9, ఆగస్టు 2011, మంగళవారం

ఎస్ !! నేను లెజెండ్ నే....


రోజులాగానే నిన్న మా అమ్మాయి కి ఫోన్ చేశా,
రోజూ మాట్లాడుకునే సామాన్య విషయాలు
ఏమి చేస్తున్నావ్, అన్నం తిన్నావా ?
కాలేజీ లో ఈరోజు సంగతులేంటి అన్నీ అడిగేసి...
ఉన్నట్టుండి ఫీజు రసీదు పంపలేదేంటి అని అడిగా.
నడుస్తున్న విద్యా సంవత్సరం కి ట్యూషన్ ఫీజు,
హాస్టల్ ఫీజు ఎప్పుడో మే నెల లో డీడీలు తీసి కాలేజీ కి పోస్ట్ లో పంపాను.
మా అమ్మాయి జూలై లో కాలేజీ కి వెళ్ళింది.
వెళ్లేముందు రసీదులు తీస్కోని పోస్ట్ చెయ్యి అవి కావాలి అని అడిగా. అలాగే అంది.
నెల రోజులుగా అడపా దడపా అడుగు తూనే ఉన్నా .
కానీ మా అమ్మాయి పంపలా. ఏదో కారణాలు చెప్తుంది.
టాక్స్ ఫైల్ లో ఆ రసీదులు కూడా కొంత ప్రాముఖ్యం నంతరించు కుంటాయి.
నిజానికి పరిధి దాటి పోవటం వల్ల, ఆ ఫీజు మొత్తం వల్ల నా టాక్స్ రాయితీ ఏమీ తేడారాదు.
కానీ చెప్పినట్లు పంపక పోవటం కొంత అసహనాన్ని కలగ చేసింది.

దానికి తోడు నిన్న వేరే వేరే కారణాల వల్ల మనసు పరి పరి విధాల చిరాకుగా ఉంది.

ఆ చిరాకు లోంచి పుట్టిన చిరుకోపం మా అమ్మాయి మీద కొంచం చూపించా.
నీకేదైనా అవసరం అంటే నేను వెంటనే చెయ్యట్లేదా?
నీకేమైనా అవసరం అంటే,
పోస్ట్ చేస్తే , కొరియర్ చేస్తే లేట్ అవుతుందేమో అనుకుంటే
ఎవరైనా మనిషికిచ్చి పంపాలనే ఆత్రుత లో ఉంటా కదా
అదే నా విషయం లో నీకు ఎందుకింత నిర్లక్ష్యం ?
అంటూ ఇంగ్లిష్ లో మాట్లాడుతుంటే మా అమ్మాయికి అర్ధమైపోయింది
నాన్న బాగా కోపం లో ఉన్నాడని.
రేపు పంపుతా, నాకు కుదరలేదు బిజీ గా ఉంది అంటూ కారణాలు చెప్పి
నన్ను శాంత పరచటానికి ప్రయత్నించింది.

కానీ చెప్పాగా శని గాడు పడితే,
చంగల్పట్టు శాంతారాంలు కూడా బీపీరావు లవుతారని..

నా మెదడు మొబైల్ లో శనిగాడి ఎస్సేమెస్సులు సేవ్ అయిపోయి,
మా అమ్మాయి మాటలకి నేను కన్విన్సు అవలేదు.
అదయ్యాక మామూలుగా మాట్లాడలేక పోయి
మళ్ళీ ఫోన్ చేస్తాలే అని చెప్పి పెట్టేసా.

నిజానికి నా టాక్స్ ప్లానింగ్ రాయితీ లిమిట్ దాటి పోయింది.
ఆ రసీదు వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు.

కానీ చెప్పాగా వేరే కారణాల వల్ల బాలేని నా బాడ్ మూడ్ ని మా అమ్మాయి మీద చూపించా.
ఫోన్ పెట్టేసాక ,
ఎప్పటి లాగానే గుమ్మడి డాడీ ఆలోచించటం మొదలెట్టాడు.
మెస్ కి డిన్నర్ కి వెళ్లిందో లేదో,
నేను సీరియస్ గా మాట్లాడానని దిగులు తో తిన కుండా పడుకుంటుందేమో...
ఇంటర్నల్ ఎగ్జాంకి, చదువుతోందో లేదో.
ఒక్కతే, దూరంగా ఉంది కదా కోపం చూపకుండా ఉండాల్సింది.
అసలు అలా మాట్లాడ కుండా ఉండాల్సింది.
మెల్లగా చెప్పాల్సింది.

