12, ఫిబ్రవరి 2011, శనివారం

సరదాగా కాసేపు..ద్వేషంగా రాసేవు..


గత సంవత్సరం ఆగస్ట్ 17 న నేను ఒక డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో సేల్స్ మాన్ గా చేరాను.
అప్పటికే నేను చేస్తున్న ఉద్యోగం తో నేను చాలా బిజీ, అయినా ఎప్పుడు ఏదో ఒక కొత్త పనులు నెత్తిన వేసుకోవటం తద్వారా బుర్రకీ శరీరానికీ పని చెప్పటం, నాకు అలవాటు.
దానివల్ల లాభం లేక పోయినా నష్టమైతే రాదు. అయినా లాభం కనపడింది అందువల్ల ఈ అదనపు ఉద్యోగం నాకు బాగుంది.
ఇక పోతే నేను పని లో చేరిన డిపార్ట్ మెంటల్ స్టోర్ గురించి చెప్పాలంటే అదొక వైవిధ్యమున్న వ్యాపారం.
అక్కడ ఏది అమ్మాలన్నా, సేల్స్ పని వాళ్ళే తయారు చేస్కొని వెళ్ళాలి, అంటే అక్కడేమీ వస్తువులు ఉండవు, మనం తీస్కేళ్ళినవే అందం గా పేర్చి, ఆ పైన ప్యాకింగ్ లు మరింత అందం గా కూర్చి,
అక్కడ అమ్ముకోవాలి. ఎన్ని అమ్మాలి , ఎంత సేపు అమ్మాలి అనే నియమ నిభందనలు లేవు, మన సరుకు సొగసు ను బట్టే అమ్మకాలుంటాయి. లాభం లో ఎవరికీ వాటా ఇవ్వఖర్లేదు.
జనాల మెచ్చుకోళ్ళు , భుజం తట్లు, ఈసడింపులు తిట్లు మనకే సొంతం. ఇంకెవరూ అడగరు.
ఇదేదో బాగుందే అనుకోని నేను ఆ ఉద్యోగం లో చేరి పోయా.
అక్కడ చిన్న సైజు ఆంధ్ర రాష్ట్రమే ఉంది
వందల మంది అమ్మే వాళ్ళు , వేల మంది కొనే వాళ్ళు,
వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వారు వందల సంఖ్య లో జమ అవటం వల్ల, సహజం గానే అక్కడ
ప్రాంతీయ తత్వం, వయో ఆధారిత సమీకరణలు, ఆడ వనాలు ,మగ జనాలు, పిల్ల గ్రూపులు
పెద్ద ట్రూపులు, ఇలా ఒకటేంటి ఎన్నో రకాల సంధులు, సమాసాలు ఉన్నాయి అక్కడ.
సినిమా వార్తలు అమ్మే వాళ్ళు, కధలు తుమ్మె వాళ్ళు, కవితలు చిమ్మే వాళ్ళు, నవ్వులు రువ్వే వాళ్ళు,
రాజకీయాలు చేణికే వాళ్ళు, విజ్ఞానం వడికే వాళ్ళు, నిజాలు సర్దేవాళ్ళు వాళ్ళు, అబద్దాలు అద్దే వాళ్ళు, వంటలు వండేవాళ్ళు, అవి తిని పండే వాళ్ళు,
ఇలా ఎంతో మంది సహా వ్యాపారులను చూసా.
సరసం పేరుతో రంజింప చేద్దామనుకునే వాళ్ళు,
విరహం తో కంపింప చేసే వాళ్ళు
ఒకళ్ళేమిటి...
మినీ ఆంధ్ర ప్రదేశ్ కాదు మినీ ప్రపంచమే ఉంది మా వ్యాపార కేంద్రం లో, కాక పోతే భాష ఒక్కటే తెలుగు.
యాసలు వేరు అంతే.
మొత్తానికి ఎక్కడికీ వెళ్ళకుండా కూర్చున్న చోటే వైవిధ్యం పొందే అవకాశం నాకు భలే నచ్చేసింది.
నేను కూడా కొన్ని సరుకులు అమ్మాను.లాభం గా కొన్ని భుజం తట్లు పొందాను.
అన్నిటికన్నా నాకు నచ్చిన విషయం అక్కడ ఎందఱో విద్యాధికులు, మేధావులు, ఎంతో సృజనాత్మకత, ఎంతో భావుకత, రసికత, తాదత్మికత, భావావేశం, ప్రేమ, ఆప్యాయత కురిపించి మురిపించే ...
భగవద్ బంధువులు,సాహితీ మిత్రులు , కలల బేహారులు, రాగాల పల్లకీ బోయీలు, తో కళ కళ లాడుతున్న మా వ్యాపార కేంద్రం నాకు మంచి వ్యాపకం అయింది.
కానీ పుణ్య క్షేత్రం లో కూడా కుచిత రాజకీయ పార్టీ కార్యాలయం ఉన్నట్లు ,
పాపపంకిల వేశ్య వాటిక ఉన్నట్లు,
చీకటి కోణాల వ్యాపార మార్గాలున్నట్లు
ఇక్కడ కూడా కొన్ని వక్ర వేదిక లున్నాయి.
ఆరునెలల కన్నా తక్కువ సమయం ,
అరవంద కన్నా తక్కువ సరుకులమ్మిన అనుభవం,
స్వావిభావికం గా తెలివి తక్కువ పాళ్ళలో ఉండటం వల్ల నేను ఇక్కడ నిశబ్ద అమ్మకం దారుడిగా ఉండి పోయా.
ఒకళ్ళ సరుకుని మరొకళ్ళు విమర్శించుకోవటం
ఒకళ్ళ భావాలని మరొకళ్ళు తప్పు పట్టటం
నేనే గొప్ప అనే దానికన్నా వేరే తప్పు అనే భావజాలం
ఈ ప్రక్రియ లో కొంత మంది మరొకరిని దూషించటం
దూషణ అతిక్రమించి బూతించటం .
విద్య లో ఎంతో సాధించిన వారు
సాంకేతికంగా ఎంతో జ్ఞానం సంపాదించిన వారు
ఉద్యోగం లో ఎంతో ఎత్తుకి ఎదిగిన వారు
జీవితం లో ఎన్నో విజయాలు, అనుభవాలు, ఉన్న వాళ్ళు పెద్దలు, గురువులు ఉన్నారు
ఎవరికి వారు వాళ్ళ వాళ్ళ పరిధి లో, వాళ్ళ వాళ్ళ పరిమితులలో లోబడి ఉన్నారు...
జరుగుతున్న విషయాలను గమనిస్తూ, సహిస్తూ, భరిస్తూ మనకెందుకులే అనుకుంటూ...
అంచేత నేను ఒక నిర్ణయానికి వచ్చాను
నేను చేరిన వ్యాపార కేంద్రం ముందు మోకరిల్లి , ప్రాధేయ పడుతున్నా...
ఇష్టం లేక పోతే అసలు ఒకళ్ళ సరుకులు ఒకళ్ళు చూడొద్దు
ఒకళ్ళ నొకళ్ళు కించ పరుచుకోవద్దు...
నేను చెప్పిన సూచన నాకే చెప్పొద్దూ (నువ్వే మా సరుకులు చూడకు అని)
మీ సరుకుల నాణ్యం బాగుంది కనకనే చూడ కుండా ఉండలేను.
అందుకే
మీ మేధస్సు ముందు నా అజ్ఞానాన్ని నేల రాసి ప్రాధేయ పడుతున్నా...
మీ మీ విజ్ఞానపు మందిరాల మీద విమర్శల పిట్టల రెట్టలు వేయకండి.
మీ మీ భావుకత మాసన సరోవరం లో కాకుల్ని ఈదనీయకండి.
మీ మీ మేధో గగనాల మీద ద్వేష పూరిత డేగలని కమ్ముకోనీయకండి.
LIVE AND LET LIVE
जियो और जीनेदो ||





