13, నవంబర్ 2010, శనివారం

మా అమ్మ చాచా నెహ్రూ ని ఆపేసింది.


నవంబరు పద్నాలుగు మా ఇంట్లో ఒక ముఖ్యమైన రోజూ నెహ్రు పుట్టిన రోజని కాదు. మా అమ్మ పుట్టినరోజు.
ఆ రోజూ పుట్టిందనే మా అమ్మ పేరు ఇందిర అని పెట్టారు మా తాత అమ్మమ్మ.
చిన్నతనం లోనే వాళ్ల నాన్న చనిపోవటం తో మా అమ్మ పెద్దమ్మ ఇద్దరు పీ.యు.సి తోనే చదువా పేసి
టీచర్ ట్రైనింగ్ తీస్కోని పద్దెనిమిది ఏళ్ళ కే ఉద్యోగం లో చేరి పోయారు. అసలు వాళ్ళు ఏమి సాధించినా ఆ గొప్పతనమంతా మా అమ్మమ్మది.

చిన్న వయసులోనే భర్త పోతే ఇద్దరు హై స్కూల్ చదువుతున్న ఆడపిల్లలతో హైదరాబాద్ నగరం లో ఏ ఆధారమూ, ఉద్యోగమూ లేకుండా నెట్టుకొచ్చింది.

ఏం పెట్టిందో ,ఎలా పెంచిందో తెలీదు కానీ, ఒంటరిగా పిల్లలని పైకి తీస్కొచ్చి, పెళ్ళిళ్ళు చేసిన మా అమ్మమ్మ నా కంటికి ఒక కార్పోరేట్ కంపనీ CEO లా అనిపించేది. ఆమె ఐక్యూ ముందు మా ఇంట్లో అందరూ తక్కువే. ఆమె గురించి రాస్తే పెద్ద పుస్తకమే అవుతుంది.
పుట్టినరోజు మా అమ్మది కాబట్టి అమ్మ గురించే రాస్తా..

మా అమ్మ హైదరాబాద్ లో ఆమె బాల్యం గురించి అప్పుడప్పుడూ కధలు గా చెప్పేది అందులో ఒకటి
స్వాతంత్రానికి ముందు మా అమ్మ పదేళ్ళ లోపు నెహ్రు గారు హైదరాబాద్ రావటం,
రోజూ అయన బస నుంచి మీటింగ్స్ జరిగే స్తలానికి అయన కారులో వెళ్తుంటే
మా అమ్మ, పెద్దమ్మ, మిత్రులు ఆయన్ని చూడటానికి
ట్యాంక్ బండు మీద మాటు వేసి ఆయన్ని చూడలేక పోవటం
దాంతో కొంచం అల్లరి దైన మా పెద్దమ్మ నాయకత్వం లో పిల్ల లంతా చేతులు పట్టుకొని
రోడ్ కు అడ్డం గా నుంచున్నారు. కార్ ఆగి నెహ్రు గారు ఆ పిల్లలు ఎందుకు అడ్డం నుంచున్నారో
కనుక్కోమని పక్కనున్న వాళ్ళని పంపితే
మా అమ్మ వాళ్ళు నెహ్రు మాకు కనపడట్లేదు రోజూ అయన కోసం పొద్దున్నే ఇక్కడ ఎదురు చూస్తున్నాం
అని చెప్పారుట. మరుసటి రోజూ నుంచి నెహ్రు గారు ఓపెన్ టాప్ వాహనం లో నుంచొని
వాహన్నాన్ని చాలా నెమ్మది గా వెళ్ళమని చెప్పి అయన హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు
అలాగే వెళ్ళారుట. అంతే కాక వీళ్ళ తో కరచాలనం కూడా చేసారుట.

ఇంకా చిన్నప్పుడే సర్దార్ వల్లభాయి పటేల్ ని కూడ చూసింది.