ఎవడో వెధవ మీద కోపం మా బంగారం మీద చూపటం తప్పుగా అనిపించింది.
గిల్టీ అంతకన్నా మా అమ్మాయి చిన్న బుచ్చుకుందేమో అన్న దిగులుతో
కాసేపు అటూ ఇటూ గడిపి ....

వరసగా మెసేజీలు పంపా.
జరిగిన విషయం లో తప్పునాదేనని, సారీ చెపుతూ
అన్నం తిన్నావా అంటూ,
నీకు వీలు కుదిరినప్పుడు రసీదులు పంపు అంటూ,
నాలుగు మెసేజీలు పంపాను.
పది దాటాక మా అమ్మాయి
"yaah naanna i had fud .
i cud understand ur anger
i am ok
dont worry "
అప్పటి దాకా నా మనసు చాల మధన పడింది.
ఆ మెసేజీ తో కుదుట పడి నేను నిద్రకి ఉపక్రమించాను.

నిజానికి నా ఉద్యోగ పని వత్తిడి ఎంత ఉన్నా నన్ను అసలేమీ చేయలేదు.

రోజుకి పది గంటలు పైన ఎంతో ఆనందం గా పని చేసి
చుట్టూ ఉన్ననాతో పని చేసే వాళ్ళనీ ఉత్సాహ పరుస్తా.
కొన్ని అదనపు భాధ్యతలు ఆనందం గా స్వీకరిస్తా,
వాటి వల్ల మరింత రీచార్జ్ అవుతనే గానీ ఉద్రేక పడను.

కానీ కొన్ని దుష్ట శక్తులు నా ఆనందాన్ని భంగ పరచాలని,

నా సెల్ఫ్ ఎస్టీం కించ పరచాలని
చాలా ప్రయత్నిస్తుంటాయి.
ఆ దుష్ట శక్తులకు వేరే పనేమీ ఉండదు
ఏదోటి అని నన్ను చిన్నబుచ్చాలని నిరంతరం ప్రయత్నిస్తుంటాయి.
ఆ ప్రయత్నాలకి నేను కొన్ని సార్లు పడిపోయి దిగులు పడుతుంటాను.

కానీ ఇప్పుడు దృడ మైన నిర్ణయం తీస్కున్నా

ఎవడో పనికిమాలిన వాడి మాటలు రోజూ చేసుకునే గడ్డం తో సమానం
ట్రిపుల్ ప్లస్ తో గీసి పారేసి
కూల్ జెల్ రాసి కులాసాగా ఉండటమే.


ఇలాంటి పరిస్థితుల్లో మా అమ్మాయి ఒకసారి అంది

అలా మాటలనే వారు ఎవరిని పడితే వారిని అనరుకదా నాన్నా
సేలెబ్రిటీలు, లెజండులు కి మాత్రమే అవి ఉంటాయి.
కాబట్టి నువ్వు రేంజ్ చీర్ అప్ !! అంది.
ఎస్ నా మటుకు నేను లెజెండ్ నే!!


4 కామెంట్‌లు:

  1. ఇంకా మీ పొజీషన్ కొంత బెటర్.. ఇలాంటి సమయాల్లో వెంటనే వాళ్ళ మమ్మీ కి ఫోన్ వెళిపోతుంది.. ఆ వెంటనే మొదలవుతుంది కోర్టు సీన్ (ఫోన్ లోనే).. ఓన్లీ వన్ సైడ్ హియరింగ్.. అండ్ జడ్జిమెంట్ క్లోజ్.. ఓ గంట పోయాక మళ్ళీ ఫోన్ చేసి..జరిగింది..ఇది అని అప్పీల్ చేస్తేనే..తుది తీర్పు.. అసలీ సెలె ఫోన్ కనిపెట్టిందెవడురా బాబూ...

    రిప్లయితొలగించండి
  2. mee ammai cheppinatlu meeru legend ne andi. so dont worry.

    రిప్లయితొలగించండి
  3. :) మీ బాధ నాకు తెలుసు. ఎవరి మీదో చిరాకు ఎప్పుడైనా ఉదయం పిల్లల మీద లేశమాత్రం గా నైనా చూపిస్తే... సాయంత్రం వాళ్లు తిరిగి వచ్చే వరకూ మనసు మనసు లో ఉండదు.

    రిప్లయితొలగించండి