50 కామెంట్‌లు:

  1. హహాహ్హ...బాగుందండీ మీ డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో సేల్స్ మాన్ షిప్ ..కొత్త వరైటీ జాబ్....ఐ లైక్ ఇట్

    రిప్లయితొలగించండి
  2. @ ఎన్నెల : జాబు బాగుంది , కానీ మనసే బాలేదు
    @కుమార్ : నవ్వకండి నాకు ఏడుపొస్తోంది
    @భరద్వాజ్: నేను ఏ సైడూ కాదు, అసలు ఎన్ని సిడులున్నాయో కూడా తెలీదు.
    గీతాంజలి సినిమా లో డవిలాగ్ "ఎంత కాలం రాస్తామో తెలీదు, రాసినంత కాలం మన రాతల్లో మనకు నచ్చని వ్యక్తుల్ని కాదు , వ్యవస్థ నే తిడదాం."

    రిప్లయితొలగించండి
  3. ఇక్కడ ఇబ్బంది వ్యవస్థవల్ల కాదండీ - కేవలం కొద్ది మంది మనుషుల వల్ల.

    ఒసామా వల్ల మొత్తం ఇస్లామిక్ వ్యవస్థనో లేక నిత్యానంద వల్ల హిందూ వ్యవస్థనో మొత్తం కలిపేసి తిట్టలేం కదా?

