూడా ఏడ్చేసింది ... అలా ఒక గంట గడిచాకా మా అమ్మ నచ చెప్పించ్ది వాడు వెళ్ళింది అల్లరి మానేసి బుద్ది గా మారటానికికదా ఎందుకు ఏడుపు ? అలా గే వాణి ఆంటీ కూడా వెధవా కొంతలో ఎంత ఎడిపించావ్ అని ముద్దు గానే తిటింది. చివరకి అంతా నా చుట్టూ చేరి నవ్వారు .. రాత్రి అందరం అక్కడే పడుకున్నాం కబుర్లతో ....
ఎవరన్నారు అవలింతకి అన్నయ్య ఉన్నాడని ...
ఏడుపు కూడా పెద్ద అన్నయ్య ఉన్నాడు నిజ్జం ఒట్టు....

మళ్ళీ ఇంకో వెరైటీ ఏడుపుతో కలుస్తా

ఉత్సాహ సోమవారం కలిగి ఉండండి (have an active monday)

29, ఆగస్టు 2010, ఆదివారం

ఇదో ఏడుపు

నా రెండు పాత ఏడుపులు చూసి ఏమనుకున్నారో ఏమో గానీ .....
సారి ఒక కొత్త రకం ఏడుపు గురించి చెప్తా ... గుండ్రాల్లోకి వెళ్తునా వెల్థూ వెల్ వె ...........
అప్పుడు నేను ఎనిమిదో క్లాసు చదువు తున్నప్పుడు ....... మా పక్క ఇంట్లో ఉండే
ఫ్రెండు ప్రకాష్ ... అంటే మా క్లాసో లేక సీనియరో అనుకునేరు ప్రకాష్ b com స్టూడెంట్ హాస్చర్య పడకండి చిన్నప్పటి నుంచి అలా పెద్ద పెద్ద వాళ్ళతో తో తిరిగి ముదురు లా అయ్యాను పోన్లే ఇప్పుడు ముదుర లేత కాదు టాపిక్ .... ప్రకాష్ కి బాబు అనే ఫ్రెండు ఉండేవాడు బాబుమంచి ముజీసియన్ అంటే గిటార్ డ్రమ్స్ కీ బోర్డు ఇలా చాల వాయించే వాడు అలంటి బాబు దగ్గర నేను గిటార్నేర్చుకోవాలని అనిపించేది ప్రకాష్ వాళ్ళ అన్న చిన్న ( ca చేస్తూ ఉండేవాడు) చెప్పాగా మనం మాత్రం వయసు లేకపోతే మాట్లాడే వాళ్ళం కాదు. చిన్న తో కలిసి ఇంగీష్ హిందీ సినిమాలు బాగా చూసేవాడిని అందులో హమ్ కిసీ సే కంనహీ యదొంకి బారాత్ ఇలాంటివి చూసి చూసి మనం కూడా తెల్ల కోటేస్కోని నల్ల బో టై ఎర్ర బూట్ల తో హిందీ సినిమా హీరోలాగ గిటార్ వాయించాలని పిచ్హ పిచ్హ గా కలలు కనే వాడిని దానికి తోడు నా మీద నాకు బోలెడు నమ్మకం (సీరియల్నమ్మకం కాదు) అలాంటి సదుద్దేశం తో బాబు దగ్గర గిటార్ నేర్చుకుడానికి డిసైడ్ అయ్యా ...
విషయం ఇంట్లో మా నాన్న గారికి తెలిసేలా చేశా ఎందుకంటే డైరెక్ట్ చెప్పే తెగువ నాకు లేదు. సరే విషయం శ్రీ కోర్ట్వారి సమక్షం లో ఉంచాం కదా ఏమయుతుందో అని ఎదురు చూస్తున్నా...

ఒక మంచి ఆది వారం మధ్యాన్నం మా నాన్న పిలిచి ఏదో నేర్చుకుంట నన్నావత వెళ్లి సంగీతం క్లాసు లో జేరు కర్ణాటకవోకల్ నేర్చుకో కొంత కాలమయ్యక వైలిన్ గానీ వీణ గానీ నేర్చుకుందువు అని తీర్పు ఇచేస్సారు. నాకు తెల్ల సూటు నల్లబో టై మాయమై ఎర్ర శాలువా కద్దర్ పంచె మెళ్ళో పులి గోరూ కాన పడ్డాయి ... నాకు సంగీతం వద్దు అని తీర్పు తిరగరాయించే ప్రయత్నం చేశా ... కొన్ని రోజులయ్యాక ప్రకాష్ జోక్యం తో మా నాన్న గిటార్ క్లాసు కి ఝండా ఊపారు.
హుషారు గా జేరి పోయి మా గురువు బాబు దగ్గర గిటార్ మొదలెట్టా .. వారంయ్యాక బాబు నా ఎలెక్ట్రిక్ గిటార్ మీదప్రాక్టీసు కుదరదు నువ్వు ఇంట్లో ప్రాక్టిసు కోసం గిటార్ కొనుక్కో లేక పోతే రాదు అని చెప్పాడు . నేను ఇంట్లో అర్జీపెట్టకున్నా మా నాన్న చూడడం లే ముందు బాగా నేర్చుకో అప్పుడు కొందాం అన్నారు అలా రెండు వారాలయ్యి నేనుఇంకా కచేరీ ఇద్దమనుకునే టైం లో కూడా గిటార్ కొనలేదు మా గురువు చివరకి తెగేసి చెప్పేసాడు ఇంట్లో గిటార్ లేక పోతేకష్టం శిష్య నువ్వు ఇలయ రాజ కి పోటీ ఇవ్వలేవు అని. విషయం ఇంట్లో చెప్పా ఉహు నో యూస్ అలా ఇంకో నెలఅయింది ఉహుహు నో నో యూస్ యూస్ చివరకి బాగా
ఏడిస్తే కొంటారని మా నాన్న ఉన్న పక్క గది లో కూర్చొనిసౌండ్ వచేలాగా ఏడుపు మొదలెట్టా సౌండే కని ఈడుపు లేదు బాసూ అని శంకరశాస్త్రి లా చెప్పాడు విషయం నాకూతెలుసు కాని ఫీల్ లేదు కదా లోపల అందుకే ఆర్థ్రత నా వాళ్ళ కాలేదు ......

ఆర్థ్రత లేదు కాబట్టి మా నాన్న కూడా లైట్ తీస్కున్నారు ...... అలా ఒక దొంగ
ఏడుపు ఇప్పటికీ గుర్తుంది పోయింది..
ఇప్పుడు గిటార్ కొనుక్కునే స్వాతంత్యం ఉన్నా కొనుక్కోలేదే..? హబ్బే మనకంత టైం హేదేండీ.....!!

