12, సెప్టెంబర్ 2010, ఆదివారం

ఈశ్వర్ అల్లా ఫ్రెండ్స్ ట..

గణేశుడు అల్లా షేక్ హ్యాండ్ సీన్ చూడండి...

కిందటి ఏడు మా ఆవిడ ఫ్రెండు రంజని ఆంటీ ఫోన్ చేసి ( అంటీ ఏంటని అనుకుంటున్నారా మా అమ్మాయి పిలుచేవరసలే నేనూ పిలుస్తా) మా ఆవిడని ఒక కోరిక కోరింది. నాకు తెల్సిన అబ్బాయి ఉన్నాడు భాషా అని ఇంటర్ మీడియాట్చదువు తున్నాడు ఆర్ధిక పరిస్థితి బాలేదు ట్యూషన్స్ జేరలేదు, కార్పొరేట్ కాలేజీ సందు లోంచి కూడా వెళ్ళలేడు, కెమిస్ట్రీచెప్పమని మా ఆవిడని కోరింది. మా ఆవిడ కెమిస్ట్రీ లెక్చరర్ గా చేసి రిజైన్ చేసి ఇంట్లో ఖాళీ గా ఉండి కాబట్టి వెంటనేఒప్పుకుంది.

భాషా మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు, బక్క గా, అమాయకంగా, వయసు పిల్లల కుండే సహజ మొహమాటంతో ఉన్నాడు. వారానికి రెండు మూడు సార్లు వచ్చేవాడు కెమిస్ట్రీ దవుట్ట్స్ చెప్పించుకునే వాడు. మంచి పిల్లాడు. తండ్రిరైల్వే లో పని కాని, మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక సాయం ( లిక్కర్ కొనుక్కొని తాగి) చేసే ప్రయత్నం లో ఇంటిని పట్టించుకావట్లేదు. తల్లి లేదు . నాయనమ్మ పాపం ఇళ్ళలో పని చేసి ఇంటి బండి నడుపుతోంది. రోజూ ఇంట్లో తండ్రి గోల, కుటుంబానికి ఆలంబన గా ఉండాల్సిన వాడే ఆందోళనా గా మారేడు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ సాయం చేసిన రోజుఇంట్లో భాషా ని వల్ల నాయనమ్మ ని కూడా కొడతాడట. మనమేమీ చేయలేని పరిస్థితి. చదువు విషయం లో చిన్నసాయం తప్ప. మా అమ్మాయి ఇంటర్మీడియట్ బుక్స్ అవీ ఇచి అతని భుజం తట్టడం తప్ప.

అలాంటి
భాషా ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు ఇంజనీరింగ్ ఎంట్రన్సు లో 95000 రాంక్ వచ్చింది విషయంచెప్పడానికి వచ్హాడు పోయిన వారం. ఇంజనీరింగ్ లో చేరతావా అని అడిగా మా ఊళ్లోనే ఒక ముస్లిం మైనారిటీ కాలేజీ లోరావచు కానీ ఫీజు కట్టలేను సర్ ప్రభుత్వం ఫీజు రీ ఇమ్బర్స్ మెంట్ పధకం ఆపేసింది , కాబట్టి ఇంజనీరింగ్ కష్టం సర్అన్నాడు. నాకూ ఆలోచిస్తే ప్రతి సంవత్సరం ఫీజు గురించి పుస్తాకాల గురించి తంటాలు పడుతూ ఎదురు చూస్తూ ఉండేకన్నా B Sc (ఎలక్ట్రానిక్స్) చదవటం మంచిది కదా ఫీజు తక్కువ అని పించింది. రకం గా చూసిన ఇంజనీరింగ్ కష్టంఅని డిగ్రీ లో జేరి పోమని సలహా ఇచ్చా,
నాకు తెలిసిన ముస్లిం స్నేహితులని విషయం లో సాయం అడిగా పోయిన వారం రంజాం మాసం నడుస్తోంది కాబట్టివాళ్ళ ఆచారం ప్రకారం జాకాత్ ( ప్రతీ ఇస్లాం మతస్తుడు తన మొత్తం ఆస్తి లో 2 .5 % వంతు ప్రతీ సంత్సరం బీదలకిదానం ఇవ్వటం) లోంచి తమకు తోచిన సాయం చేస్తారని. కొంత మంది సాయం చేసారు అది వాళ్ళ పేరు మీద అతనికి అందించా.