    రిప్లయితొలగించండి
  4. Let you be the Mangal Pandey,
    Let you be the first man to stop this,
    B'coz I feel you are one of the very intelligent, talented bloggers.
    I admire your creativity and also others too.
    Please let tranquility prevail in blog world.
    (THIS IS NOT TO STEAL THE SHOW, BUT TO STEER THE FLAT WHEELS )

    రిప్లయితొలగించండి
  5. Evaru evarni marchalemu andi :)
    manam cheppalani chuste manalne marchestaru paadu janam :)
    -kavya

    రిప్లయితొలగించండి
  6. ఒసామా ని మాత్రం ఎందుకు తిట్టాలన్నదే నా ప్రశ్న ? ఇష్టం లేకపోతే అతని జోలికి వెళ్ళకండి అతని ని విమర్శించే హక్కు ఎవరిచ్చారు. నేను నా జోలికొచ్చిన వాళ్ళని తిట్టాను. ఆత్రేయ గారిని గానీ, హరి గారిని గానీ, మిర్చిబజ్జి గారిని కానీ ,మౌళి గారిని కానీ ఇంకా ఎంతో మంది మహిళా బ్లాగర్లు, మేల్ బ్లాగర్లు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ నేను తిట్టలేదే ? నా జోలికొస్తే వాడిని ఊరికే వదలటం అన్నది నా డిక్ష్నరీలోనే లేదు. మీరు లింక్ ఇచ్చారు కాబట్టి మీకు మాత్రమే చెపుతున్నాను. నా మానాన నేను ముగ్గులేసుకుంటుంటే, నేను వ్రతం ఫోటోలు పెట్టుకుంటే వాళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి ? మొమైత్ ఖాన్ ముగ్గులేస్తుంది అని మొదట నన్ను గేలి చేసారు. అయినా బ్లాగింగ్ లో సరదాకి అన్నారని నేను రిక్వెస్ట్ చేసాను, బ్రతిమాలాను అయినా వినలేదు. ఆఖరుగా వార్నింగ్ ఇచ్చాను, నా జోలికొచ్చిన వాళ్ళని నేను దళపతులని పిలుస్తాను అని హెచ్చరించాను. తల్లిదండ్రులనే గౌరవించని వాళ్ళు ఇతర స్త్రీలని ఏం గౌరవిస్తారు ? ఇక ఉద్యమించక తప్పదని ఈ నిర్ణయం తీసుకున్నాను. మీకు బాధ కలిగించినా నేను ఏమీ చేయలేను. యుద్ధం లోకి దిగక ముందు ఆలోచిస్తాం, రాయబారం జరుపుతాం యుద్ధం లోకి దికాక ఎవరో ఒకరు మాత్రమే గెలవాలి. యుద్ధం అంటూ జరిగేటపుడు ప్రజలు కూడా ఇబ్బంది పడతారు మరి !! న్యాయా న్యాయాలు గెలుపోటములమీద ఆధారపడి ఉంటాయి. యుద్ధాన్ని మొదలుపెట్టింది వారే ఆపవలసిందీ వారే !!

    రిప్లయితొలగించండి
  7. Dear Kavya,
    Janam is always good,
    only bad is the time,
    it makes janam to play good or bad.

    రిప్లయితొలగించండి
  8. మరి కల్పనను ఎందుకు తిట్టావనే ప్రశ్నకు నీ దగ్గర జవాబుందా శుర్పణఖా? ఇష్టం లేకపోతే అతని జోలికెళ్ళకండి అనే పాయింట్ ఆ సీరియల్ కి కూడా వర్తిస్తుందిగా! ఇష్టం లేకపోతే నోర్మూసుకుని ఊరుకోవాలి గానీ తిట్టే హక్కు నీకెవరిచ్చారో తెలుసుకోవచ్చా? రాసిందని ఆమెనూ, చదివిన వాళ్లందరినీ తిట్టావు? నీ నీతులు నీకే వర్తించవా? ఏం తింటారు కడుపుకి తమరు?

    ఛ, నీదొక జన్మ! దానికొక సిగ్గు!

    - తన్ హాయీ పాఠకుడు

    రిప్లయితొలగించండి
  9. అహా! నీహారికాగారూఉ...మరి కల్పనగారు మీ జోలికి వచ్చారా?సత్యగారు వచ్చారా? జ్యొతి వచ్చారా?ఇందు వచ్చారా?సుజత వచ్చారా? మలక్ అమ్మాయి అనఘ ఏమంది మిమ్మల్ని? మలక్ తల్లి సీతగారు ఏమన్నారు మిమ్మల్ని? మరీ ఎవరికీ తెలియని కబుర్లు చెప్పకండి మేడం గారూ..!! మీరే అందరినీ కదిలించుకుని వాళ్లమీద పడి అనవసరంగా రచ్చరచ్చ చేసి...అభాండాలు వేసి...అక్రమ సంబంధాలు అంటగట్టి ఎందూకండీ ఇలా అమాయకురాలిలగా నటిస్తారూ!! ఆ??

