7, ఆగస్టు 2011, ఆదివారం

ఎవరికి చెప్పను..?


నాకు ఫ్రెండ్స్ లేరు బాబోయ్,
ఇంకా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఎవరికీ చెప్పను?


జన్మ నిచ్చిన అమ్మ,

తోడబుట్టిన వాళ్ళు,
ఇరవై ఆరో ఏట నా జీవితం లోకి అడుగిడిన భార్యా,
అదే ఏడు చివర్లో నా జీవితం వెలిగించిన నా కూతురూ,
ఇంకా బంధువర్గం ...

ఎప్పుడో ఒకసారి తళుక్కున మెరిసే చిన్ననాటి మిత్రులు,

ఫోన్లలో సరాగాలాడే కాలేజీ సహచరులు,
అప్పుడప్పుడు మెదిలే ఉద్యోగం బాచ్మేట్లు,
విధి నిర్వహణ లో నిరంతరం తారసిల్లే మనుషులు,
ఇంటిచుట్టుపక్కల ఆప్యాయంగా మెసిలే ఇరుగుపొరుగు వాళ్ళు,


వీరెవరూ నాకు మంచి మిత్రులు కారు

మంచి మిత్రునికి నా నిర్వచనం వేరే ఉంది,
అచ్చు నాలాగే ఉండాలి
రూపం లో కాక పోయినా
గుణం లో, మనసులో, మెదడులో
అచ్చు నాలాగే ఉండాలి.
నా లాగే ఆలోచించాలి.
నా అభిరుచులే ఉండాలి.
నా గుణాలే ఉండాలి.
అటువంటి ఇంకో మనిషి ఉంటాడా?
ఉంటే నాకు ఫ్రెండ్ గా కావాలి
నేను ఫ్రెండ్షిప్ డే శుభాకాక్షలు చెప్పటానికి తహ తహ లాడే
ఆ వ్యక్తి ఉన్నాడా, ఉంటే నాకు వినిపించాలి, కనిపించాలి, నాతో మసలాలి.
అత్యాశ అనిపిస్తే ఒదిలేయండి.

నేనే వెతుక్కుంటాను

వెతికేసు కున్నాను.
దొరికేసాడు
అది నేనే,
నేను పొగుడు కోవటానికీ, విమర్శించు కోవటానికీ,
వద్దని వారించటానికీ, ముందు కెళ్లమని భుజం తట్టటానికీ,
ఒంటరిగా ఉంటే కబుర్లాడటానికీ, మనసు నొస్తే మౌనం గా ఉండటానికీ,
ఇష్టమైన మంచి తిండి, పుస్తకం, సంగీతం,
రంజితమైన క్షణాలు, నిమిషాలు, గంటలూ ,
రోజులూ, జీవితం, గడపటానికీ

నాకో నేస్తం ఉన్నాడు.

మీకు నేను స్వార్ధపరుడిలా అనిపించినా
నిజం చెప్తా
అది నేనే !!
అందుకే నాకు నేనే , మొట్ట మొదటి
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గ్రీటింగ్స్ !!
ఆనందకరమైన స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు !!

ఆతర్వాతే మిగతా వాళ్ళందరికీ , మీ అందరికీ

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే !!


7 కామెంట్‌లు:

  1. మిమ్మల్ని మిమ్ము ప్రేమించుకోండి,స్నేహించుకోండి. మీవలనే.. .ఇతరులని..ప్రేమించండి.స్నేహించండి.

    రిప్లయితొలగించండి
  2. entha manchi snehithudo mee frnd. naaku kulluga undi. nenu naaku manchi frnd ni chesukovalani ippudu naaku oka alocahan kaligindi. nijamga..........thnks. and nice blog.

    రిప్లయితొలగించండి
  3. స్నేహితులు లేకపొవటమేమిటండీ..జన్మనిచ్చిన తల్లిదండ్రులు మొదటి మిత్రులు, ఆ తర్వాత జీవిత భాగస్వామి...వీరిని మించిన అద్భుతమైన మిత్రులు ఎవరండీ? మనం ఏమిటో బాగా తెలిసేది, మనల్ని అర్ధం చేసుకుని భరించేది వీళ్ళేనండి. ఆ తరువాతే ఎవరైనా. అందుకని మీకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు. మీతో మీరు చేసుకునే స్నేహం కూడా బావుంది..:)
    అభిప్రాయాలు కలిస్తేనే స్నేహం కాదు..కష్టనష్టాల్లో తోడుండి, మనకు ఆనందాన్ని కలిగించేది నిజమైన స్నేహం అని నా వ్యక్తిగత అభిప్రాయమండీ.

    రిప్లయితొలగించండి
  4. @ వనజగారు & లక్ష్మిగారు థాంక్స్. హ్యాపీ సిస్టర్స్ డే టూ.
    @తృష్ణ మీరు 100 % కరెక్ట్.
    కానీ నా ఉద్దేశ్యం ఇంకా ఉంది. అది పోస్ట్ లో పూర్తిగా రాయలేదు.
    అమ్మ, నాన్నా, జీవిత సహచరుల మిత్రత్వం లో స్వల్ప భేదం ఉంటుంది. అది పెద్ద తేడా కాదు. లౌక్యం ఎక్కువయితే అసలు తేడాయే ఉండదు.
    పైకి ఒప్పుకున్నా లేకున్నా లవలేశ మంత తేడా రాని ఇద్దరు మనుషులు ఉండటం చాలా (పూర్తిగా) అరుదు.
    మీరు మనుషులనే కాక మనస్తత్వాలుకూడా పరిశీలిస్తే ఆ సూక్ష్మ భేదం కనపడుతుంది.
    అయినా ఇప్పుడా ప్రయత్నం ఒద్దులెండి. బీ హ్యాపీ !!

    రిప్లయితొలగించండి
  5. అజ్ఞాత8 ఆగ, 2011 7:15:00 AM

    మీకు స్నేహితులు వున్నారో లేదో అది నాకనవసరం. ఏదో తెల్లోళ్ళు ఓ దినం పెట్టారు, కాబట్టి 'హేపీ స్నేహితుల దినం' అని చెప్పేసి, 'దినం' అయ్యిందనిపిస్తే పోలా..., మరీ సంవత్సరం దాకా ఆలోచించక్కర్లేదు. :))

    రిప్లయితొలగించండి
  6. మీకు మిత్రులు లేకపోవడమేమిటి.. మనమీద సరైన విమర్శ చేసిన వాడే మంచి మిత్రుడు అని ఎక్కడో చదివిన జ్నాపకం ... ఆ లెక్కన మేం అంతా మంచి మిత్రులమే....

    రిప్లయితొలగించండి
  7. Thank U.. By the way ilaage Happy Foes Day kooda vaste entha bavunnu !! endukante Manaki satruvu kooda maname kada! Arishadvargalu manalni antipettukuni untayi ga. So adannamata sangati. :)

    రిప్లయితొలగించండి