30, జులై 2013, మంగళవారం

మనమే !!ఈ  కాంగ్రెస్ ని గెలిపించింది మనమే
తెలుగు దేశం మనదన్నదీ  మనమే,
కాషాయం కావాలన్నది మనమే,
జై జగన్ అన్నదీ మనమే,
మతానికి ఓటేసింది మనమే,
ఎర్ర జండెత్తింది కూడా మనమే
మనమంటే మనం
మనమంటే జనం
ఛీ ఛీ అన్నా,  ఛా ఛా  అన్నా  మనకే
ఖాండ్రించి ఉమ్మినా మనమీదే...
అంతేత్తునున్న ఆకాశం మనమే.. 

దిగజారి కింద పడింది మనమే ..
మనమంటే జనం
అంటే ఓటేసిన జనం 

మనమంటే
పోటీ పడ్డ అజ్ఞానం !!