    రిప్లయితొలగించండి
  10. నా విజ్ఞప్తి ఇరు వర్గాలకు
    ఇక నుంచి తిట్టుకోవటం
    ఎత్తిచూపటం మానేసి
    సైలెంట్ గా ఉండలేరా
    ఇంత తెలివైన మీకు
    ఆ మాత్రం చేత కాదా?
    ఈ సీన్ మీరు బయట ఉండి చూస్తే మీరెలా సలహా ఇస్తారో అదే మీరు ఇరుపక్కలా పాటించండి
    ఇన్ని చదివిన మీకు transactional analysis తెలీదా !!

    రిప్లయితొలగించండి
  11. చాల బాగా చెప్పారు.... ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకుని సాదించేది ఏముంది. అందరి మీద పడుతుంది బురద. అలాగని ఒకళ్ళు నోరు ముసుకుని ఎంత కాలం ఉండగలరు? మోత్తానికి కలుషితం అయిపోతుంది... అవునండి... భాదగానే వుంది. మన మనుషుల మధ్యలో ఏదీ సరిగ్గా వుండదన్న మాట.Blogging should be a good hobby to refresh yourself. If you are pointing your one finger towards others, rest of your own four fingers are pointing towards you. Iam not talking towards any one..

    రిప్లయితొలగించండి
  12. ఆత్రెయగారు మీరు చెప్పింది సబబే! కానీ ఒక మనిషి చేస్తోన్న అనవసరపు రచ్చ ఇదంతా! దానికి ఆమె చూపెడుతోన్న కారణాలు ఎంత పునాది లేకుండా ఉన్నాయో! దేవుళ్లమీద పడి తిట్టడం,బ్లాగర్ల కుటుంబ సభ్యుల మీద పడి తిట్టడం...ఏవిటి ఇదంతా? ఇదంతా చూస్తు కూర్చోవాలా? ఇప్పుడు మీరు ఆ వ్యక్తిని ఏమి అనకుండా కాపాడండీ...రేపు మీ కొంపకి నిప్పటుకుంటే అప్పుడు తెలుస్తుంది.సపోర్ట్ చేయండి.ఈ పిచ్చ్చాళ్లని సపోర్ట్ చేసీ చేసీ మీరు వారిలాగే తయారవుతున్నారు!

    రిప్లయితొలగించండి
  13. మీరు ఎవరిమీద పోరాడు తున్నారో ఏమి కోరుతున్నారో తెలియదు.మీ పోరాటానికి ఎన్నుకున్న ఆయుధం వల్ల మీకే డేమేజీ.

    అందరి సానుభూతి కోల్పోవద్దండి.

    ఆడవాళ్ళు అన్న సానుభూతీ ఇప్పుడు ఈ ఇస్యూలో పని చేయదు. ఎందుకంతే మీ పైబూతులు రాస్తున్నది ఆడవాళ్ళే కాగడా కంతే నీచంగా రాతలు రాస్తున్న వీరిని ఇప్పుడు ఎవరూ ప్రశ్నించరు ఎందుకంతే. కామెంట్లలో బూతులు రాస్తున్న వాళ్ళు ఆడవాళ్ళే.

    సీతాదేవి ని ఆయుధంగా పోరాటం ఇక మానండి. ఎందుకంతే మీ ఆయుధం వాళ్ళకే ఎక్కువ పనికి వస్తుంది మీపై దాడి చేయడానికి వాళ్ళు ఉపయోగించుకుంటున్నది సీతాదేవి అనేది.