ఇంకో ముఖ్య సంఘటన ఆంధ్రరాష్ట్ర ప్రధమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గారు
చనిపోయినప్పుడు అయన చితా భస్మం గోదావరి లో కలపటానికి మా అమ్మ
వాళ్ల మేనమామ ఆయినా జొన్నలగడ్డ రామలింగయ్య గారితో రాజమండ్రి వచ్చి స్వయం గా గోదావరి లో ప్రకాశం గారి చితా భస్మం కలిపి వెళ్ళింది.
ఇలాంటివి విన్నప్పుడు నాకు ఒళ్ళు పులకరించేది. మా అమ్మ చెప్పిన జాతీయ నాయకుల కధలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.
నా పసితనం లో మా అమ్మ పాడిన జోల పాటలు ఇప్పటికీ నాకు నిద్ర తెప్పిస్తాయి అంతగా గుర్తున్నాయి.
అందులో ముఖ్యం గా శ్రీకర కరుణాల వాలా వేణుగోపాలా (బొబ్బిలి యుద్ధం) బాగా పాడేది,
అదే పాట మా మేనల్లుడు పుట్టాక కూడా జోల గా పాడేది. భానుమతి గారికి మంచి అభిమాని. ఎపుడూ ఆమె పాటలే పాడేది.
మా అమ్మ స్కూల్లో టీచర్ గా చేస్తూ మా అమ్మని అక్క అక్క అని పిలిచే
సరోజినీ టీచర్ పెళ్లి చూపుల కోసం సావిరహే .. పాట నేర్పించి పాడించి సుబ్బారావు బాబాయ్ ని మెప్పించి
మరీ దగ్గరుండి పెళ్లి చేయించింది. తను పని చేసే స్కూల్లో అందరికీ ఎంతో అభిమాన సహోద్యోగి.
అలాగే విద్యార్ధినులకి వాళ్ల తల్లి దండ్రులకీ కూడా అభిమాన టీచర్.
క్రమశిక్షణ కి మరో పేరు గా తను పని చేసిన 38 ఏళ్ళ సర్వీసు లో
ఒక్కరోజు కూడ ఆలస్యం గా వెళ్ళేది కాదు. వాన రానీ పిడుగులు పడనీ 9 : 30 కల్లా స్కూల్లో ఉండేది.
సాయంత్రం స్కూల్ అయ్యాక అన్నీ మూయించి 5 :15 ఇంటికొచ్చేది.
అప్పటి పరిస్థితుల వల్ల PUC వరకే చదివి నందువల్ల మేము పెద్దయ్యాక బి.ఏ , బి.ఈడి చదివింది.
కాకతాళియం గా డిగ్రీ పరీక్షలు నేనూ మా అమ్మ ఒకే బెంచ్ మీద కూర్చొని రాసాం.
అక్కడ కూడా నన్ను తిట్టింది రాయకుండా దిక్కులు చూస్తుంటే.
బందర్లో ఒకే ఇంట్లో స్థిరం గా ఉండటం వల్ల మా రోడ్ కి ఇందిర టీచర్ గారింటి రోడ్ అనే పేరు కూడా వచ్చింది. అంత ఫేమస్.
ఇలా రాస్కుకుంటూ పోతే ఎంతైనా తనివి తీరదు.
ఎవరి అమ్మ అయినా అంతే.... కానీ మా అమ్మ కదా ఇంకాస్త ఎక్కువ అంతే.

ఈ నవంబరు పద్నాలుగు కి డెబ్బై నాలుగు లోకి అడుగు పెట్టిన మా అమ్మ మనవడుపెళ్లి, మనవరాలి పెళ్లి చూసి ముని మనుమల ఎత్తుకోవాలి , నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఆనందం గా జీవించాలని కోరుకుంటూ...







