14, ఆగస్టు 2011, ఆదివారం

కామెంటితే ప్రాణాలిస్తా ..


కృష్ణ సినిమా టైటిల్ లా ఉందా?

కాదులే ... ఈ రోజు నా బ్లాగు కు సంభందించి నాకొరిగిన ప్రయోజనాలని చెప్తా.
మొదట్లో కొన్ని మెచ్చుకోలు కామెంట్లు పడ్డాయి. స్వల్ప సంఖ్యలోనే అయినా అవి నాకు మంచి కిక్కు నిచ్చాయి.
ముఖ్యం గా రహిమాన్ భాయి, మస్తాన్ అనే ఆయన, కొన్ని అజ్ఞాత కమెంటర్లు, అప్పుడప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ కామెంటారు.
ఆ అనందం లో వేగంగా రాయటం, అందులో చాలా టైపో లు ఉండటం, అవి సరిదిద్దుకోమని కొత్తపాళీ గారు లాంటి వాళ్ళు సున్నితంగా తొడ పాశం పెట్టటం చేసారు.
పంతులజోగారావు గారు లాంటి పెద్దలు కామెంటు రాయటం మంచి బలాన్నిచ్చింది.
ఆ జోరు లో "మారేడు మిల్లి ట్రిప్" కి ఓలేటి శంకర్ గారి మొదటి కామెంట్ బాణం " తాగి కార్ నడపటమే కాకుండా సిగ్గులేకుండా ఇంకా రాస్కుంటారా మీ వల్ల తెలుగుజాతి నాశనమవుతుంది" అని వాత వేసారు.
స్వాభావికంగా విమర్శ అనగానే రోమాలు నిక్క బోడుచుకునే మనిషిని కాబట్టి వెంటనే తప్పును సరి దిద్దుకున్నా కామెంటు లోనే. పోస్ట్ మాత్రం యదా తదం.
నిజానికి నా ఫ్రెండ్స్ లో నాకు తాగుడు అలవాటు లేదు. అందరూ మందేసిన మధుర క్షణాల్లో నేను చక్రధారి నవుతా అంతే.
అర్ధం కాలేదా స్టీరింగ్ వెనక నేను.. అదీ సంగతి.
అలా చేదుగా మొదలైన మా పరిచయం తియ్యగా సాగాలని ఓలేటి శంకర్ గారికి మెసేజ్ పంపా.
నిజం గానే మేము మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు.
ఈ కామెంట్ల విషయం కొస్తే ఒక్కోసారి నా వీపు నువ్వు గోకు నీ వీపు నే గోకుతా అనే ఆంగ్ల నానుడి లా ఉంటాయి.
చిన్నప్పుడు ( అంటే బ్లాగ్ మొదలేసిన కొత్తల్లో ..) నా కామెంటు కి రిప్లై ఇవ్వక పోయినా, లేక నా బ్లాగ్ లో ఎప్పుడన్నా కామెంటు వేయక పోయినా వాళ్ళ తో మనసు లోనే పచ్చి కొట్టేసే వాడిని.
పెద్దయ్యాక ఆ గుణం పోయింది.
సాధారణం గా అన్ని బ్లాగులూ చదువుతా. ఏదన్నా అనాలి అనిపించి నప్పుడు కామెంటుతా. అది ఎవరు ఎలా తీస్కున్న నాకనవసరం.
ఈ కామెంట్ల విషయం లో ఒకటి గ్రహించా..
కామెంటు మోడరేషన్ ఉన్న బ్లాగుల్లో కొంత మంది కనీసం అరడజను కామెంట్లు వచ్చేదాకా ప్రచురించరు. నా రేంజ్ మినిమం పది, పాతికా అన్నట్లు.
పోనీ చూస్కోరా అంటే అదీ కాదు...
కామెంటు వెయ్యగానే ప్రచురిస్తే , మరీ ఎదురుకోలు మేళం లా ఉంటుందని వాళ్ళ అభిప్రాయమేమో. ఏమో వాళ్ళిష్టం అది.
ఇంకొంత మంది కామెంట్లు ప్రచురించి వాటిలో కొంత మందికే జవాబు ఇస్తారు. మిగతా వాళ్లకి జవాబివ్వటం నా లెవెల్ కాదు అన్నట్టు.
వీళ్ళని మాత్రం నేను స్పృసించను. నా లెవల్ నాకూ ఉందిగా..
ఏదేమైనా మన బ్లాగ్ చదివి, వ్యాఖ్యానించిన వాళ్లకు ఇతోధికం గా జవాబు నివ్వటం మంచి సాంప్రదాయం.
ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకి కేటాయించిన సీట్లు వాళ్ళకే ఇవ్వటం లాంటిదన్నమాట.
సిమిలీ బాలేదా.. ? నిద్ర వస్తోంది అంతకన్నా మంచి పోలిక ...ఎనక్కు తెరియాదు...!!


8 కామెంట్‌లు:

  1. :) నేనైతే.. టపా ప్రచురించాక, లాప్ టాప్ దగ్గర ఉన్నంత వరకూ వచ్చిన కామెంట్లు వచ్చినట్టు ప్రచురిస్తాను. సమాధానాలు నెమ్మది గా బల్క్ గా ఇస్తాను. ఒకటి రెండు టపా లకి చాలా కామెంట్ల ప్రవాహం వస్తున్నప్పుడు మాత్రం తాత్కాలికం గా మాడరేషన్ తీసేసాను.

