30, జులై 2013, మంగళవారం

మనమే !!ఈ  కాంగ్రెస్ ని గెలిపించింది మనమే
తెలుగు దేశం మనదన్నదీ  మనమే,
కాషాయం కావాలన్నది మనమే,
జై జగన్ అన్నదీ మనమే,
మతానికి ఓటేసింది మనమే,
ఎర్ర జండెత్తింది కూడా మనమే
మనమంటే మనం
మనమంటే జనం
ఛీ ఛీ అన్నా,  ఛా ఛా  అన్నా  మనకే
ఖాండ్రించి ఉమ్మినా మనమీదే...
అంతేత్తునున్న ఆకాశం మనమే.. 

దిగజారి కింద పడింది మనమే ..
మనమంటే జనం
అంటే ఓటేసిన జనం 

మనమంటే
పోటీ పడ్డ అజ్ఞానం !!


4 కామెంట్‌లు:

 1. మన ప్రజల అజ్ఞానమే‌ మన రాజకీయుల దివ్యాస్త్రం.

  రిప్లయితొలగించండి
 2. చిత్రం చూసి నవ్వేసాను. మేటర్ చాలా ఆలోచింపజేసింది .
  మంగళవారం మంచిదనా, చానాళ్ళకి ఠపా తో వచ్చారు ? (నేను అనలేదందోయ్ చానల్స్ అంటున్నాయి మరి)

  రిప్లయితొలగించండి
 3. Chaala baagundhi and unfortunately mana vallaki chethulu kaalinaka aakulu pattukovadam alavatu. Naa kompa baagane undhi pakka vaadi kompa ela tagaladithe naaku enti ley ani anukuni kana padda prathi yedhava naakoduku ki musti visiri natlu vote guddi mari gelipincharu. Oka maayadari Italian debba ki kudelu ayipoyaru asalu baanisathvam annadhi mana DNA lone undemo endukante aa naadu Britishodu ichhi vellina vaatine nammukuni brathuku thunnam mari ee naadu oka italian amma daya meedha brathuku thunnam. Thuuu mee brathukulu cheda ika nina melkondi ra

  రిప్లయితొలగించండి