    రిప్లయితొలగించండి
  14. ఏంటో దేముడికి టైం బాగాలేదు మాస్టారు :(
    -కావ్య

    రిప్లయితొలగించండి
  15. క్షమించండి అజ్ఞాతలు...
    నేను సప్పోర్ట్ చేస్తున్నానా?
    మీకలా అనిపించిందా?
    నా విజ్ఞప్తి రెండు పక్కలా వర్తిస్తుంది
    చాలా మంది ఉన్న ఒక వైపే కాదు, ఒకళ్ళిద్దరు ఉన్న ఇంకో వైపూ కాదు
    నిజానికి వివాదాస్పదమైన ఆ టపా లేవీ నేను చదవలేదు.
    కానీ ఇప్పటి ఈ తిట్లని మాత్రం ఆపండి.
    ఎదుటి వాళ్ళు మాత్రం ఎంత సేపు తిడతారు?
    ఈ గొడవ ఎక్కడ మొదలైందో నాకు తెలీదు.
    కానీ ఎక్కడ ఆపోచ్చో తెలుసు
    మీరంతా ఎవరికి వ్యతిరేకంగా వాదిస్తున్నారో వాళ్ళు కి కూడా ఏదో వాదన ఉంది కదా.
    పోనీ మీరన్నట్టు ఎదుటి వాళ్లకి పిచ్చే అనుకుందాం " పిచ్చి వాళ్ళతో నిజ జీవితం లో ఎలా స్పందిస్తారు? అదే ఈ ఊహా జనిత లోకం లో కూడా చేయండి. మనమేమీ ఒకళ్ళ కొకళ్ళం బంధువులం కాదు మిత్రులం కాదు"
    శాశ్వతం గా కలిసి ఉండం"
    ఎందుకీ అమాయకత్వం..!!
    నన్ను తిదదామనుకున్న వాళ్ళందరికీ మంచి అవకాశం
    తిట్టి చూడండి
    నేనేమీ స్పందించను.
    నా కొంపకి నిప్పెట్టాలనుకుంటే నీళ్ళు రెడీ చేస్కుంటా ఆ నిప్పు పెట్టిన వాళ్ళ మీద మాత్రం విసరను.
    http://lipilenibasha.blogspot.com/2010/09/blog-post_24.html
    నేను బరువు తగ్గించే డాక్టర్ ను, బరువు పెరగను !!
    సానుభూతి కోరుకునే " సెల్ఫ్ పిటీ " నాకు లేదు.

    రిప్లయితొలగించండి
  16. ఒకటికాదు రెండుకాదు దాదాపు నాలుగు నెలలనుండి అందరూ మౌనంగానే ఉన్నారు .ఆమె ఆపకుండా ఇది ఆగడం కష్టం ఆత్రేయ గారు.ఒకవేళ వీళ్ళు ఆపినా ఆమె ఆగదు.నేనే గెలిచాను మీరు పిరికిపందలు .మీ పెళ్ళాలు వ్యభిచారులు.మీ పిల్లలు సైకోలు అని మళ్ళీ మొదలు పెడుతుంది.

    రిప్లయితొలగించండి
  17. నిజామా? నాలుగు నెలల కాలం ఊరుకున్నారుగా . ఇప్పుడు మాత్రం ఎందుకు
    CEASE FIRE !!

    రిప్లయితొలగించండి
  18. ఆత్రేయ గారికి, గౌరవనీయ బ్లాగర్లకు విజ్ఞప్తి: మదపిచ్చి 'రిటార్డ్' కామెంట్లు మీ బ్లాగులో పడకుండా చూసుకోండి, ఓ 6నెల్లు ఆమె ఏ కామెంటైనా డిలీట్ చేయండి..

    రిప్లయితొలగించండి
  19. "నిజామా? నాలుగు నెలల కాలం ఊరుకున్నారుగా . ఇప్పుడు మాత్రం ఎందుకు
    CEASE FIRE !!"

    Atreya gaaru, I appreciate your initiative. But you know what - laaton ka bhoot, baaton se nahi maanti! So, those who have time and energy, let them pursue this bhoot! Ignore if you must or have fun! :)

    రిప్లయితొలగించండి
  20. ఆత్రేయ గారు మీరు వృధాగా శ్రమపడుతున్నారు. వీళ్ళు గొడవలు ఆపరు. నీహారిక కాకపోతె మరో బేహారిక ని పట్టుకుంటారు అంతె. ఆ గీతాచార్యని అందరూ మరచిపోయేదాక విళ్ళు ఇలాగే హంగామా చేస్తారు.

    రిప్లయితొలగించండి
  21. ఎంత దారుణంగా ఆ అమ్మాయిని బూతులు తిడుతూ కామెంట్స్ రాస్తున్నారు. బ్లాగులొ కామెంట్ పబ్లిష్ అయ్యి అది హారం లో పడిన తరువాత తాపీగా దాన్ని తీసేసి యాబై కామెంట్లు తీసెసాం మీరంతా మాడరెషన్ పెట్టుకొండి జాగ్రత్తా అంటూ పోస్టులు రాస్తున్నారు. చీ ఎంత కోపం వుంతే మాత్రం ఒక అమ్మాయిని అంత దారుణంగా చేస్తారా. ఆ కాగడా నయ్యం వీల్లకన్నా. సీతాదేవి నిజంగా అన్నీ చూస్తుంతే తతనని అన్న దానికన్నా వీళ్ళ దారుణమైన బూతు కామెంట్లు ఆ అమ్మాయిపై దాడికే భాదపడుతుంది.

    రిప్లయితొలగించండి
  22. అయ్యా అజ్ఞాతలు
    నా విజ్ఞాపమా మన్నించి ఇరు వర్గాలు గొడవ ఆపుతారని నమ్మకం
    ఒక రోజు వేచి చూడండి
    ఈలోపు మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాయొద్దు.
    మీకు వేల వేల దండాలు !!