రెండో ఏడుపు

మళ్ళీ ఏడుపు గోలేంటి అని కంగారు పడకండి సారి పెద్దగా ఏడవను

చిన్న ఏడుపు గురించి చెప్తా ....
ప్రతీ వేసవి సెలవల్లో అందరూ పిల్లలు తాతల ఇంటికో అమ్మమ్మల ఊరికో వెళ్తారు కదా అల్లా మేము కూడా వేసవిసెలవుల్లో వెళ్ళే వాళ్ళం. అయితే అందరు నగరాలనుంచో పట్టనాలనుంచో గ్రామాలకి వెళ్తే మేము రివర్స్ లో ఒకమోస్తరు పట్టణం బందరు నుంచి హైదరాబాద్ లాంటి నగరానికి వెళ్ళేవాళ్ళం కారణం మా అమ్మ పుట్టి పెరిగిన ఊరు హైదరాబాద్ కాని నాన్న ఉద్యోగరిత్యా బందర్ లో ఉండేవాళ్ళం అందువల్ల సెలవల్లో అమ్మమ్మ ఊరు వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం అక్కడ మా పెద్దమ్మకుటుంబం తో అమ్మమ్మ కూడా ఉండేది ఏప్రిల్ 23 ఏట్టి పరిస్థుల్లో బండారు హైదరాబాద్ సూపర్ డీలక్స్ యెక్కి 10 గంట ప్రయాణం తర్వాత పొద్దున్నే భాగ్య నగరం చేరే వాళ్ళం అప్పుడు నిజం గాఅది భాగ్య నగరమే. అలా ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 దాక అక్కడే ఉంది జూన్ 13 స్కూల్ తెరిచే రోజుకి ఏమీ ఎరగా నట్టుమళ్లీ బందర్ లో వాలే వాళ్ళం నెల ఇరవై రోజులు మా నాన్న సుఖం గా సంతోషం గా ప్రశాంతం గా ఉండేవాళ్ళంఅన్నమాట ( విషయం నేను పెద్దయ్యాక మా ఆవిడా కూతురు ఊరేల్తే తెలిసింది )
ఓకే
!! ఇప్పుడు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యం కదా అక్కడ మా అమ్మమ్మ పెద్దమ్మ పెదనాన్న గారూ అన్నలు ప్రేమమధ్య 50 రోజులు యిట్టె గడచి పోయేవి. 35 ఏళ్ళ కిందటి మాట వేసవి లో కూడా దుప్పటి కప్పుకునే వాతావరణం ఆరుబయట దోమల్ గూడ లో పడుకున్న ఒక్క దోమ కూడా ఒంటిమీద వాలని రోజులు, పిల్లల్ని ట్యాంక్ బ్యాండ్ రోడ్ మీదవదిలేసినా ఆక్సిడెంటు కాని రోజులు అన్నిటికన్నా ముక్ష్యం గౌలిగూడ నుంచి దోమలగూడ కి ఆటో ఫేర్ 2.75 లేక .౦౦అయ్యే రోజులు అలాంటి రోజుల్లో అక్కడ వేసవి సెలవలు గడపి వెళ్ళే వాళ్ళం. పొద్దున్నే లేచి మొహాలు కడుక్కుని మాఅమ్మమ్మ ఇచిన టిపిణీ లు తిని పాలో కాఫీలో తాగేవాళ్ళం ఇలా కొన్నిసార్లు.