    మీ బ్లాగ్ ని ఇంతకు ముందరి టపా లో మీరు తక్కువ చేసుకుని రాసినట్టు నాకనిపించింది. మీరు 'నేను గాంధీ ని కలిసాను..' టపా రాసినదగ్గర్నించీ మీ బ్లాగ్ కి ఫాలోవర్ ని. మీ బ్లాగ్,కామెంట్లు చదవటం నాకిష్టం.

    రిప్లయితొలగించండి
  2. @ కృష్ణప్రియ : పన్నెండు నెలల బ్లాయాగాన్ని ( బ్లాగ్+ ప్రయాణము+యాగం)ని క్రోనోలోజికల్ ఆర్డర్ లో వర్ణిస్తున్నా. అప్పటి పరిస్థితి అది.
    ఇప్పుడు నాకు నేనే అల్లసాని పెద్దన్న, ముక్కు తిమ్మన, తెనాలి రామ..
    మీ కామెడీ కోషంట్ పడిపోయిందేమో డాక్టర్ని కలవండి.
    థాంక్స్ ఫర్ బీయింగ్ మై బ్లాగ్ ఫలోయర్. నేనూ మీ బ్లాగ్ faaloyarne !!

    రిప్లయితొలగించండి
  3. ప్రశంస ప్రాణం లాటిదైతే..విమర్శ..ఆక్సిజన్ ..అని నేనంటాను.రెండు కావాలి.కామెంట్ల పబ్లిష్ విషయంలో.. ధన్యవాదములు చెప్పే విషయంలో కొంత సమయం వేచిఉండటం అవసరమని..నేను అనుకుంటాను. సౌలభ్యం ని బట్టి.. వెంటనే..ధన్యవాదములు చెప్పడం సంస్కారం .. మంచి విషయాలు..ఊదుడు పరీక్షల్లో..నేనే..నెగ్గేది అని చెప్పడం మీ మార్క్ బ్లాగింగు నాకు బాగా నచ్చిన విషయం. మీకు.. అభినందనలు

    రిప్లయితొలగించండి
  4. ఊదానా నేనా ? ఎప్పుడు ? హవ్వ !!
    థాంక్సండి వనజ గారు ( అమ్మయ్య వెంటనే చెప్పేసా)

    రిప్లయితొలగించండి
  5. ఆత్రేయ గారూ
    మీ బ్లాగ్ + ఆత్మ = బ్లాగాత్మ కధలో నా గురించి రాసి నందుకు ధన్యవాదములు.. స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
  6. కృష్ణప్రియ గారు చెప్పినట్లు టపా పెట్టిన కాసేపుదాకా ఆన్లైన్లో ఉంటే నేనూ ప్రచురించేస్తానండి. కానీ సమయం లేక బ్లాగ్ చూసుకోలేకపోతే మళ్ళీ నెట్ ఆన్ చేసాకే. జవాబులు కూడా దాదాపు అన్నింటికీ రాస్తాను. ఎంతో కుదరకపోతే తప్ప రాయకపోవటం జరగదు. కానీ ఒక సంగతి ఉందండీ...ఎప్పుడు కూడా మనం అనుకునేదే కరెక్ట్ కాకపోవచ్చు. చదివినవాళ్ళు కామెంట్లు రాయటం, రాయకపోవటం, ఇతర బ్లాగర్లు వాళ్ల కామెంట్లు ప్రచురించటం, ప్రచురించకపోవటం వెనుక చాలా కారణాలు ఉండచ్చు. మనం మన ఆలోచనావిధానాన్ని బట్టి ఇతరుల్ని అంచనా వెయ్యటం తప్పేమో... అన్నది నేను నా రెండేళ్ళ బ్లాగింగ్ లో గమనించుకున్న విషయం. మీ అంచనా మీ ఇష్టమనుకోండి...:)

    రిప్లయితొలగించండి
  7. @వోలేటి థాంక్ యు.
    @త్రిష్ణ : అన్నా హజారే అవినీతి ని అంత మొందించండి, జన లోకపాల్ బిల్ పెట్టండి అంటే ప్రనబ్బ , చిద్దు, శ్రద్దు , గోకే మాట్నీ, ఇలాంటి వాళ్ళంతా ఒద్దు, ఒద్దు అన్నట్టు మీరెందుకు మీకు అన్వయించు కుంటారు ?
    నేను జనాంతికంగా రాసాను. అదీ సరదా కోసం, కొంపతీసి ఈ టపా వల్ల నా మానవ సంభంధాలు దెబ్బతినవు కదా. ఏంటో సలహా చెప్పటానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు.

    రిప్లయితొలగించండి
  8. అయ్యో, మీకలా అర్ధమయ్యిందా? నేనేం నాకు అన్వయించుకోలేదండి. జనరల్ గా మీరు వ్యాఖ్యల గురించి రాసినదానికి జవాబు రాసాను. మీ ఇంటావిడ ఊళ్ళో లేరని కంగారు పడకండీ... మళ్ళీ ఏడు నే బ్లాగింగ్ లో ఉన్నాలేకపోయినా మీకు తప్పకుండా రాఖీ పంపిస్తాను. మర్చిపోను..:))

    రిప్లయితొలగించండి