    రిప్లయితొలగించండి
  23. 13 ఫిబ్రవరి 2011 4:11:00 సా
    >ఆ అమ్మాయిపై దాడికే భాదపడుతుంది.>

    అమ్మాయి ఎవరు ప్రవీణ్? మీ 'వదిన' నీకు అమ్మాయెలా అవుతుంది? అందులోనూ ఈ శిఖండిని అమ్మాయని పిలిచావంటే నీవు ప్రయత్నిస్తున్న ప్రవీనుడివని తెలిసిపోయింది. నీ కామెంట్లకు ఫేస్వేల్యూ ఇవ్వరని, అజ్ఞాతలా వస్తావా? సిగ్గులేదూ?

    రిప్లయితొలగించండి
  24. దాన్ని తిట్టడానికి రక్తచరిత్ర బూతులే ఇంకా తక్కువనిపిస్తాయి. అది నీకన్నా ముదిరిన పిచ్చి కాబట్టి నీకు గొప్పలా అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  25. అయ్యా ఈ కెలుకుడు బ్లాగర్లపనే కెలకడం. ఒకరు కాకపోతే ఒకరు...ఏవేవో గ్రూపులున్నాయని చెప్పి వీళ్ళొక గ్రూపుకట్టి ఇలా మంది మీద బ్లాగుల్లోపడి ఏడుస్తుంటారు. అజ్ఞాతలుగా వీళ్ళేవచ్చి బూతులు రాస్తూ ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు రాకముందు..బ్లాగుల్లో వివాదాలూ చర్చలుండేవిగానీ ఇలాంటి విద్వేషాలూ లేవు. They will not stop till Telugu blog world goes dead.

    రిప్లయితొలగించండి
  26. నాకు పిచ్చే అవును
    కాక పోతే నా పిచ్చి లో నేను ఎదుటి వారిని తిట్టను కొంచం బెటర్ కదా !!
    ఒద్దన్నాక కూడా దూషణ తో కూడిన వ్యాఖ్యలు వస్తున్నాయంటే
    నాకోటి అనిపిస్తోంది " ఈ చదువుకున్న వాళ్ళ కంటే ధోభి ఘాట్ లో గాడిదలు నయం అని "
    అవి ప్రచురించిన నేను కూడా వాటితో సమానమే !!!

    రిప్లయితొలగించండి
  27. *DONT PUBLISH*
    ఆత్రేయ గారు మీ అమ్మాయి పేరు పెట్టుకున్న అని మీరు ఆప్యాయంగా అంటారు కాబట్టి చెప్తున్నా ..
    మీరెందుకు అనవసరంగా అన్ని పట్టించుకుని మనస్తాపానికి గురి అవుతున్నారు .. నా మాట విని మీరు వెళ్లి హాయిగా పడుకోండి ..
    ఏది తప్పో ఏది ఒప్పో మనకి తెలీదు .. అలాంటప్పుడు వాళ్ళకి చెప్పేకంటే మనమే ఓపికగా ఉండడం మంచిది .. మీరు మద్యలో వెళ్లి చెడ్డవారు అవ్వడం నాకు ఇష్టం లేదు ..
    అబ్యర్ధన మాత్రమె ..

    రిప్లయితొలగించండి
  28. మా అమ్మాయి (కావ్యా) వార్నింగ్ ఇచ్చినా నేను వినట్లేదు
    ఈ వివాదం సమసి పోయే వరకు నేను గాడిద కుక్క పంది అన్ని అవతారాలు ఎత్తుతా
    అవి బ్లాగ్ లోక కళ్యాణం కోసమే కాబట్టి నాకు అవమానం జరగ నట్టే !!
    i invite more comments abusing me from both sides
    let your garbage be unloaded over me !!!

    రిప్లయితొలగించండి
  29. కావ్యా అచ్చు మా అమ్మాయి లాగానే సలహా ఇచ్చావ్ కానీ నేను వినట్లేదు sorry for that.
    ఇక్కడ తప్పొప్పుల పట్టిక నాకనవసరం
    వివాదం లేకుండా ఉండటమే నాక్కావలసింది
    బ్లాగ్ లో విజ్ఞానం, భావుకత, సృజనత్మికత, ఆనందం తప్ప వేరే వాటికి తావులేదు అంతే!!

