మారేడుమిల్లి స్వర్గానికి కొంచం కిందుగా....ఉంది
మా ప్రభాకర్ గాడు ఎప్పటినుంచో తెగ చెప్తున్నాడు మారేడుమిల్లి వెళ్లాం , అక్కడ ఫారెస్ట్ గెస్ట్ లో ఉన్నాం చాలా బాగుంది నువ్వూ వెళ్ళరా బాబూ అని సరే కదా అని పోయిన అక్టోబర్ లో మా బ్రాంచ్ లో ఉన్న మా తో__ గ్యాంగ్ కూడా ఒక శనివారం నలుగురం బయలు దేరాం అలా రాజమండ్రి దాటి రంపచోడవరం మీదుగా మారేడుమిల్లి జేరాం. దారి పొడుగునా ప్రభాకర్ ఫోన్ లో మాకు కార్ కి రిమోట్ నావిగేటర్ గా పనిచేసాడు.
రాజమండ్రి లో ఆగి ఒక మంచి స్వీట్ షాప్ లో తినటానికి ( ఎప్పుడూ అని అడగొద్దు) ఎప్పుడైనా తినొచ్చు . చాలా స్వీట్స్ కారాలు కూల్ డ్రింక్ పెట్ బాటిల్స్ పెట్ సోడాలు కొన్నాం. కార్తీక మాసం అయినా ఎండా బానే ఉంది రంప వెళ్లేసరికి వాతావరణం మారింది కొంచం మబ్బుగా చల్ల గా.. మారేడుమిల్లి వెళ్ళే సరికి బాగా చలిగా దట్టమైన ఆ చెట్ల మధ్య నిజం గా నీడ చలి పెట్టింది.
ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కేర్ టకేర్ కి ఫోనేలోనే ముందే చెప్పాం కాబట్టి రూం కి బెంగ లేదు మేము వెళ్లేసరికి అతను ఎక్కడకో బయటకి వెళ్ళాడు ఒక అరగంట తర్వాత వచ్చి మా సంగతి అడిగి కొంచం ఇబ్బందిగా మొహం పెట్టి సారీ సర్ కింద గెస్ట్ హౌస్ ఖాళీ లేదు కొండ మీదే అక్కడికి వెళతారా అన్నాడు , మేము మనసులోనే పెద్దగా వీలేస్కోని అది నువ్వు అంతా ఇబ్బందిగా చెప్పాలా మేము పైకి వెళ్తాం కార్ ఉంది అని సర్దుకున్నాం. భోజనం కి ఏమి కావలి ఇక్కడ స్పెషల్ బొంగు చికెన్ అని చెప్పాడు అదేంటో ఈ పాటికే మీ అందరికీ తెలిసి పోయి ఉంటుంది కాబట్టి నేను వివరించాక్కర్లేదు అయిన చెప్తా చికెన్ ని మసాలా ఉప్పు కారం కలిపి పచ్చి బొంగు లో కూరి దాన్ని ఆకులతో మూసి మంటలో కాలుస్తారు, అక్కడి గిరిజన వంట ఇప్పుడు స్టార్ హోటల్స్ లో కూడా ఫేమస్ అయింది. అన్నం పప్పు వేపుడు సాంబార్ అప్పడం పెరుగు ఇవి స్టాండర్డ్ మేను. సరేఅని అవన్నీ ఆర్డర్ చేసి మేము కొండ మీదకి కి వెళ్లి పోయాం. అక్కడ రెండు a/c రూములు వెనక ముందు మంచి లాన్ మొక్కలు పెద్ద పెద్ద చెట్లతో చుట్టూ దట్టమైన అడవితో భలే భలే ఉంది.
మేము వెళ్లి కొంచం రిలాక్స్ అయి డ్రెస్ మార్చుకొని వెనక పచ్హని పచ్చిక మీద సెటిల్ అయాము . చెప్పగా మాది కొంచం తో _ గ్యాంగ్ అని అంచేత రెండు విదేశీ స్కాచ్ సీసాలు తో రెడీ అయ్యేసరికి ఫుడ్ తెచ్చారు. ఆ లాన్ లో నెల మీద కూర్చొని రెగ్యులర్ గా తాగే ఈశ్వర్, కొండ, 16 ఏళ్ళ క్రితం మందు మానేసిన నేను, అస్సలు అప్పటివరకూ మందే ముట్టని రంగ, ఎప్పుడన్నా పెళ్ళాం ఊరేల్తే రెచ్చిపోయే జానకి రాం నలుగురం కొంచెం కొంచెం అంటూ ఒక సీసా ఖాళీ చేసాం. దాంతో పాటు భోజనం కూడా అప్పటికి సాయంత్రం 6 అయింది.