. ఇంకొన్ని సార్లు అయ్యరు అని ఒకాయన వచ్చేవాడు ఒక చేతిలో అల్యూమినియం కారేజీ ఇంకో చేతిలో కాస్త పెద్ద సైజు కారేజీపట్టుకొని ఇడ్లి ఇడ్లి అని అరుస్తూ.. ఇడ్లీ అని దీర్ఘం తీసేవాడు కాదు అందుకే వింతగా ఉండేది నాకు అయన అరుపు రూపంసైటు అవ్వగానే మేము అయ్యర్ అయ్యర్ అని పిలిచే కూర్చోపెట్టి మర్యాద చేసేవాళ్ళం అయన వరండ స్తంబానికి చేరబడి ఎన్నమ్మ సౌక్యమ పిలకాయలు వచినర అంటూ కుశలం అడిగే వారు , తరువాత విషయం మీకు చెప్పకర్లేదు కదా పల్చటితమల పాకులాంటి తెల్లనైన ఇడ్లీలు అందులోకి అయన కే కాపీ రైట్ ఉన్న పింక్ కలర్ లోని కారప్పొడి ఎందుకంటే అలంటికారప్పొడి మళ్ళీ ఎక్కడ ఎప్పుడు తారస పడలేదు. చాల బాగుండేవి.
అదయ్యాక మళ్లీ ఇంకో రౌండ్ కాఫీలు. అప్పుడు మా అమ్మ పెద్దమ్మ ఇద్దరూ సెలవలో ఉన్న టీచర్స్ అవటం వాళ్ళ బుద్దిఓరుకోదుగా అందుకే పిల్లలూ లెక్కలు చేయండి (వచ్చే క్లాసు వి) సైన్సు ఇంప్రూవ్ చేస్కొండి ఇలాంటి టీచర్ భాషప్రయోగించి చదువు చెప్పేవాళ్ళు . అలా రెండు గంటలు అప్పట్లో టీవీ లు కార్టూన్ నెట్వర్క్లు పోగోలు పోగారుబోతులులేవు కదా మేమే మాలో మేము పోట్లా దుకుంటూ ఆడుకునే వాళ్ళం. అయ్యాక అందరకీ ఒకే పెద్ద ప్లతే లో కలిపినాఅన్నం చుట్టూ కూర్చొని ముదాలు పెడితే తినే వాళ్ళం. అయ్యాక నిద్ర లేక మళ్లీ పవర్ రంగేర్స్ షో నో లేక ఇంకేదోనోమాలో మేమే చేసి తోచట్లేదు తోచట్లేదు అని పెద్దవాళ్ళని తోసే వాళ్ళం గోల చేయక పోతే సాయత్రాన్ రాకెట్ పార్క్ అనోచిక్కడపల్లి వెంకన్న గుడియనో ఏదో చెప్పి ఊరుకో పెట్టేవాళ్ళు... సాయంత్రం ఎవరు మొక్కలకి నీళ్ళు పోస్తే వాళ్ళు మాతోవస్తారు అని ప్రాజెక్ట్ మేనేజర్ లాగా దడిపిస్తే అందరం ట్యూబ్ పెట్టి తెగ ఆయాస పడి ఒళ్ళు తల తడుపుకొని మొక్కలకినీళ్ళు పెట్టేవాళ్ళం అన్నట్టు ఆరోజుల్లో మీరు నమ్మరు కానీ మున్సిపల్ నల్లాల్లో పొద్దున్న సాయంత్రం మూడేసి గంటలుచాలా ఫోర్సు గా నీళ్ళు వచేవి అదీ ఫస్ట్ ఫ్లోర్ కి