ఇంతకీ
వినాయకుడు అల్లా షేక్ హ్యాండ్ సంగతి ఏంటని మీరూ అడుగుతున్నారా... వస్తున్నా.. నేను గత నెల రోజులు గా అయ్యప్ప దీక్ష లో ఉన్నా.. మాల నియమాల ప్రకారము బయట వస్తువులేవీ తినట్లేదు ఇంట్లోవి తప్ప .. నిన్న రంజాన్ / వినాయక చవితి రెండూ ఓకే సారి వచ్చాయి కదా మన భాషా మా ఇంటికి ఒక స్టీల్ డబ్బా లో ఖర్జూరం జీడి పప్పు కిస్మిస్ఎందు కొబ్బరి తీసుకొచ్చాడు ఎందుకు భాషా ఇవన్నీ అంటే తీస్కోండి సర్ పండగ కదా అన్నాడు. నేను తీస్కున్నా.. ఈద్ముబారక్ చెప్పి అతన్ని చేతుల్లోకి తీస్కుని అటు ఇటు గలే మిలాప్ చేస్తే అబ్బాయి బాగా ఎమోషనల్ గాఅనిపించాడు. కాసేపు కూర్చూని మాట్లాడి వెళ్లి పోయాడు. భాషా తెచ్చిన బాక్స్ లోవి నేను అయ్యప్ప దీక్షా నియమాలప్రకారం బయటి పదార్థాలు కాబట్టి తినకూదనుకున్నా.. కానీ భాషా చెమర్చిన కళ్ళు నేను దగ్గరకి తీస్కునప్పుడు కొద్దిగావణికిన బక్క శరీరం గుర్తొచ్చి ఎందుకో తినాలని పించిది ఎంత ప్రేమగా తెచ్చాడో 10 కిలో మీటర్లు సైకిల్ మీద, అని గుర్తొచ్చితినేసా.. అయ్యప్ప ఏమి అనడు పైగా అయ్యప్పకి వావర్ స్వామి అని ఒక ముసల్మాన్ మిత్రుడు కూడాఉండేవారుట.ఏమన్నా ఉంటె వాళ్ళు వాళ్ళు మాట్లాడు కుంటారులే . అసలు అన్ని మతాలకీ కలిపి కొన్ని పండగలుఉంటె ఎంత బాగుండు .. ఉన్నాయ్ గా ఆగస్ట్ 15 జనవరి 26 అక్టోబర్ 2 అంటారా .....నిజమే అన్నీ మతాలకి అతీతం గా జరుపుకునే పండగలే ఉంటె ఎంత బాగుండు కనీసం ముందు తరాలకనా.......

7 కామెంట్‌లు:

  1. "ఈశ్వర్ అల్లా ఫ్రెండ్స్ ట","అయ్యప్పకి వావర్ స్వామి అనే ఒక ముసల్మాన్ మిత్రుడు ఉండేవారుట","గణేశుడు అల్లాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడట" లాంటి మీ పదాలు భలే సంతోషం కలిగిస్తూ ఉన్నాయండీ.

    రిప్లయితొలగించండి
  2. @ రహమతుల్ల షేక్ హ్యాండ్ ఇవ్వండి మరి ....

    రిప్లయితొలగించండి
  3. డియర్ ఆత్రేయ!

    చక్కటి టపా వ్రాశారు. అభినందనలు.

    రహంతుల్లా, మీరూ కూడా అందుకోండి నా షేక్ హ్యాండ్!

    శీర్షిక చూసి, ఇది కూడా యెవడో హిపోక్రైట్ టపా అనుకున్నాను.

    నాబ్లాగులో వ్రాసిన టపాలు చదవండి.

    krishnasree.bolgspot.com/

    జాతీయ పండుగలు చాలు మన దేశానికి అని వొప్పుకుంటారు.

    రిప్లయితొలగించండి
  4. స్నేహ హస్తం అందిస్తానంటే, అంతకన్నానా Masthan!

    మీ హేండ్ నేను కూడా షేక్ చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  5. @మస్తాన్ బాయ్ షాకే హ్యాండ్ ఒద్దు గలే మే ఆవ్ ...ప్రేమ్ సే అవుర్ దిల్ సే..

    రిప్లయితొలగించండి