మెల్లగా లేచి కొంచం స్వింగ్ లో .... కార్ తీసి కొండ కిందకి అడవిలోకి వెళ్ళాం అప్పటికే బాగా చీకటి పడి పోయింది కార్తీక పౌర్ణమి కి రెండు రోజుల ముందు చంద్రుడు కొంచం మొహమాటం గా ఆకాశం లోకి వచ్చాడు.
మొహమాటం తో పూర్తి మొహాన్ని చూపలేక కొంచం తక్కువ గా ఉన్నాడు. అలా కారులో భద్రాచలం రోడ్ మీద కి వెళ్లి ఒక పది కిలో మీటర్స్ వెళ్ళాం. చిన్న చిన్న గూడెం లు పూరి పాకలు వాటి మధ్య వంట తాలూకు పొగ మంటల పొయ్యిలు కనపడ్డాయి. అసలే ఒంట్లో మందు మంచి లొకేషన్ వాతావరణం చలిగా పైగా పైన మొహమాటపు చంద్రుడు ఇవన్ని మమ్మల్ని మాంచి స్వింగ్ లోకి తీస్కేల్లాయి . ఒక గంట అయ్యాక మళ్లీ వెనకొచ్చి రూం లో మిగిలిన ఆ రెండో సీసా ఎం పాపం చేసిందని దాన్ని కూడా మూత తీసాం. రాజముండ్రి లో కొన్న తిండి ఇంకా కొండ కింద కుక్ వేసిన అమ్లేట్లు టొమాటో కర్రీ అన్నం సెకండ్ రౌండ్ వేసేసరికి రాత్రి 11 అయింది. బుద్ధి గా పడుకుంటే ఇంటికి , మారేడుమిలి కి తేడా ఏముంటుందని బయటకి వెళ్తుంటే గెస్ట్ హౌస్ వాచ్ మాన్ ఈ టైం లో వెళ్ళకండి ఇది అడవి అని చెప్పాడు. ఇప్పుడే వస్తాం సిగరెట్స్ కావలి అని చెప్పి మళ్లీ అదే రోడ్ లోకి వెళ్ళాం అలా ఒక 15 కిలో మీటర్లు వెళ్ళాక మంచి దట్టమైన అడవిలో చిన్న వంతెనా దానికింద గల గల పారే యేరు దూరం గా ఏదో గూడెం పాకలు వాటి మధ్య గుడ్డి దీపాలు పొగ వచ్చే పొయ్యిలు ...పైన చంద్రుడు నిర్మలంగా ఆకాశం .. అన్నిటికన్నా మిన్న గా చలి దాన్ని లెక్క చెయ్యని ఒంట్లోని మందు .. ఆ వంతెన మీదే కూర్చున్నాం అక్కడ నా సెల్లోని ముఖేష్ లతా రఫీ పాటలు విని నా ఫ్రెండ్స్ చాలా ఫార్మల్ గా బిహేవ్ చేసారు థాంక్ యు రా నీ వల్ల మేము ఈరోజు స్వర్గం చూసాం కాదు కాదు వచ్చెం అని చాలా ఆనందపడ్డారు. అలా రాత్రి రెండు దాక పాటలు విని కబుర్లు చెప్పుకొని ఇలా మనతో రాని మన మిగతా బాచ్ పాపం దురదృష్టవంతులు కదా అని నిట్టూర్చాం. గెస్ట్ హౌస్ కోచి పడుకొని ఘంటసాల ఎ ఎం రాజా మాధవ పెద్ది ఇలా ఒకల్లెంటి అందరినీ పేరు పేరునా తలచుకొని వాళ్ళ పాటలు ఖూని చేసి చివరకి నిద్ర పోయాం.
పొద్దున్నే నిద్ర లేచే నేను 6 కి లేచి చూస్తె మంచు లో తడిసిన అడవి తల్లి ఎంతో అందంగా కనపడింది వెంటనే గ్యాంగ్ అంతటిని లేపాను కల్లునులుముకుంటూ లేచిన వాళ్ళు ఆ అడవిని చూసి రెప్పకూడా వేయలేదు ఆ చెట్లు తీగలు పూలు వాటి మధ్య కోతులు పిట్టలు చూస్తూ.