ఎక్కేంతగా . రాత్రి బాగా భోజనాలయాక మా పెదనాన్న గారు తల కిందచేతులు పెట్టుకొని పెద్ద రేడియో లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వాళ్ళ సంగీతం, చిత్ర గీతాలు వింటూ ఒరే కాళ్ళు నొక్కందిరా వేళ్ళు లాగండిరా అని దానికి కూలి కూడా ఇచ్చేవాళ్ళు . అయ్యాక ఆరుబయట మంచాలు వేస్కొని మాఅమ్మమ్మ చెప్పే హిందీ చందమామ కధల అనువాదం విని , దుప్పట్లు మెడకి కట్టుకొని రాజ కుమారుల ఆటలు కత్తి యుధాలు చేస్తుంటే మా పెద్దమ్మ నిజం దయ్యాల కధలు ఆప్పుడేప్పుడో అక్కడెక్కడో దయ్యం కనబడిందట ఇలాంటివి చెప్తేదెబ్బకి నోరు మూస్కొని పదుకునె వాళ్ళం. నాలుగు రోజులకి ఒకసారి జూ లేక మ్యూ సియం లేక పార్క్స్ చుట్టాల ఇల్లు.. మా అమ్మలా స్నేహితుల ఇల్లు ఏదోటి కానిస్తూ రోజులు నిముషాల్ల అయ్యిపోఅవి. తాజ్ హోటల్లో పూరీలు దోశలు , హవ్మోర్ లో ఐస్ క్రీం లు లిబెర్తి దగ్గర పంజాబీ ధాబా లో రగ్డా ఇందులో ఏదీ ఎన్నేళ్ళైన మర్చిపోలేను.
అంతా హాయిగానే ఉంది కదా మరి
ఏడుపు ఏదీ అంటారా వస్తున్న అక్కడికే సెలవులయ్యకా మళ్ళీ స్కూల్ తెరిచాక దసరా సెలవలకో సంక్రాంతి సెలవలకో స్కూల్ వాళ్ళు తీస్కేల్లె హైదరాబాద్ నాగార్జున సాగర్ ఎక్సుకర్షణ్ ( విహార యాత్ర ) కి ఫ్రెండ్స్ అంతా వెళ్తుంటే నేను వెళ్త నని ఇంట్లో అడిగితే ఛీ హైదరాబాద్ అలా వెళ్ళాలా సమ్మర్ లో మనం రెండు నేలలు ఉంటాం కదా అని మా యువర్ అనర్ కేసు కొట్టి పడేసేది . అలా వెళ్ళినా , ఫ్రండ్స్ తో వెళ్ళింది వేరమ్మా అని ఎంత చ్చ చెప్పినా మనం కేసు గెలిచే వాళ్ళం కాదు. సామ దాన దండ భెదో పాయలు మనకు తెలియవ్ కదా అందుకే ఒక ఎదుపేదిస్తే ఏమైనా ఫలితం ఉంటుదేమో అని ట్రై చేసే వాడిని ట్రై లే రాని ఏడుపు నీళ్ళు లేకుండా అచ్చం ఇప్పటి హైదరాబాద్ నల్ల లాగా సౌండ్ తో ఏడిచీ ఏడిచీ చివరకి మనం గెలవ లేములే అని ఊరుకునే వాడిని.. అదీ ఈరోజు ఏడుపు కద
మళ్ళీ ఇంకో సారి ఇంకో రకం ఏడుపు తో కలుస్తా అప్పటి దాకా నవ్వండి మీ మీ సొంత విషయాలతో ...

