8, సెప్టెంబర్ 2010, బుధవారం

సోడా మన సోడా

కనుమరుగవుతున్న సోడా బళ్ళు...

కిక్కీక్ కిక్కీక్ .. ఇలాంటి సౌండ్ మీరూ ఎక్కడన్నా విని ఉందోచు .... ఆ సౌండ్ పుట్టించే వివిధ వస్తువులు యంత్రాలు మన చుట్టూ ఎన్నో ఉండి ఉంటై .. కానీ నేను చెప్పే ఆ సౌండ్ కి సంభంధించే వస్తువు
ఒక సీసా అవునండి ఒక సీసా సోడా సీసా ... ఆకు పచ్హ రంగులో ఉండి అందం గా ఒంపు సొంపులుంది.. గరళ కంటుడిలా గొంతులో గోలీ పెట్టుకొని కడుపులో ఎంతో గ్యాసున్న ద్రవాన్ని నింపుకొని ఎంతో తక్కువ ధరకి మంచి
స్వాంతన నిచ్చే గోలీ సోడా. పెద్ద పెద్ద నగరాల్లో దాదాపు కనుమరుగవుతూ.. పట్టణాల్లో గ్రామాల్లో తమ ఉనికి ని చాటు కోవటానికి తంటాలు పడుతూ.. ఉన్న మన ఆంధ్రా గోలి సోడా
రింగుల్లోకి వెళితే... నా చిన్నప్పుడు నలభై ఏళ్ళ క్రితం నాకు గుర్తున్నంత లో అర్దన అంటే మూడు పైసలకి ఒకటి ఇచ్చే ఆ సోడా క్రమేపీ ధరలు బాగా మండి పోయే స్థాయి కి వచ్చి 5 పైసలు అయింది నా 8 ఏట అది 5 పైసలు గా నాకు గుర్తుంది అంటే ఇప్పటి మన రూపాయికి ఇరవై సోడాలు. అప్పట్లో మా బందర్లో మా రోడ్ లో అలవాటు గా ఒక సోడా సాయిబ్బు వచ్చే వాడు. సోడాసాయిబ్బు అని ఎందుకన్నానంటే అయన పేరు ఎవరికీ తెలీదు మతానికి ముసల్మాన్ అందుకే సోడా సాయిబ్ అని పిలిచే వాళ్ళు అందరూ. సాయంత్రం 5 అయ్యేసరికి ఆ .. సోడే ఆ .. సోడే అంటూ అరుస్తూ .. మా సందులోకి వచేవాడు .. ఆ సోడా కి అలవాటు పడ్డ వాళ్ళంతా ఆ సరికి బయటకి వచ్చి అరుగుల మీద ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ( క్లెమెంట్ కోసం ఎదురు చూసీ మన తెలుగు హీరో ల తమ్ముల్లలా..) అయన నింపాదిగా వచ్చి ఇళ్ళ మధ్యలో తన తోపుడు సోడా బండి ని పార్క్ చేసి అయిదారు సోడా సీసాలు చాల వొడుపుగా గా పట్టుకొని( మనం ఒక సీసకే భయపడేవాళ్ళం ఎందుకంటే అది కింద పడితే పెద్ద అణు విస్పోటనం అవుతుందని మాకంతా ఒక నమ్మకం ) వాటిల్తో పటు ఒక రబ్బరు ట్యూబ్ ముక్క ఒక చెక్క ముక్క తో ఇళ్ళల్లోకి వచ్చే వాడు ఒకోల్లకీ సోడా కొట్టిస్తూ.. పేరు పేరునా అడుగుతూ ఎంతో స్నేహంగా రోజూ వచ్చే చుట్టం లా కలియ తిరుగుతూ డబ్బులు వసూల్ చేస్కుంటూ.. అయన హడావిడి ఎంతో సందడిగా ఉండేది. మధ్యాన్నం భోజనం అరగని తాతయ్యల దగ్గరనుంచి ఎప్పుడు మదిలో ఉందే బామ్మలు , పైత్యం తో బాధ పడే మధ్యవయస్కుల నుంచి వేవిల్లతో బాధ పడే పడుచులదాకా , అల్లం రసం నిమ్మకాయ చెక్క కలిపి తాగే యూత్ దగ్గర నుంచి సోడా సౌండ్ వినటానికి ఉత్సాహ పడే పిల్లల దాక అందరికీ ఎంతో ఇష్టమైన సాయంత్రపు డ్రింకు. శత్రుఘ్న సింహ కి తెలియక పొవచు కానీ తెలిస్తే మీరూ నేనూ ఆంధ్రా సోడా ఈ సాయంత్రం... అని ప్రకటన ఊరికే చేసిపెట్టేవాడు.
సరే మన సోడా గోల లోకి వద్దాం.. ఎంత వాళ్ళ నైన లోపలికి రానివ్వని మడి బామ్మలు కూడా ఎంట్రీ పర్మిట్ ఇచేవాళ్ళు మన సాయిబ్ గారికి.. కాకపోతే సీస అందరూ కరచుకొని తాగుతారు కాబట్టి ఆ సోడా ని మడి గ్లాస్ లోకి బదలాయించి ఎతుకొని మరీ తాగేవాళ్లు. తాతాయ్యలకి ఇదేమీ లేదు కాబట్టి డైరెక్టర్ గానే తాగేవాళ్లు. మిగతా జనం వాళ్ళ వాళ్ళ అభిరుచి ని బట్టి గ్లాసుల్లో ఇంకా ఏమైనా కలుపుకొని తాగేవాళ్లు. నాకు గ్లాస్లో పోస్కోని చాలా సేపు తాగాలని ఉండేది కాని మా అమ్మ అలా చేస్తే గ్యాస్ పోతుంది సోడా తాగి ఉపయోగం లేదు సీసా తో ఒకే గుక్క లో తాగాలి అనేది కానీ ఆ సోడా గ్యాస్ మనని తాగ నిచేది కాదు మనం చిన్న పిల్లలం కదా ఇపుడంటే ఎ సీసా అయినా దింపకుండా తాగే సామర్ధ్యం వచ్చింది కాని అప్పుదేంతా.. చిన్న ప్రాణం.
ఇంకా వేవిల్లవాళ్ళకి ప్రత్యేకంగా ఇంట్లో కి రూం డెలివరీ ఇచ్చేవాడు ఆరోగ్యం ఎలా ఉండి అని కుసలమడిగి మరీ.... వాళ్ళ వాళ్ళ కనే తేదీలు ఇంట్లో వాళ్ళ కన్నా ఆయనకే బాగా గుర్తుండేవి... వచ్చే నెల పుట్టింకి వేలిపోతవా కల్యనమ్మా..
ఆ సోమవారం తో తోమ్మిదిలోకి వచావా దేవకీ తల్లి అంటూ ఉండేవాడు. రోజూ క్రమం తప్పకుండా సోడా తాగితే డాక్టర్ దగ్గరకి వేల్లకర్లేదని ఒక నమ్మకం కూడా లేవ దీసాడు. ఆయనకి ఈ రోజు అనారోగ్యం రాదనీ నేను నమ్మే వాడిని ఎందుకంటే హీన పక్షం రోజు కి నాలుగు సోదలైనా తాగక పోతాడా ఫ్రీ కదా అని నా ఉద్దేశ్యం.
ఇంకా ఇంట్లో పసి పిల్లలుంటే సోడా కొట్టి దాంతో వాళ్లకి ఒళ్లంతా కడిగే వాడు అలా చేస్తే ఎండా వడ కొత్తదుట, సోడా కొట్టి సీసా మూతి కి వేలు అడ్డం పెట్టి బాగా గిలకరించి కొంచం వేలు అడ్డు తీస్తే బుస్స్స్స్ మని మామ బాడీ స్ప్రే యార్ లాగా సోడా బయటకి చిమ్మేది దాంతో పసిపిల్లకి బాడీ వాష్ ఆ సోడా చుర్రుక్కి ఉలిక్కిపడి ఏడ్చే పిల్లలు కొండరతే గిలిగింతలు కలిగి కిలకిల లాడే గడుసు పిండాలు కొందరు.. ఇలా అన్ని వర్గాల వాళ్ళ సాయంత్రాలని ఆహ్లాదపరిచే సోడా సాయిబ్ అందరికీ ఎంతో ఆప్తుడు. అయన ఒక రోజు రాక పోయినా ఎంతో వెలితి, లేట్ గా వస్తే ఆందోళన చెందేవాళ్ళం ...
అలాంటి సోడా సాయిబ్ నా ఏదో క్లాసు లో రావటం మానేసాడు కొన్ని రోజులకి తెలిసింది అయన అల్లా దగ్గరకి వెళ్ళాడని అక్కడ అమృతం దొరక్క భాధ పడుతుంటే సాయం గా సోడా లివ్వతానికి వెళ్ళాడని ఇంకా మనకు అయన సోడాలు దొరకవని ... అదేంటి ఆయనకి అనారోగ్యం ఎలా వచ్చింది ? అయన సోడా అయన తాగేవాడు కాదా అని నాకు డౌట్ వచ్చి మా బామ్మ ని అడిగితే ఆమె" ఏమి తాగినా తాగక పోయినా పిలుపోస్తే వెళ్ళాలి అది రూలు అని వేదాంతం చెప్పింది.. "


అల్లాంటి మన గోలి సోడా లు ఆంధ్ర సోదాలు కనుమరుగవుతున్నై.. మన లోకల్ సోడళ్ళు పోయి విదేశీ సోదాలు వచాయి మన నాటు సోదాల్లో మంచి నీళ్ళు వాడరు, నలకలు ఉంటై ఇలాంటి వాదనలు కొంత నిజమే గానీ ఏమైనా నా బాల్యాన్ని మా ఊరుని మా సందుని మా అరుగులని గుర్తు తెచే ఆగోలీ సోడా కనపడితే తాగకుండా ఉండలేను
జై ఆంధ్ర సోడా.. జై జై గోలీ సోడా ( ఆంధ్ర అని వాడినందుకు మీరు క్షమిచాలి ఇది నలభై ఏళ్ళక్రితం అందరికి వర్తించే సోడా గురించే మాత్రమే ఇందులో ప్రాంతీయ తత్వం ఏమీ లేదు ఒక వేల ఉంది అనుకుంటే జై తెలంగాణా సోడా జై జై గోలీ సోడా అని చదువుకో ప్రార్ధన)

9 కామెంట్‌లు:

  1. చాలా బాగుందండీ.. బోలెడన్ని ఙ్ఞాపకాలను కదిలించారు.. చిన్నపుడు ఇంచుమించు ప్రతి రోజు సాయంత్రం తప్పనిసరిగా తాగేవాళ్ళం.

    ఈ మధ్య మా ఊరి బస్టాండ్ దగ్గర సోడాలు చూసి చాన్నాళ్ళవుతుంది తాగుదామని, "నిమ్మకాయ షోడా ఉందా బాబు" అని అడిగితే కొట్టువాడు సీరియస్ గా పైకి కిందకి చూసి "లేద్సార్ ’లెమన్’ షోడానే ఉంది" అన్నాడు :) నాకు నవ్వాగలేదు.

    రిప్లయితొలగించండి
  2. @వేణూ శ్రీకాంత్: గుంటూరులో 'నిమ్మకాయ సోడా' అంటే గ్లాసులో నిమ్మరసం పిండి సోడా కొట్టి కలిపి, ఉప్పు/పంచదార కలిపివ్వడం. 'లెమన్ సోడా' అంటే ఎస్సెన్స్ కలిపిన నిమ్మ రుచిచ్చే సోడా - బహుశా ఆ షాపువాడు ఆ ఉద్దేశంలో అన్నాడేమో!

    రిప్లయితొలగించండి
  3. ఆత్రేయగారు: ఎందుకండీ అందరూ - మీరేమో సోడాలు, ఇంకొకరేమో గుంటూరు మిర్చిబజ్జీలు - ఇలా పరదేశం పనికోసం వచ్చిన నాలాంటివారికి గుర్తు చేస్తారు.

    మంచి గుంటూరు ఎండల్లో క్రికెట్ ఆడుతూ మధ్యమధ్యలో సోడాలు తాగుతుంటూ, ఐసుపుల్లలు చీకుతూ... హుమ్.

    రిప్లయితొలగించండి
  4. @ శ్రీకా౦త్ గారూ ఒపిగ్గా చదివి న౦దుకు ధన్యవాదములు..
    @ఝ్భ్ ( JB )అనీ కొడితే అలా ఫడి౦ది sorry జలుబు కాదు
    మిర్చి బజ్జీలు సొడాలు అన్నీ ఏదురు చూస్థున్నాయ్ త్వరగా ర౦డి మరి....

    రిప్లయితొలగించండి
  5. aatreya gaaru,

    naakoka soadaa ippinchandi. chinnappudu okkasaari kooda taagaleadu. ippudu dorakatam ledu.

    baagundi mee post. all the best.

    రిప్లయితొలగించండి
  6. aatreya garu, ippudea bandaru nunde vastunna, mee post lo chadivanu kada andukani gurtupettukoni maree konearu center daggara goli soda taagaanu, life lo first soda anukunta. bhale baagundi. bandaru laddu antaga nachchaledu. halwa konalani marchipoya. kani kalankari clothes teesukunna. mee bandaru maa oorila anipinchindi paatakalam illu. good goli soda

    రిప్లయితొలగించండి
  7. nijam cheppana .......edo hyd lo perigenu anna goppe kaani chala miss ayyanu naa chinnathanam lo, andulo ee goli soda okati anukunta. but eppudo okasari maa vaari oorulo tagincheru aa lemon soda....... chala bagundi. really grt taste. anthakante bagundi meeru aa sodani gurthu chesina theeru.......thnkss.

    రిప్లయితొలగించండి