ఒక గంట లో అంతా రెడీ అయి మళ్లీ కొండ కిందకి వెళ్లాం ఈసారి భద్రాచలం రోడ్ మీద ఘాట్ రోడ్ మీంచి కిందకి నడుచుకుంటూ దిగి అక్కడో జల పాతం చూసాం ఎక్కడో కొండల మీంచి జారి పడే నీరు ఐస్ లాగా చల్లగా స్పటికం లా స్వచ్చం గా ఉంది . అక్కడ రెండు గంటలు జల క్రీడలు ఆడి మళ్లీ పైకి వచ్చాం. మారేడుమిల్లి ఊళ్ళో ఉన్న రెండు చిన్న హోటళ్ళలో ఒక దానికి వెళ్ళాం (పేరు గుర్తులేదు) వాళ్ళు రాజమండ్రి , కాకినాడ నుంచి వచ్చి అక్కడి వాళ్ళకోసం వెచ్చాల షాప్స్ హోటల్స్ పెట్టారు . ఆ హోటల్ లో తిన్న ఇడ్లి పెసరట్టు కాఫీ చాలా బాగున్నాయ్. ఎ స్టార్ హోటల్ లో రాని కమ్మని రుచి , కల్తీ లేని ఆప్యాయత, అయిదుగురు ఎంత తిన్నా వంద దాటని బిల్లు లోని అమాయకత్వం అన్నీ ఎంతో బాగున్నై ...పది గంటలకి రూం ఖాళీ చేస్తూ ఈసారి మళ్లీ వస్తే ఎకువ రోజులుందాం అని అనుకున్నాం. వెనక్కి వచ్చే దారిలో మాట్లాడుకుంటూ.. మన ఆఫీసు బ్రాంచ్ ఇక్కడ పెడితే పని చెయ్యటానికి మనం రెడీ నా అని ప్రస్నించు కుంటే కాసేపు నిశ్శబ్దం దాని చేదిస్తూ మా కొండలు " అయినా ఇలాంటి అడవి ఊళ్ళో ఒకటి రెండు రోజులు ఉండటం బాగుంటుది కాని ఉద్యోగమా వామ్మో కష్టం గురూ అన్నాడు.." అవునవును నిజమీ కష్టమే అంటూ వంత పడుతూ మేము కూడా ఒప్పే స్కున్నాం.
అయినా ఆ మాత్రం కొండలూ చెట్లు చంద్రుడూ కోతులు(మేమే) మా ఊళ్ళో లేవా ఏంటి... ఏమంటారు?
PS: ఇందులో మందు గోల తీసేస్తే ఎవరైనా అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయ్యోచు. మంచి టూరిస్ట్ స్పాట్ .
మరి మందెండుకు రాశావ్ అంటే కొంచెం fiction ఉండొద్దా నాక మాత్రం సొతంత్రం లేదా ఊహల్లో కూడా..?
chinnappaTi gnaapakaanni taTTileapaaru.avunu aa ooru chaalaa baaguMTumdi.
రిప్లయితొలగించండిబావుంది.ఇలానే రాస్తూ ఉండండి.
రిప్లయితొలగించండిchala bgundi. malli malli chadivenu chaduvuthunnanu mee posts ni. intha ki oohallo swathanthramena leka nijama?
రిప్లయితొలగించండిnaakoka id suggest cheyyandi. pl.
తాగి తొంగోడంకి అక్కడ దాక వెళ్ళాళా .. ప్రక్రుతి అందాల్ని అస్వాదించాలిగాని .. ఎంజాయ్ చెయ్యడమంటె మందు కొట్టడం మాత్రమేనా.. పైగ అదో గొప్ప విషం లాగ.. బ్లాగడం ఒకటి,, మీలాంటి వాళ్ళు చాలామంది.. మనాలి లాంటి దూర ప్రాంతాలకి వస్తారు.. ఎంతో డబ్బు ఖర్చు పెడతారు.. కాని ఏమి లాభం.. రూముల్లొ మందు కొడ్తూ కూర్చుంటారు..
రిప్లయితొలగించండిమాట తూలేటి ఓ ఓలేటి గారు ... నా పోస్ట్ మీరు సరిగ్గా చదవలా..... ఆసాంతం చదివితే తూలేటి వాళ్ళు కాదు
రిప్లయితొలగించండిఆయినా మీ అంత అదృష్టం అందరికీ ఉండొద్దూ.... పైసా ఖర్చులేని తూలుడు
చదివి నందుకు ధన్య వాదములు
ఆత్రేయ
సో.. చివరాఖర్న పి.ఎస్ చదివి .. కధలోంచి "మందు గోల" ని తీసెయ్యాలా.. లేక కధంతా తుడిచెయ్యలా.. సరే తీసెసాం.. కాని..మీ ఇమేజినేషన్ కధ లొంచి "చెడు" ని తీసెయ్యగలమా. ఒక చెడు సందేశం : "మందు మత్తులో కారు డ్రైవ్ చెసాం" - ఇది మీ వూహె..కాని మీ కధ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని - మీ లాగే ఎంజొయ్ చెయ్యలనుకొనే వారి సంఖ్య ఎక్కువగా వుండదా? హ్యుమన్ సైకాలజీ - చెడుకి ఎక్కువగా ఎట్రాక్త్ అవుతుంది.. "తప్పు" అలా చెయ్యకూడదు అన్న పనే కావాలని చేస్తారు. ఛెడుని చాల బాగా అనుభవించినట్టు రాసి,.,. తూచ్ ..ఆటలో అరిటిపండు.. అనుకోవాలా. ఇంద్ర సినిమాలో చిరంజీవి అడ్డొచిన వాళ్ళను అడ్డంగా నరుక్కుంటూ పోతాడు .. (95%- సినిమా అంతా రక్తపాతం - కాని చివర్లో ఓన్లీ 3 నిముషాలు "నీతిసూత్రాలు" వర్లిస్తాడు.. సగటు ప్రేక్షకుడు దేనికి ఎక్కువగా ఇన్స్పైర్ అవుటాడు?