18 కామెంట్‌లు:

  1. హ్మ్.. బాగా రాశా(చెప్పా)ర౦డి మీ అమ్మ గారి గురించి.. మీకు అవి మంచి వెలకట్టలేని అనుభూతులు. అలాగే మీ అమ్మగారికి హృదయపూర్వకమైన : : జన్మదిన శుభాకాంక్షలు : :.. ఇలాగే శత జన్మదినోత్సవం కూడా ఆయురారోగ్యముతో జరుపుకోవాలని కోరుకుంటున్నా.

    మీ అమ్మమ్మ గారి ముచ్చట్లు కోసం ఎదురుచూస్తూ ఉంటా..

    రిప్లయితొలగించండి
  2. Nice to know about your Mom and Happy Birth Day to her.

    Sree

    రిప్లయితొలగించండి
  3. బాగుందండి అమ్మ అమ్మే ఎవరికైనా ... మీ జ్ఞాపకాలు మరీ బాగున్నాయి. మీ అమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. బాగా రాశార౦డి. మీ అమ్మగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆమె సదా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
    హాపీ బర్త్‌డే అమ్మమ్మ గారు. :)

    రిప్లయితొలగించండి
  5. మీతోపాటే ...
    అమ్మ మనవడుపెళ్లి, మనవరాలి పెళ్లి చూసి ముని మనుమల ఎత్తుకోవాలి , నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఆనందం గా జీవించాలని కోరుకుంటూ... హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  6. చాలా చక్కగా వ్రాశారు. మీ అమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయండి.

    రిప్లయితొలగించండి
  7. చాలా బాగారాశారండి. మీతోపాటు కూర్చుని డిగ్రీ పరీక్షలు రాశారంటే తనని నిజంగా మెచ్చుకోవాలి. మీ అమ్మగారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  8. చాల మంచి పోస్ట్ ఇది.
    అమ్మలు అందరు ఇంతే!
    వాళ్ళు మన శరీరాల లో ఒక భాగంగా పరిగణిస్తాం తప్ప,వేరు వ్యక్తులని అనుకోము,వాళ్ళు
    సజీవులైనంత కాలం!
    A Mother is always taken for granted!Her acceptance is so unconditional,
    we do so many things we should not!
    మీ అమ్మగారు మునిమనవల మునిమనవళ్ళకు గూడా గోరు ముద్దలు తినిపించాలని
    అభిలషిస్తూ..
    శ్రీదేవి మురళీధర్

    రిప్లయితొలగించండి
  9. మా అమ్మకి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదములు
    నాతరపునా మరియూ మా అమ్మతరపున....

    రిప్లయితొలగించండి
  10. Many Many Happi Returns of d day to ama frm PrasannaMallika

    రిప్లయితొలగించండి
  11. ManyMany Happi Returns of d day to ama frm PrasannaMallika

    రిప్లయితొలగించండి
  12. chala bavundi mee post..amma tananni naluguri ki inta andamga panchinaduku dhanyavadalu...manasu voosulaki..lipi vundadu..lipilenibasha,mallepudanda...rendu sirshikalu vati vuddesalu kuda chala bavunnayi..intati abinivesanni ..inta daggaraga vunna innallu gurtincha leka poyinaduku..kashaminchandi.nirantaram ee anadanni meeru anubhavinchandi...maku panchandi.

    రిప్లయితొలగించండి
  13. dear prakash
    y'day you came as Zorro ( not as in Spanish which means Fox )
    but as a dashing black-clad masked outlaw who defends the people of the land against tyrannical officials and other villains.
    thanks for the visit
    kidding you
    aathreya

    రిప్లయితొలగించండి
  14. అమ్మకు నానమస్కారాలు చెప్పండి

    రిప్లయితొలగించండి
  15. తప్పక చెప్తాను. మీకు నా నమస్కారములు.

    రిప్లయితొలగించండి
  16. మీ అమ్మగారి గురించి చదువుతుంటే చాలా బాగా అనిపించిందండి . బాగా రాసారు .
    కొంచం ఆలశ్యం గా , మీ అమ్మగారికి జన్మదిన శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి