9, సెప్టెంబర్ 2010, గురువారం
మీ మీద అపవాదు పడకూదనుకుంటే ..చదవండి..
వినాయక చవితి
ప్రతి విషయానికి రింగుల్లోకి వెళ్లి గతం గుర్తుకు తెచ్చుకునే నాకు వినాయక చవితి అనగానే మళ్లీ రింగులు పడ్డాయి మొహమ్మీద. ఇది నే పుట్టాక 45 వ వినాయక చవితి మొదటి అయిదు ఆరు చవితి పండగలు గుర్తులేవు అప్పటికి మనం చిన్నవాళ్ళం కదా.. అందుకే ఆ తర్వాత సంగతులు చెప్తా చవితి పండగకి మా అమ్మ అన్ని పండగల్లగానే మిషన్ కుట్టే సలీం ని ఇంటికి పిలిపించి చాప వేసి కూర్చో బెట్టి ఇదిగో ఈ గుడ్డలు తీస్కోని వీళ్ళిద్దరికీ చొక్కా లాగూలు బాగా పొడుగ్గా లూస్ గా కుట్టాలి అని నన్ను మా అన్న ను చూపించేది కింద చాప మీద బాసిపీట వేసికూర్చున్న సలీం భాయి కాల్లు ఊరికే ఆడిస్తూ ( అలవాటై పోయిన కాళ్ళు కదా ఊరికే ఉండేవి కాదట ) గుడ్డలు టేప్ తో కొలిచి మా ఇద్దరినీ పైకి కిందకీ తెగ చూసేసి కాసేపు గాల్లో లెక్కలు వేసి
" లాభం లేదు చాలా కష్టం రెండు లాగూలు రెండు చొక్కాలు కష్టం.. గుడ్డ తక్కువ తీస్కున్నరమ్మా.. అంటూ బడ్జెట్ ముందు ప్రణబ్ గారిలా పెదవి విరిచే వాడు, మా అమ్మ సరిగ్గా చూడవయ్యా తమ్ముడూ సరిపోతాయి లే అంటే, ఏదో పోన్లే పాపం అన్నట్టు మొహం పెట్టి కొలతలు తీస్కుని చిన్నయనకి చొక్కా ఫుల్ హాండ్స్ రాదమ్మా అనగానే నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తేవి. మా అమ్మ కొంచం గొంతు పెంచి సరిగ్గా చూడు కుదరక పోతే సత్రం కొట్టు అరుగుల మీద సుబ్బారావు( ఇంకో ప్రణబ్ లేక చిదంబరం) ని పిలుస్తా అంటే ఒద్దులే మళ్ళీ మీకు టయానికి ఇవ్వడు అని గుడ్డలు కవర్ లో సర్దేస్కునే వాడు. కేసు ఫైనల్ చేసిన జడ్జ్ గారిలా ... ఎంత గుడ్డలు, కొలతలు మనవైనా కుట్టే విద్య సలీం భాయి దే కదా ......
అలా వెళ్ళిన సలీం మేము రోజూ వెళ్లి వెంట పడితే గానీ పండగ ముందు రోజుకి రెడీ చేసే వాడు కాదు. స్కూల్ నుంచి రాగానే రోజూ వెళ్లి వర్క్ ఇన్ ప్రొగ్రెస్స్ చూసే వాళ్ళం నేను మా అన్న. మీరూ వెళ్ళండి బాబూ నేను తెస్తా గా అనే వాడు. చివరకి మేమే తేచుకునే వాళ్ళం పాత ఆంధ్ర పత్రిక పేపర్ లో చుట్టిన మా కొత్త బట్టలు.
రెండు రోజుల ముందే మా అమ్మ బియ్యం ఒక డబ్బాలో పోసి పిండి మర కెళ్ళి రవ్వ పట్టించుకోని రండి అని పంపేది అక్కడ మనకన్నా మందే డబ్బాలు లైను లోనే ఉండేవి అవి అయ్యి, మన వంతు వచ్చేదాకా ఆ మర లో అటూ ఇటు తిరుగుతూ, పక్కనే ఉన్న పోస్ట్ ఆఫీసు లోకి వెళ్లి అక్కడ ఉన్న జిగురు తో చిత్తూ కాగితాలు అక్కడే గోడలకి అంటించి పోస్ట్ మాస్టర్ తో చీవాట్లు తిని మొత్తానికి పనయ్యాక ఇంటికోచ్చె వాళ్ళం. పండగ ముందు రోజు సాయంత్రం కొబ్బరి కాయలు పళ్ళు పూలు ఇంకా కొన్ని అవసామైన సామాన్లు లిస్టు రాసితే సైకిలు నడిపించు కుంటూ మా అన్న నేను అక్కా తెచ్చే వాళ్ళం. పండగ రోజు పొద్దున్నే స్నానం చేసి రెడీ అయితే మళ్లీ కోనేరు సెంటర్ కి వెళ్లి పత్రి పూలు మట్టి వినాయకుడు ఫ్రెష్ గా పెర్సోనలైసేడ్ రోల్స్ రాయస్ లా మెరిసి పోతూ, మంచి బంక మన్ను వాసన వేస్తూ.. మనకోసమే తయారు చేయబడ్డాడని గర్వం గా ఎత్తుకొని ఇంటికి తీసుకోచ్చేవాళ్ళం . పదిన్నరకి మా అమ్మ సగం వంట పూర్తి చేస్తే, మేము అయిదుగురం మా నాన్న అమ్మ అన్న అక్క నేను మడి బట్టలు కట్టుకుని పూజ కి కూర్చునే వాళ్ళం మా నాన్న మాత్రం పట్టు పంచ ఉత్తరీయం వేస్కునే వాళ్ళు.
మా నాన్న చవితి పుస్తకం చదువు తుంటే మా అమ్మ డైరెక్షన్ లో పూజ చేసే వాళ్ళం కధకి ముందు అక్షింతలు చేతిలో ఉంచుకొని కధ అయ్యాక గణపతి మీద వేసి నెత్తి మీద పెద్దవాళ్ళతో వేయించుకునే వాళ్ళం. ఈ లోపు పూజ లో ప్రసాదాల పాట వస్తే నాకు నోట్లో క్రిష్నమ్మ మా వాళ్ళందరూ కి నవ్వుల బంగాళా ఖాతం ... అలా పూజ అయ్యాక 11 30 కి మీరూ ఒక అరగంట కూర్చుంటే వంట పూర్తి చేసి మహా నైవేద్యం పెట్టి మీకు పెడతా అంటే ఈ లోపు కొబ్బరి ముక్కలు అరటి పళ్ళు మీదకి దాడి వెళ్ళేవాళ్ళం. మంచి ఉండ్రాళ్ళు పూర్ణాలు పులిహోర తో భోజనం చేసాక , మా నాన్న ఈరోజు ఒక గంట అన్న చదవండి మంచిది బాగా చదువు వస్తుంది అంటే కొంచెం సేపు ఏదో ఆక్షన్ చేసి లేచే వాళ్ళం. అలాంటి వినాయక చవితులు ఎన్నో గడిచాక ..
ఉద్యోగం లో చేరాక పండగ రోజు ఇంటికెళ్ళి ఇంచుమించు అలాంటి చవితి పూజలే చేస్కున్నా.. పెళ్ళయ్యాక మా ఆవిడతో కూడా కలిపి అలాంటి చవితిలే చేస్కున్న మా అమ్మాయి పుట్టాక కూడా అలాంటి పండగే చేస్కున్న... నా 31 ఏట మా నాన్న శ్రావణ మాసం లో చెప్పకుండా హాటత్తు గా వెళ్లి పోతే ఆ భాద్రపదం లో
'నో ' పండగ. మరుసటి ఏడు మళ్ళీ చవితికి .. మా నాన్న పట్టు బట్టలు ( నాకు కొత్తవి ఉన్నా..) కట్టుకొని దేవుడి ఎదురుగా మధ్య పీట మీద నేనే కూర్చొని పూజ పుస్తకం చదువుతూ మా అమ్మాయి తో పూజ చేస్తుంటే 32 ఏళ్ళకే ఎంతో పెద్ద అయిపోయిన భావన ...
ఇప్పుడు 45 దగ్గర పడుతున్న ఈ వయసులో చదువు పేరు తో దూరం గా ఉన్న మా అమ్మాయి ని తలుచుకుంటూ పూజ ఎలా చేస్తామో నేను మా ఆవిడా మా అమ్మా...
( ