23, సెప్టెంబర్ 2010, గురువారం

ప్రేమ లో పడే వయసా ఇది ..!!


ఎపుడైనా ప్రేమ లో పదండి .. వయసు నో ప్రోబ్లం ...

ఒక వర్షా కాలం పొద్దున్నే మంచిగా పెద్ద వాన పడుతుంటే లేక రాత్రంతా వాన కురిసి పొద్దున్నే ముసురు ముసురు గా ఉంటే నిద్ర లేవాలని ఉంటుందా, ఒక వేళ లేచినా అలా పొద్దున్నే లేవగానే ఏమి చేస్తాం ? బ్రషింగ్ అయ్యాక వేడి వేడి కాఫీయో టీయో తాగుతూ పేపర్ లోని చల్లారిన వార్తలు మళ్లీ చదువుతూ ( నిన్న రాత్రి టీవీ లో చూసేసాం కదా ) ఒక అరగంటైనా గడుపుతామా మరి . (ఇది నీకు కుదురు తుందేమో గానీ మాకు అంత టైం లేదు అంటారా మీ ఇష్టం) కుదిరిన కుదరక పోయినా ఇది చదవాల్సిందే తప్పదు.
ఒక వేళ ఈ రోజు ఆఫీసు కి వెళ్ళాలని లేక పోయినా ఇంకేదైనా పని ఉన్నా సెలవు పెడతాం కదా. ఇది కూడా నీకే చెల్లు మా వల్ల కాదంటారా మళ్ళీ మీ ఇష్టం. నో కామెంట్స్. కాఫీయో టీయో కావాలంటే ఏమి కావాలి బయట నుంచి పాలు, అవి కాయటానికి పనమ్మాయ్ వచ్చి గిన్నెలు తోమి రెడీ చేసి ఇవ్వాలి, ఇంకా అంతకన్నా ముందే పేపర్ అబ్బాయి పేపర్ వేసి వెళ్ళాలి. ఇన్ని జరిగితే మనం పై సీన్ బాగా పండిస్తాం.
మళ్లీ కధ మొదటికి వెళితే ఒక వర్షా కాలం పొద్దున్నే మంచి వాన లో ఏదైనా ఇబ్బందికి పనమ్మాయి రాకపోతే పాల అబ్బాయి పాకెట్స్ ఇవ్వక పోతే పేపర్ అబ్బాయి మన మొహాన ఆ యీక్షి, సానాడు కొట్టక పోతే...??? ఏంటి మార్గం ? మనవే అవును సాక్షాత్తు మనమే చేయాలి ఈ పనులన్నీ ఇందులో అడ పని మగ పనీ అని నేను బేధం నేను చెప్పట్లేదు ఎవరికీ ఎలా కుదిరితే అవి చెయ్యాల్సిందే ఆ రోజుకి. తీరా ఏ ఎనిమిదింటికో పనమ్మాయి వచ్చి వర్షానికి ఇల్లంతా నీల్లమ్మా తడవటం వల్ల జొరం కూడా వచ్చింది మా మగాయన పన్లోకి కి కూడా వెళ్ళలేదు ఇల్లాంటి సాకులు చెప్తే ఎలా ఉంటుంది ? ఒళ్ళు మండదూ... అబ్బే మేము చెంగల్పట్టు శాంతారాంలం మాకు అస్సలు కోపం రాదు అంటారా ! మీరు కాసేపు పక్కన ఉండండి. !!
గిన్నెలు తోమటం ఇల్లు ఊడవటం బయటకి వెళ్లి పాలు పేపర్ తెచ్చుకోవటం, మనకి తప్పవ్ కదా . కాసేపు తెల్ల మెడ ఉద్యోగం చేసే మా రాజులూ మా రాణులు మనకున్న సౌలభ్యాల గురించి ఆలోచిద్దాం ఒక పది నుంచి పదిహేను సాధారణ సెలవులు ఆదివారాలు పండగలు మనవి కాక పక్క రాస్త్రానివి కూడా , ఇంకా ప్రివిలేజ్ లీవులు కొంతమందికి శని వారం కూడా సెలవ్ ఇంకా సిక్ లీవ్ ఇలా లెక్క పెడితే హక్కుల సాధనలో మనం చాలా ముందున్నాం. నీకెందుకోయ్ ఏడుపు అవన్నీ ఇచ్చేవ్వాడికి లేని దురదా అని తిట్టకండి ఇవన్నీ నాకూ కావాలి. ఇందులో సేమ్ పించే .
కానీ మన ఇంట్లో పని చేసే వాళ్ళ మీద కొంచం కనికరం కూడా చూపుదాం. ఇబ్బంది వల్ల రాలేక పోయిన పనమ్మాయి కి ఎమన్నా తినడానికి పంపే ప్రయత్నం . వాన వల్లో చలి వల్లో లేట్ గా వచ్చే పాల పేపర్ అబ్బాయ్ లకు ఒక కప్పు చాయ్ ఇవ్వటం. లాంటివి. ఇవన్నీ మీరు చేస్తున్నారు నాకూ తెలుసు అయినా
వయసు మీద పడటం వల్ల వచ్చిన చాదస్తం తో చెప్తున్నా ..
ఇల్లాంటివే ఇంకా చాలా ఉన్నాయి లిస్టు రాయనా..
1 మన వాచ్ మాన్ కి రోజుకొకళ్ళు తినడానికి కూరో సాంబారో ఇవ్వటం కష్ట మైన పనేమీ కాదు ఉన్నా 20 లేక 30 ఫ్లాట్స్ లో నెలలో ఒక రోజు ఒకళ్ళకి పని అంతే ,
వాళ్ళ పిల్లలకి చదువు కి సాయం చేయటం అప్పుడప్పుడూ నోట్స్ లు పెన్నులు కానుకలు గా ఇవ్వటం , వారానికో నెలకో వాళ్ళకి మన కారులో లేదా బైక్ మీద స్కూల్ దగ్గర లేదా దార్లో దింపే సాయం చేయటం. ఏదన్న అనారోగ్యం వస్తే మందులకి చేత నైన సాయం చేయటం అన్నిటికన్నా ముక్ష్యం గా వాళ్ల పిల్లలకి పనులు చెప్పక పోవటం. మన పిల్లలతో సమానంగా కాక పోయినా కనీసం పిల్లలుగా చూడటం .
2 ఇంట్లో పని చేసే మనిషి మీద సెలవు విషయం లో కనికరించటం, వాళ్ళు మనలాంటి మనుషులన్న అవగాహన ఉండటం. పైన చెప్పిన చిన్న చిన్న సాయం వాళ్ల పిల్లలకీ చేయటం
3 పొద్దున్నే వాన లో లేదా చలి లో వచ్చే పాల అబ్బాయి కో పేపర్ అబ్బాయికో ఒక కప్ టీ ఇవ్వటం ఒక మంచి పలకరింపు చేయటం , కనీసం వాళ్ళ పేర్లు తెలుసుకొని వాళ్ళని పేర్ల తో పిలిచి సంతోష పెట్టటం . దీనికోసం మీరు పొద్దున్నే లేస్తారు అది మీకు ఎంతో ఆరోగ్యం ఆనందం కూడా.
4 మంచి ఎండాకాలం ఎండలోనో, వానాకాలం వాన లో వచ్చిన పోస్ట్ మాన్ కి కొరియర్ మనిషి కి చల్లటి నీళ్ళు ఇంకా మనసుంటే మజ్జిగో శరబతో ఇవ్వటం..
5 మన కాలనీ లేదా ఆఫీసు సెక్యూరిటీ గార్డ్ లను ఆదరించటం పొద్దున్నే మనమే గుడ్ మార్నింగ్ చెప్పటం. ఎపుడన్నా చిన్న మొత్తం బక్షీస్ ఇవ్వటం
6 ఇలా మనకి తెలిసిన వాళ్ళకే కాక అస్సలు తెలియని వాళ్ళకి కూడా సాయం చెయ్యొచ్చు లిఫ్ట్ అడిగి మరీ ఇవ్వటం ఆడాళ్ళ కైతే రెడీ అంటారా సర్ జీ మీ ఇష్టం ...
7 ఒక సెలవ రోజు డజను అరటి పళ్ళో ,జామ కాయలో కొని రోడ్ మీద బీద ముసలి వాళ్లకి పంచటం, బిస్కట్ ప్యాకెట్ లేదా బ్రెడ్ ప్యాకెట్ కొని ఆకలి కొన్న వాళ్ల ఆకలి తీర్చటం
( ఒక చెత్త సినిమా చూసినంత ఖర్చు కాదు )
ఈ రకం గా మీరు మీ చుట్టూ ఉన్నా వాళ్ళతో ఎపుడన్నా ప్రేమ లో పడొచ్చు , దీనికి వయసుతో నిమిత్తం లేదు పెళ్ళాం లేదా మొగుడి తో పేచీ లేదు
ఇవన్నీ మేము చేసేవే ఇంక నువ్వు చెప్పేదేంటి అంటారా మీకు ఈ స్క్రీన్ మీదే సాష్టాంగ ప్రణామం, బయట కనబడితే పెద్ద సలాం ....

