11, ఆగస్టు 2011, గురువారం

౦% కల్పితం



పోయినేడాది ఇదే నెలలో పదహారో తారీకు రమేష్ నాయుడు స్వరపరచిన పాటలు వెతుక్కుంటూ అందులో భాగంగా " లిపిలేని కంటి భాషా ... " అనే పాట విని, ఆ తర్వాత సెర్చ్ బాక్స్ లో కొబ్బరాకు అనే మాట బహుశా "కొబ్బరాకూ గాలి ..." పాట కోసం కొట్టి చూస్తే కొబ్బరాకు పేజి చూపింది.

చూస్తే అది గోపరాజు రాధాకృష్ణ గారి బ్లాగు. బ్లాగుల గురించి వినటం చదవటమే కానీ తెలుగు లో ఇంత లోతైన బ్లాగ్ ప్రపంచం ఉందని అప్పుడే చూసా. ముందు మెల్లగా కొన్ని బ్లాగులు చదివా.
అంతే ఎంతో కర కర లాడుతూ అప్పుడే చేసిన గోరువెచ్చని చేగోడీల లాంటి టపా లెన్నో గబా గబా చదివా.


ఇదేదో బాగుందే, మనమేమన్నా వ్రాసినా ఆ చిత్తుప్రతిని మళ్ళీ అందమైన చేవ్రాత తో వ్రాసి అదే వార పత్రికకో, దిన పత్రిక వార సంచికకో పంపాలని అనుకోవడమే కానీ, వ్రాసిన చిత్తు ప్రతి లేదూ లేదు. ఇంకా అందమైన చే దస్తూరీ నాకు లేదు. పోనీ ఇవన్నీ జరిగినా, ఉన్నా... ఆ పత్రిక వాళ్ళు మన పైత్యాన్ని ప్రచురిస్తారన్న హామీ లేదు.

పైగా వ్రాసింది మన సొంత పైత్యమే, మరొకరి వాతం కాదు అన్న హామీ పత్రం ఎలా ఇస్తాము ? కష్టం కదా !!
అందుకని మనమే బ్లాగు తెరిస్తే పైన చెప్పిన యాతన లేమీ ఉండవు. అసలు ఏ యాతన మన పడక్కర్లేదు. అదంతా చదివే వాళ్ళ భాధ్యత.

అంతే బ్లాగ్ తెరిచే పనిలో పడ్డా. ఆ తర్వాత అంతా దానంతట అదే జరిగాయి. బ్లాగ్ పేరేంటి, పేజి ఎలా ఉండాలి, ఎలాంటి సందేహం లేక అప్పుడే విన్న పాట "లిపి లేని భాష " గా స్థిరపడిపోయింది. పైగా నేను ఇందులో వ్రాసిన వన్నీ ఇప్పటివరకూ ఎవరికీ చెప్పలేదూ .. వ్రాయ లేదు, అలా లిపి లేకుండా నా మనసులో బలమైన జ్ఞాపకాలుగా నాటుకుపోయిన ఊసులు.


మొదటి నెల అంతా నే రాసింది ఎవరూ చదవలేదు. కారణం నా బ్లాగ్ ఉన్న సంగతి నాకు తప్ప ఎవరికీ తెలీదు.
తర్వాత సంకలిని , జల్లెడ, హారం, మాలిక, కూడలి సంకలిని లాంటి వారి సహకారం తో నా బ్లాగ్ వెలుగు లోకి వచ్చింది.

నే
వ్రాసిన టపాలు ఎలా ఉంటాయో నాకే సరైన క్లారిటీ లేదు. కానీ నన్ను కూడా మెచ్చుకునేవాళ్ళు ఉన్నారని అప్పుడప్పుడూ తెలుస్తోంది.

ఏదేమైనా అసలు పైన చెప్పినట్లు పాటలు నెట్లో వెతకటానికి కారణమైన, నన్ను బుజ్జి బాబాయి అని పిలిచే నా అంతర్జాలకూతురు రూప కి నేను ఎంతో రుణ పడి ఉంటా.
గాడ్ బ్లెస్ హర్ !!

5 కామెంట్‌లు:

  1. ఏడాది పూర్తి చేసిన మీ లిపిలేని భాషకి నా శుభాకాంక్షలండి. మీ అంతర్జాల కూతురికి కూడా నా శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. మీ బ్లాగుకి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలండీ..

    రిప్లయితొలగించండి
  3. బ్లాగు మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  4. @జయగారు , రవికిరణ్ గారు , జ్యోతిగారు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  5. mee lipileni bhasha ilage lipilekapoyinaaa..vennala godaari meeda pilla galiki ooguthu sage navala saagipovalani aseervadisthu, modati varshikothsava subhakankshalu.

    రిప్లయితొలగించండి