    రిప్లయితొలగించండి
  30. $"వీళ్ళు రాకముందు..బ్లాగుల్లో వివాదాలూ చర్చలుండేవిగానీ ఇలాంటి విద్వేషాలూ లేవు"

    చ అవునా!! బ్లాగులలో ద్వేషాన్ని మొదలెట్టిన పెద్దాయన ఏకంగా వేదాలు భలే భలే వల్లిస్తున్నారే!! ఇంతకీ తోటి బ్లాగర్ల మీద కేసు(లు) పెడతానని బెదిరించిన వాళ్లు కూడా మాట్లాడే వాళ్ళే!! చ్చ వెధవ బతుకు, వెధవ బతుకు!!

    good ఆత్రేయ గారు ఇలానే మీరు మర్యాద రామన్న లు అయిపోండి తగ్గొద్దు, ఎన్ని దెయ్యాలు వేదాలు వల్లిస్తూ వస్తాయో చూడాలని ఉంది!!!

    రిప్లయితొలగించండి
  31. @అజ్ఞాత: బ్లాగుల్లో నా అభిప్రాయాలతో చర్చలలో విబేధించలేనివారు వాళ్ళ అభిప్రాయాలే పరమసత్యాలు అనుకునేవాళ్ళు నన్ను ద్వేషిస్తే అది నా తప్పు కాదు. నేను వాళ్ల ద్వేషానికి ప్రతిగా ద్వేషించలేదు ధూషించలేదు.

    ఇక కేసు పెడతానని చెప్పడం గురించి. YES, నన్ను కులం పేరుతో తూలనాడి ధూషించిన ఒక బ్లాగరి అసలు రంగును బయటపెట్టాను. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పాను. అది బెదిరింపు కాదు. ఇప్పటికీ I stand by my word.

    నాబ్రతుకేమిటో నాకు తెలుసు..ఊరూపేరూలేని నీ గురించి నువ్వు చూసుకోవడం మంచిది.

    రిప్లయితొలగించండి
  32. మర్యాద అనేది భౌతికం కాదు
    మానసికం మిత్రమా
    నేను రామన్న వేషం వేయటం నైతికం
    నాకెందుకులే అనుకునే కుహాన పెద్దమనిషి ని కాదు
    నేను రెండు తరాల మధ్య వారధి ని
    రెండు వర్గాల మధ్య సారధిని !!
    ఫీల్ ఫ్రీ టు ఫ్రీ యువర్ ఫీలింగ్స్ !!!

    రిప్లయితొలగించండి
  33. ఆత్రేయ గారు, క్షమించండి. అవి అజ్ఞాత ప్రవీనుడిని 13 ఫిబ్రవరి 2011 4:11:00 సా ఉద్దేశించినవి. ఆ యెదవ అవసరాలకొద్దీ ఆదర్శాలను తాకట్టు పెడతాడు. పైగా క్రోకడైల్ టియర్సు.

    ##నన్ను కులం పేరుతో తూలనాడి ధూషించిన ఒక బ్లాగరి అసలు రంగును బయటపెట్టాను.
    నీ గురివింద నల్లరంగు దాచుకోలేకపోయావు.

    రిప్లయితొలగించండి
  34. ఆత్రేయగారు సద్దుమనగడం అనేది పట్టువిడుపులు ప్రదర్శించేవారి వద్ద ఉంటుంది. తా పట్టిన కుందేటికి ముడేకాళ్లు అని వాదించేవారికి పొంతనలేని విషయాలకు ముడిపెట్టేవారికి ఏమి చెప్పి శాంతంగా ఉండమని చెప్పగలము. చేయిదాటిపోయింది ఆపండి అని బ్లాగుల్లోనో/ ఈ-మెయిల్స్‌లోనో చెప్పేబదులు నేరుగా ఆ వ్యక్తితో మాట్లాడితే బావుంటుంది.

    రిప్లయితొలగించండి
  35. ఒక్కసారి నిండైన మనసుతో ఆలోచించండి.
    ప్రమాదవనం, ప్రమోదవనం, నీహారిక, రౌడీరాజ్యం బ్లాగులని సంకలునులనుండీ కొన్నాళ్ళు ఒక నెలరోజులపాటు బహిష్కరిస్తే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  36. డియర్ అజ్ఞాతలు ఒక మంచి కారణం కోసం మీరింత విశాల హృదయం తో అలోచిస్తున్నరుకదా ఎందుకు మీరు మీ నిజమైన పేరు తో కామెంట్ చెయ్యరు ?
    ప్లీజ్ కం అవుట్ !!

    రిప్లయితొలగించండి
  37. ఆత్రేయ గార్కి
    మీ పరిస్థితి చూస్తుంటే నాకు ఈ పాట గుర్తుకి వస్తోంది "ఎరక్క పోయి వచ్చాను..ఇరుక్కు పోయాను."
    అయ్యా! ఈ గోల పడలేక కొన్నాళ్ళు బ్లాగులకి దూరంగా వున్నాను. మనం భరించలేని కంపు వాసన వస్తోందనుకోండీ ఆ కుళ్ళు నుండి ముక్కు మూసుకుని వచ్చేయడమే... అంత కన్నా మనం ఏమీ చేయలేని స్థితి..