12 కామెంట్‌లు:

  1. chaala baga cheppaaru..kakapote,,appudappudu avi tirigi manake tagultuntaayandi...afternoon vandina sambar evening iste,,mana edurugane paarestunnaru ippati panammayilu,watch man lu...vedi vedi ga stove meda nunchi iste tappa,,teskovatledu...adagakundaane chinna money help lu cheste,,maree alusu...nijamandi baabu..ante,,andaru alane ani anatledu lendi...

    రిప్లయితొలగించండి
  2. @ రాణీ :) టూ
    @ నిరూ at times you are రైట్, కానీ మనమెప్పుదిస్తాం? వండిన మరుసటి రోజు వేస్ట్ అవతాయని లేక పోద్దునది రాత్రి కదా.అదే వెంటనేఇస్తే నే .నా ఉద్దెస్యమ్ వాళ్ళకీ వేడి గా తినె అదృష్టం(not stale food)కలిపిద్దాం .i am sorry నా ఉద్దేశం అర్థం అయి౦ది మీకు అది చాలు.
    @ భారతీయ మినెర్వా: చాలా థాంక్స్ కొట్టు తెరిచి బెరాల కోసం ఎదురు చూసే వాళ్ళలాగా చదివే వాళ్ళ కోసం మొహం వాచి పోయి ఉన్నా ( నిజ్జం పార్టీ మీటింగులకి జనాన్ని సమీకరించినట్లు ఏదన్న మార్గం ఉందా ? నేను కొత్త వాడిని కదా హెల్ప్ చేసి పుణ్యం ప్యాక్ చేస్కొండి)

    రిప్లయితొలగించండి
  3. ఆత్రెయ గారు,
    మీ బ్లాగ్ చదివెవాళ్ళు తక్కువ అనుకోకండి.నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు.కాకపోతె తెలుగు టైపింగ్ కొంచం కష్టం కాబట్టి తొందర గా కామెంట్ పెట్టలేము అంతే.

    రిప్లయితొలగించండి
  4. బాగా వ్రాసారు.చిన్నచిన్న విషయాల మీద మనం ఆలోచించాలని గుర్తు చేసారు.
    సరదాగా ఓ చిన్న సలహా, విన్నపము. మన బ్లాగు ప్రపంచంలో అనేక సంఘాలున్నాయి. కెబ్లాస, బ్రబ్లాస,యుబ్లాస,దకోబ్లాస, వంకాబ్లాస ఇత్యాదులు.మనమంతా అంటే కామెంట్లు లేని బ్లాగర్లు కూడా ఒక సంఘం పెట్టేసుకుందాం. కాలేబ్లాస.మీరందరూ బలవంతంచేస్తే, కాదూకూడదు అంటే, అంటారనుకోండి, నేను అధ్యక్ష పదవిని అలంకరిస్తాను. కాని ఒక షరతు. మీరు అన్న ఆ క్వార్టరు (వారానికి ఏడు చాలు) ఇస్తానంటే.మన టపా పడిన వెంటనే టపటపా కామెంట్లు పెట్టేసు కోవచ్చు.

    రిప్లయితొలగించండి
  5. @మస్తాన్ బాయ్ షాకే హ్యాండ్ ఒద్దు గలే మే ఆవ్ ...ప్రేమ్ సే అవుర్ దిల్ సే
    @బులుసు సుబ్రహ్మణ్యం గారు .. అధ్యక్ష పదవి కి పాట పెడదాం నా పాట వారానికి ఆరు క్వార్టర్ కాయలు
    ఒకటో సారి రెండో సారి ఎవరన్న ఉన్నారా.............

    రిప్లయితొలగించండి
  6. 'కొట్టు తెరిచి బెరాల కోసం ఎదురు చూసే వాళ్ళలాగా చదివే వాళ్ళ కోసం మొహం వాచి పోయి ఉన్నా ( నిజ్జం పార్టీ మీటింగులకి జనాన్ని సమీకరించినట్లు ఏదన్న మార్గం ఉందా ?' Same feeling naku kooda. vaaa :(

    - Post chala bavundi. U r cho chveeT. Kindness is the essence. Generocity is a spice.

    Sujata (sangharshana.blogspot.com)
    [gaddipulu]

    రిప్లయితొలగించండి
  7. very nice. u made so many ppl to think in a different way to love our society and ppl around us in small way(in reality it leads to big change). we dont like to be treated bad by ppl above us but we never mind treating the same to the ppl who work/serve us. nice post.

    రిప్లయితొలగించండి
  8. మీ టపా చాలా బాగుంది.. ఇలాంటి పోస్టులు మరెన్నో చెయ్యాలని నేను కోరుకుంటున్నాను.. చిన్న,చిన్న విషయాలైనా రోజూ చేయ్యాలనిపించే మంచి పనులని ఒక దండలా గుదిగుచ్చారు. బాగుంది.

    రిప్లయితొలగించండి