రిప్లయితొలగించండిమీలో ఒక మంచి రచయత వున్నాడు. "ఓలెటి" -"తూలెటి" - గుడ్.. మంచి రైం.. కాని మన రచన వల్ల - ఒక చెడు సందేశం జనాల్లొకి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడితే మంచిదని నా వుద్దేశం.. నిజమే మీరన్నట్లు.. పైసా ఖర్చు లేకుండా - తాగకుండానే - మరో లొకంలోకి వెళ్ళే కిటుకులు చాలా వున్నాయి.. మీకు తెలిసిన దగ్గర్లోని యోగా సెంటర్ కి వెళ్ళండి..
తూగేటి శ్రీ ఓలేటి గారు ,
రిప్లయితొలగించండిఈసారి తూగేటి అంటే తూలటం కాదు... బాలన్సుడ్(సమం గా తూగే) గా ఉండే శ్రీ ఓలేటి గారు మీ సూచన మనస్పూర్తి గా ఆహ్వానిస్తున్నా.. నిజానికి నా రాతలు ఎవరినైనా ఉత్తేజ పరుస్తాయని అనుకోలేదు, ప్రేరణ కలిగించే స్థాయి లో ఉన్నానంటే నేను ఇక నుంచి జాగర్త పడతా అలాంటి పొరపాటు మళ్ళీ చెయ్యను.. నాకు ఇప్పుడు గర్వం గా ఉంది. మీ సూచన నాకు పొగడ్త లా ఉంది. నేను రాసింది తప్పే తాగి డ్రైవ్ చెయ్యటం పెద్ద నేరం. ఊహే ఆయినా దాన్ని ఎవరైనా స్ఫూర్తి గా తీస్కుంటే ప్రమాదమే, ప్రమోదం కోసమైనా అలాంటి పని చెయ్యరాదు ,
ఈ వ్యాఖ్య ముఖం గా క్షమాపణ కోరుతున్నా. ఇకపోతే మీరన్న సినిమాలు చూసే సమూహం లో నేను లేను, అసలు టీ, కాఫీ వక్కపొడి, బీడీ ఏదీ వాడను. మీరన్నట్లు మరో లోకానికి వెళ్లేందుకు నాకు యోగ సెంటర్ కూడా అవసరం లేదు ఉన్నా చోటే స్వర్గం సృష్టించుకో గలను అది ఎలాగో త్వరలో ఒక పోస్ట్ రాస్తా...
గౌరవాభిమనలతో..
ఆత్రేయ
"అడవిలో చిన్న వంతెనా దానికింద గల గల పారే యేరు ", "ఆ వంతెన మీదే కూర్చున్నాం అక్కడ నా సెల్లోని ముఖేష్ లతా రఫీ పాటలు విని నా ఫ్రెండ్స్ చాలా ఫార్మల్ గా బిహేవ్ చేసారు "
రిప్లయితొలగించండి-రాత్రి 11 గంటల సమయంలో చిరుత,పులి అక్కడి వంతెన కిందగా రోడ్డు దాటుతాయి. వంతెన కింద నీటికై దుప్పులొస్తే, వాటి కోసం పులులొస్తాయి. మీరు పాటలతో అడవి నిశ్శబ్ద సౌందర్యాన్ని భంగం చెయ్యటం వలన అడవి జంతువులు తమ దారి మార్చుకొని వంతెనకు దూరంగా వెళ్లి వుంటాయి. మీరు పులిని చూసే అవకాశం కోల్పోయారు. యాత్రికులను అక్కడి గైడ్ అడవి జంతువులను చూపటానికి భద్రాచలం రోడ్ లోని వంతెన దగ్గరకే తీసుకు వెళ్తాడు సాధారణంగా. అడవిలో రాత్రుళ్లు నిశ్శబ్దంగా ఉంటూ అడవి చప్పుళ్లను, జంతువుల అరుపులను ఆనందించాలి.