28, ఆగస్టు 2010, శనివారం

ఏడుపు

ఏంటి శుభామాని బ్లాగ్ పోస్టింగ్స్ సీరియస్ గా మొదలెట్టి ఏడుపు అనే టాపిక్ మీద రాస్తున్నానని అనుకుంటున్నారా ...

మనం ప్రదర్శించే అనేకానేక భావాలలో ఏడుపు కూడా ఒకటి కదా అందుకే ఏడుపు గోల ..
మధ్య ఒక hr సెషన్లో ఒకాయన "మనిషి పుట్టగానే చేసే మొదటి పని ఏడుపే అని నొక్కి వక్కాణించాడు దానికి కారణంకూడా చెప్పాడు తన ఉనికిని తెలపడం కోసం అలా ఎడుస్తా మట , లేక పోతే మనని ఎవరు పట్టించుకొలేదని ఫీల్అవుతామాట. అంటే గుర్తింపు కోసం చేసే మొదటి పోరాటమే పుట్టగానే చేసే ఆలాపన , నా పక్కనాయన వెంటనేతగులుకొని అసలు పుట్టగానే చేసేది ఏడుపు కాదు ఊపిరి పీల్చుకోవటం అని చెప్పాడు hr బాబు కి ఎదురు వినటంఅలావాటు ఉండదు కదా అందుకే లైట్ తీస్కున్నాడు.
మనంప్రదర్శించే
అనేక భావాలలో ఏడుపు కూడా ఒకటి కదా అందుకే దాని మీద బ్లాగాను , మొదటి సరి ఏడ్చింది ఎప్పుడో సరిగ్గా చెప్పలేను కాని గుర్తున్నంత లో కొన్ని ఏడుపులు బాగా నిలిచి పోయాయి.
అందులో ఒకటి చెప్తాను (చెబ్తాను అంటే వీరేంద్రనాద్ కి ఇష్టం కాని నేను చెప్తాను)
నేను ఒకటి నుంచి అయిదు దాక మా అమ్మ టీచర్ గా పనిచేసిన govt స్కూల్లోనే చదివాను ఐదో క్లాసు లో మా అమ్మేలెక్కల టీచర్, అవటానికి టీచరే కాని మా అమ్మ రూల్స్ లో జుస్టిస్ చౌదరి అంచేత నాకేం ప్రత్యేక రాయితీలుప్రకటించలేదు. నేను లెక్కల్లో వీకెం కాదు కానీ ఎక్కాలు ఒప్పచేప్పమంటే కొంచం తడుముకుంట ఇప్పటికీ.... అదేరాయమంటే కూడుకుంటూ రాయగలను. హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో మా అమ్మ పరిక్ష రోజు పొద్దున్నే పేపర్ అంతా సెట్ చేసితన బాగ్ లో పెట్టుకొని వంట చేసే పన్లో పడింది.. మా అక్క అన్న నాకు సహాయం చేద్దామని సదుద్దేశం తో పేపర్ లీక్చేసి 7 ఎక్కం ఇచింది బాగా బట్టి కొట్టు అని చెప్పారు సరే కదా అని వాళ్ళని బాధ పెట్టతమెండుకని
బతికాం దేవుడా ఆని పని చేసేసి నిశ్చింత గా ఉన్నా. కాని మా అక్క, అన్న ఓవర్ ఆక్షన్ వల్ల మా అమ్మకి సంగతి తెలిసింది, మా అమ్మజాగ్రత్త లో మా అమ్మ ఉంది. ఇంట్లో ఏమనలేదు కానీ పరీక్షలో మాత్రం యువరానర్ లాగ నన్ను ఎనిమిదో ఎక్కంచెప్పమంది సరే నని నేని ఒక ఎనిమిది ఎనిమిది రెండెనిమిడులు పదహారు మూడు ఎనిమిదులు ఇరవై నాలుగునాలుగెనిమిదులు ముప్పై ఆరు ఆహా కాదు ముప్పై నాలుగు ఉహు నలభై ఇలా సాగించా సరే ది కోర్ట్ ఈస్ అద్జోర్న్ద్అన్నాలెక్క లో వెళ్లి కూర్చోమంది బతుకు జీవుడా అని వెళ్లి కూర్చున్న . నాలుగు రోజుల తర్వాత మార్కులుఇచేటప్పుడు కూడాఏమీ అనలేదు యాభై కి నలభై రెండు వస్తే ఇంక పర్లేదు అనుకోని ఇంటికేల్లా .. రోజు సాయంత్రంఇంటికొచిన మా అమ్మ అపరిచితుడు లో విక్రం లాగ లెక్కల మార్కులు ఇచ్హారా అని అడిగింది అదేంటీ ఇలా అడుగుతొందీ అని నీకు తెలుసుకదా అన్నా .. అంతే అప్పుడు నిండా పదేళ్ళు లేని చొక్కా కూడా లేని నా లేత వీపుమీద వీపుమీద రాత్రి ఎనిమిది (అక్షరాలా ఎనిమిదికి..) కాంగ్రెస్ గుర్తులేసింది చూడండీ... అప్పుడు ఏడ్చాను మహానుభావా అది ఒక ఏడుపా నిద్ర లో కూడా ఎక్కెక్కి ఎక్కెక్కి ......

ఉంటాను మళ్లీ ఒకసారి ఇన్కో ఏడుపుతో కలుస్తా
అప్పటిదాకా నవ్వుతూ ఉండండి (నవ్వొస్తే నే ...)

27, ఆగస్టు 2010, శుక్రవారం

భోధి వృక్షమ్ కి౦ద జ్ఞానో దయమ్..

అమ్మయ్య ఇప్పటికి తెలుసుకున్నాను తెలుగు లో రాయటం కానీ త్వరలో ఈ సదుపాయం మాయము కానుందని తెలిసి చింత పట్టుకుంది... అప్పుడెలాగో ......?

17, ఆగస్టు 2010, మంగళవారం

పరా బ్రహ్మ పరమేశ్వర.......

అమ్మయ్య నేను కూడా బ్లాగర్ ని అయ్యాను. పరా బ్రహ్మ .. పాడి రంగం లొ దిగాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇది చెయ్యాలని ఇప్పటికి కుదిరింది

ఇకనుంచి నేను కూడా కాలిదాసునే .........!!!