22, జులై 2011, శుక్రవారం

ఎవరి నష్టం, ఎవరికి లాభం ?



ఏపి భవన్ అంటే ? ఆంధ్ర ప్రదేశ్ భవన్ అని కదా...
మరి తెలంగాణా వాదులకు శ్రీ యాదిరెడ్డి భౌతిక కాయాన్ని అక్కడికి తీస్కేళ్ళాలనే ఆలోచన ఎందుకు కలిగిందో ?
ఇంకా విభజన జరగలేదు కాబట్టి అది ఉమ్మడి భవనమే అనుకుంటే..
మరి హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళ ఆస్తుల ధ్వంసం, విగ్రహాల కూలేయ్యడం లాంటి పనులెందుకు చేసినట్టో...

ఎవడో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలిఅవుతున్నారు

అది యాది రెడ్డి కావచ్చు,
ఇంకా తొందర పాటు చర్యలో ఆత్మాహుతి చేస్కున్న విద్యార్ధులే కావచ్చు,
వాళ్ళ ఆత్మ శాంతికి ప్రార్ధిద్దాం....

సామరస్య ధోరణి లో మాట్లాడి దెబ్బలు తిన్న జయప్రకాష్ నారాయణే కావచ్చు,
విధి నిర్వహణలో తన్నులు తిన్న చందర్రావు కావచ్చు
వాళ్ళ మనో శాంతికి ప్రార్ధిద్దాం...

ఏరోజు బందో, ఏరోజు భోజనమో తెలియని కడు పేదవారు కావచ్చు
వారి క్షుద్శాంతి కై ప్రార్ధిద్దాం...


ద్వంసమైన ఆస్తులు కావచ్చు
హింస పడిన మనసులు కావచ్చు
నష్టాన్ని తిరిగి ఎవరూ పూడ్చలేరు
ఎందుకంటే

AN OLD SAYING:
GOD ONLY CAN TAKE LIFE
'COZ HE ONLY CAN GIVE IT.

MODERN PHYSICS :
MATTER CAN NOT BE CREATED,
BUT CAN BE DESTROYED EASILY !!

4 కామెంట్‌లు:

  1. సామాన్యుడి జీవితం ఎవరికి పడుతుంది ఓ దేముడా అమాయక జనాన్ని ఈ రాజకీయ రాక్షసుల నుంచి రక్షించు

    రిప్లయితొలగించండి
  2. this is a big fight for political power ...adhikaaram lO unte enta tineyavaccho...jagananna choopinchaadugaa..aa adhikaaram kosame,,ee uddaalu...ee supportors antaa verri puvvule...

    రిప్లయితొలగించండి
  3. దొరక్క, దొరక్క దొరికింది ఓ శవం.. అదీ దేశ రాజధాని నడిబొడ్డులో..
    ఎంత ప్రణాళిక వేశాం.. ఎంత ప్రయాసపడ్డాం..
    మరి మా శవ రాజకీయాలకి అడ్డం వస్తే .. అడ్డంగా నరక్క... ఏం జేయాలె..

    రిప్లయితొలగించండి
  4. ప్రజాస్వామ్యం ని కాపాడాల్సిన ఈ రాజకీయనాయకులు ప్రజల సహనం తో ఆడుకుంటున్నారు .........మళ్ళీ ఎన్నికలు వస్తే.. ఎక్కడ ఓట్లు తగ్గిపోతాయో అన్న భయం తో ఈ ఓవర్ ఆక్షన్ లు చేస్తున్నారు ఈ రాజకీయమనే రంగుని పూసుకున్న ఘరానా నటులు !

    రిప్లయితొలగించండి