15, ఆగస్టు 2011, సోమవారం

ఎక్సూస్ మీ డూ యు బ్లాక్..?


ఈరోజు ఝండా వందనం ,ఆఫీసు లో పని , రచయితల మహా సభ చివరి రోజని వెళ్ళటం ఇత్యాది పనులతో
ఈరోజు టపా నైవేద్యం తయారు చెయ్యలేదు.
పడుకునే ముందు మనసొప్పక ఈ చిన్న సంఘటన చదివిస్తా ..
" చాలా ఏళ్ళుగా ఒక పెద్దాయన తో నాకు పరిచయం. ఆయనకు 83 ఏళ్ళు, చూపు కాస్త మందగించింది, ఇంకా వినికిడి శక్తీ తగ్గింది.
నేను అప్పుడప్పుడూ అయన దగ్గర ఒక గంట గడుపుతా కేవలం పనిమనిషి మీద ఆధార పడి కుటుంబానికి దూరంగా ఉన్న అయన తో నాకు స్నేహం కలవటానికి కారణం ,
నాకెంతో ఇష్టమైన పాత సంగతులు అంటే సుమారు అరవై ఏళ్ళ క్రితం వి ఊరించి.. ఊరించి చెప్తారు.
అవి నాకెంతో వీనుల విందుగా ఉంటాయి.
ఆయనకీ నేనంటే చాలా ఇష్టం, బుద్ధిగా ఉన్నట్టు నటిస్తానని.
నే వెళ్ళగానే వచ్చావా..రా.. అంటూ వెలిగే అయన బోసి నోటి ముఖం నాకు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ని గుర్తు చేస్తుంది.
అలా ఒకసారి అయన తో గడపటానికి వెళ్ళా. అప్పటికి నా బ్లాగు తెరిచి నాలుగు నెలలై ఉంటుంది.
మెయిల్స్ ఎమన్నా వచ్చాయేమో అని పదే పదే మొబైల్ లో చూసుకోవటం అలవాటై పోయింది.
అయన దగ్గర ఉన్నపుడు ఫోన్ లోకి చూస్కుంటుంటే ఆయన " ఎంటీ చూస్కున్తున్నావ్ ఆ బిళ్ళ ఫోన్ లోకి..?" అని అడిగారు.
"మెయిల్స్ వచ్చెయేమో అని చూస్కుంటున్నా" అన్నాను.
"ఎక్కడ నుంచి రావాలీ?" అన్నారు.
"బ్లాగు తెరిచా దానికి జనం ఏమన్నారో అని చూస్కున్తున్నాను" అన్నాను.
"బ్లాకా ఏమి బ్లాక్ చేస్తావు ? అయినా అది నేరం కదా " అన్నారు.
ఫోన్ లోకి చూస్తూ సరిగ్గా వినిపించు కొని నేను " నేరమా అదేంటి చాలామంది చేస్తున్నారు అలాగే నేనూ" అన్నాను.
నే చెప్పింది జాగ్రత గా విని " ఎవడో వెధవలు( సీనియర్లు బ్లాగర్లూ సారీ ) చేసారని నువ్వూ చేస్తావా నీ బుద్దేమ్ ఏడిసింది ?"
అమ్మో ఈ తిట్లేంటి అనుకోని " బ్లాగ్ రాయటం అంటే మాటలు కాదు తెలుసా? " అన్నాను.
మళ్ళీ అయన " ఇంతకీ బ్లాకు లో ఏమి అమ్ముతున్నావు ? లాభం బాగా ఉందా ?" అన్నారు.
అప్పటికి నాకు వెలిగింది నే బ్లాగ్ అన్నది ఆయనకి బ్లాక్ లా వినపడింది అని,
నేనేదో నల్ల బజారు లో కొట్టు తెరిచానని ఆయనకి కోపగించారు అని.
అయన కి విడమర్చి సర్ది చెప్పా అసలు విషయము.

ఇంతకీ మనమంతా బ్లాకుతున్నామా ? బ్లాగుతున్నమా?

" నాకు మాత్రం మనసులోని చీకటి గదుల్లో ఉన్న ఊసులు బయటకి తెస్తున్నాం కాబట్టి ఇది బ్లాకింగే"


7 కామెంట్‌లు:

  1. హహహ...చివరి వాక్యం అదరహో!...I Agree :)

    రిప్లయితొలగించండి
  2. @ సౌమ్య థాంక్స్
    @ సుజాత షేం టు యు. బుజ్జమ్మ అప్పుడే చదివేస్తోన్దా. ఈ దసరా కి బ్లాగ్ మొదలెట్టించండి.

    రిప్లయితొలగించండి
  3. బ్లాకింగ్ సంగతి ఎలా ఉన్నా మీరు ఆ పెద్దాయనను తరచూ కలవటమ్ అనేది నాకు బాగా నచ్చిందండీ. మంచి పని చేస్తున్నారు. ఆ వయసువాళ్ళకు ముఖ్యంగా కావాల్సినది ఎవరన్నా పలకరించటమే.

    రిప్లయితొలగించండి
  4. @తృష్ణ ఆయన్ని కలవటం లో నా స్వార్ధమే ఎక్కువుంది. నన్ను నేను పుట్టక ముందు రోజుల్లోకి తీస్కెళ్ళి మళ్ళీ వెనక్కి తెచ్చే గంధర్వుడు ఆయన.

    రిప్లయితొలగించండి
  5. ఓహో మిమ్మల్ని గతం లోకి లాగి తిరిగి బ్లాగ్ (బాక్) టు ది ఫ్యూచర్ తీసుకొస్తునారన్న మాట. బ్లాగుం (కుం)ది మరి.

    రిప్లయితొలగించండి