ఎదిగేసిన పెద్దాళ్ళూ...ఇది వినండి !! ఈమధ్యే వచ్చిన ఒక యువ పెసరట్ రెండో సినిమా లో పాట 'వింటున్నావా వింటున్నావా ....' మీద చక్కని వ్యాఖ్య మన బ్లాగ్ మిత్రులెవరో పోస్ట్ చేసారు, ఆ పాట సాహిత్యాన్ని ఇంకా ఆడియో ని కూడా ఉటంకిస్తూ. యాదృచ్చికం గా ఆ పోస్ట్ చదివి ఆ పాట విన్నా. ఆ బ్లాగర్ చెప్పినట్లు ఎంత బాగుందో.
సరిగ్గా మూడు నెలల క్రితం నా కూతురు నా లాప్ టాప్ లో ఇలాంటి పాటలు డవున్ లోడ్ చేసింది. తనకి నా పాత లాప్ టాప్ ఇచ్చినా
నాదే వాడేది. నేను చూసుకొని ఇదేంటి ఇల్లాంటి పిల్ల పాటలు పిచ్చి పాటలు నా కంపూ లోనా 'ఐసా కభీ నహీ హో సక్తా' అనుకున్నా .. కానీ కూతురు కదా ఏమన లేక ఊరుకున్న పైగా హాస్టల్ కి కూడా వెళ్లి పోతోంది అన్న ప్రేలి (ప్రేమ+జాలి) తో .రెండు నెల ల క్రితం తను హాస్టల్ కి వెళ్ళిన వెంటనే నా కంపూ లో ఉన్నా ఇలాంటి పిల్ల ఫైల్స్ అన్ని వెతికి పట్టుకొని డెలీట్ చేసి పారేసా. నిజానికి మా అమ్మాయి దీ నాదీ ఇంచుమించు ఒకే టేస్ట్ తిండి సరదాలు సంగీతాలు ( ముఖం కూడా).అయితే నేను మళ్ళీ మళ్ళీ వినాలనుకునే తరహ పాటలు మా అమ్మాయి ఒక సారి కూడా వినదు వినలేదు కూడా.సరిగ్గా మూడు నెలల క్రితం నా కూతురు నా లాప్ టాప్ లో ఇలాంటి పాటలు డవున్ లోడ్ చేసింది. తనకి నా పాత లాప్ టాప్ ఇచ్చినా
కొంచం ఎక్కువ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే నా చిన్న తనం లో మా నాన్న కర్నాటిక్ వోకల్ నేర్చుకోమన్నపుడు నా స్పందన గుర్తొచ్చింది. ఆయనకి ఎదురు చెప్పలేక , నా వల్ల కాదు అనలేక నా పన్నెండేళ్ళ పసి దేహం వెక్కెక్కి ఏడ్చేసింది అది చూసి సంగీత కచేరీలో కూడా ఇలాగే చేస్తానేమో అన్న అనుమానం తో మా నాన్న ఒద్దులే పో .. అన్నాక కుదుట పడ్డా. కానీ పాటలంటే ఇష్టం మాత్రం ఉండేది. ఎదిగే వయసు తో పాటు సౌండ్ కూడా పెరిగే పాటలు ఇష్ట పడుతూ పెరిగేసాను. ఈ పెరబోలా లో వెర్తెక్స్ ఎక్కడుందో గానీ కొన్నాళ్ళకి సౌండ్ తగ్గి చివరకి మంద్ర స్థాయి లో కొచ్చా. ఇప్పుడు నేను వినటం అంటే చెవిలో మనకోసమే పాడినంత చిన్నగా ఉండాలి.