    రిప్లయితొలగించండి
  38. ఏది తప్పో ఏది ఒప్పో మనకి తెలీదు ..ani anna kaavya gaaru,

    pai ajnaata vyaakhya(baadha) choodandi

    meeku yeppati ki aa baadha radu anna nammakam undi kaabatti, inta chakka gaa neeti chebutunnaru ..yedi tappu ani meeku telise sariki meeru kooda aa tappu lo bhaagamai potaru kaavuna..appudu kooda మీరు వెళ్లి హాయిగా పడుకోండి ..

    aatreya gaaru mannimchaali, ippati varaku meeru kooda veeri chesedi raiTu anukuntunnaru anukunnanu..

    mee prayatnam meeru chesaru..jayapajayaalu daivadheenaalu

    ee vyakhya ajnaata gane vrayaali..manni0mchaali..

    రిప్లయితొలగించండి
  39. వోలేటి గారు
    నో నేను ఆపాట పాడను,
    నా పాట " ఈ బ్లాగ్లోకం , ఈ మనుషులు నావే నని భావించి, ప్రతి మనిషి తొడలు గొట్టి, బేధభావం పగుల గొట్టి ... మర్యాద రామన్నలై భాషించాలి, బొజ్జ (ఉంటే) నిమురుకుంటూ చాలాఇంచాలీ....

    రిప్లయితొలగించండి
  40. ప్రమాదవనం, ..... రౌడీరాజ్యం బ్లాగులని సంకలునులనుండీ కొన్నాళ్ళు ఒక నెలరోజులపాటు బహిష్కరిస్తే ఎలా ఉంటుంది?
    _________________________________________________________________________


    Sure why not go ahead. Let the other aggregators BAN those blogs permanently - people will visit Maalika to read them. That way all the hits those two blogs get will be attributed to Maalika. Go ahead, please!

    రిప్లయితొలగించండి
  41. kavyaa sorry to publish your comment
    it was by mistake

    very sorry thallee

    రిప్లయితొలగించండి
  42. I second the ajnaata who has commented before voleti and after aatreya. Before these people came into blogs, there were differences. But there was decency in expressing the differences. Other people's opinions were tolerated to a large extent. Intolerance was also expressed in a straightforward manner.


    But these people started to scare people by removing all sorts of decency in differing with a person. Their mob always tries torture people. This is the first strategy.
    If that is not the case, they have kaagada anyways to write things about people in the utmost indecent and hateful way.
    Else they would just try to corner the people who try to comment on the opponent blogs.

    These people are the worst creatures on earth.
    Even bhaskar ramireddy is a victim. I donno howfar he is willing to admit it. But he suffered becoz of these people. kagada wrote in the utmost indecent manner possible. Until then, he was hanging out with them.
    These very people who got hurt now becoz their mother's name has been dragged into this indecent fight, were once verymuch supportive of kagada who just ruthlessly attacked on the women.

    A mother is a mother...So I cannot support Niharika on this....She could have atleast stopped when these people said that Bharadwaj's mother's name is Sita. I oppose her exclusively becoz of that and not becoz i believe these people are hurt.

    రిప్లయితొలగించండి
  43. అయ్యో పర్వాలేదు ఆత్రేయ గారు .. అందులో పెద్ద విషయం ఏమి లేదు .. :) మీరు నాకు సారీ చెప్పక్కర్లేదు ..

    రిప్లయితొలగించండి
  44. మన విదేశాంగమంత్రి యు.ఎన్.లో పోర్చుగీసు వారి వుపన్యాసం సదికి, సదికి సగం తరువాత ఓ పోర్చుగీసు పేరు పల్కడానికి నోరు తిరక్క నాలిక్కరుచుక్కున్నాడట. అప్పుడు సెగ్రట్రీ తారుమారయ్యింది, ఇది మన ఉపన్యాసం, మళ్ళీ మొదటినుంచి సదివి చావు అన్నాడట! :)
    అందుకే అజ్ఞాతలు చరిత్రలమీద సుదీర్ఘ వుపన్యాసాలు ఇవ్వడం, నేను హర్షించను. భరారేకి ఏమి జరిగిందో ఆయన చెప్పగలడు, కావాలంటే ఓ శ్రీకృష్ణ కమిటీ వేస్తాము, ఎలాగూ ఆయన ఖాళీగానే వున్నారు.

    రిప్లయితొలగించండి
  45. శంకర్,
    విషయం ఎటూ తేల్చకుండా నివేదికలు ఇవ్వడానికి ఆయనే (జస్టిస్ శ్రీకృష్ణ) కరెక్టు లెండి!

    రిప్లయితొలగించండి