ఇక సాహిత్యానికొస్తే మా అమ్మాయి కి ఇష్టమైన పాటల్ని పిల్ల పాటలు అని విమర్శించా గానీ ఆ వయసులో నేనూ "అచ్చా అచ్చా బచ్చా బచ్చా లాంటి పాటలు మొదటి గిచ్చుళ్ళు నిన్నే గిచ్చా .. " నీ మీద నాకు ఇదయ్యో ... లాంటి పాటలు పడీ పడీ విన్న వాడినే ... ఇప్పుడు తెచ్చిపెట్టుకున్న పెద్దరికం తో సాహిత్యమంటే అన్నమయ్యే సంగీత మంటే సుబ్బు లక్ష్మే అంటుంటా. నెరిసిన నా జుట్టు కి చెంపల దగ్గర మాత్రం రంగేస్కోకుండా ..మిగతా అంతా బాగా నల్ల రంగేస్కోని. ఆ చెంపల దగ్గర మన పెద్దరికం కనపడాలని ( నిజానికి నాకు అది ఇష్టమైన స్టైల్) . సరే మనం వర్తమానం లోకి వస్తే ఆ వింటున్నారా వింటున్నారా ( సినిమా -ఎం మాయ చేసావో - అనంత శ్రీ రాం
రచయిత) విన్న తర్వాత ఎంత చక్కని సాహిత్యం, ఎంత మృదువైన భావాలు , ఎంత సొంపైన సంగీతం అని పించింది ఇల్లాంటి పాటలు మనకొత్త సినిమాల్లో చాలా ఉంటున్నాయి. ఎక్కువ యువతే వినే కొత్త పాటలు అసలు బాగుండవు అనే నా లాంటి (చంపల దగ్గర తెల్ల జుట్టు ) పెద్ద మనుషులు ఒప్పుకోరు కానీ ఎంతో సరళ మైన భాషా ఎంతో లోతైన భావం మరెంతో తియ్యనైన సంగీతం తో కూడిన పాటలు మన పాత పాటలకి ఏమాత్రం తీసి పోవు. ఆత్రేయ గారు రాసినట్లు, సాలూరి వారు చేసినట్లు, పాటలు ఈరోజు ఎవరూ చెయ్యలేరనే (తెల్ల మనసు) పెద్దమనుషులు ఈ కొత్త పాటలు వింటే వాళ్ళ అభిప్రాయం మార్చుకోవచ్చు. వక్కపొడి నములుతూ "ఈ కొత్త పాటలు మహా గోల గా ఉంటాయి ఆ నటీ నటులైతే ఇంకా ఘోరం రేషన్ లో బట్టలు కట్టుకుంటారు అనే మన అక్కలు అన్నలూ ఒకసారి ఈ పిల్ల పాటలు వినండి . వింటున్నారా వింటున్నారా...
మీతో మాట్లాడుతూ నా అసలు పని మర్చిపోయా ఎల్లుండి హాస్టల్ నుండి ఇంటి కొచ్చే మా అమ్మాయి, వచ్చే టైంకి ఆ డిలీట్ అయిన పిల్ల ( మొగ్గ) పాటలు మళ్ళీ డవున్ లోడ్ చెయ్యాలి అన్నీ గుర్తు లేవు గుర్తున్నంత వరకూ చేసి మిగతావి ఫోన్ లో అడిగి మరీ చేయాలి మా బంగారు అమ్మూగాడికి. వచ్చి హెడ్ ఫోన్స్ లో వింటూ ... ఓఓఓఓ ఆఆఆఆ హాఆఆఆఅ హైఇ ఉమ్మ్ .. అనే కూని రాగల మా కోయిలమ్మ కోసం ఈ ఆదివారమంతా వెచ్చిస్తా....
taram taram nirantaram... oka andamaina bhaava shaili..chaala baagaa chepparu peddarikaanni gurinchi.. ninnati pillale eanaati peddalu.. kaadaa mari... ante mari..
రిప్లయితొలగించండిbaga chepperu... leni vayasuni kooda meeda padesukuni pillalani kattadi chesevaru kooda untaru konthamandi....varini demuni puthrudu saminchugaka... edi emaina prathi tharam lonu manchi chedu rendu rakala kalayika untundi... akkada kaavalsindi peddarikam kaadu vichakshana anthe.yee mooduka paata... ye chettuka gaali anthe.
రిప్లయితొలగించండిwitty and humorous. please keep it going.
రిప్లయితొలగించండిare you supporting this generation or older one ?
రిప్లయితొలగించండిanyway your way of expression is great keep writing on different topics. your subtle humour and rude comments both are invited thanks athreya garu.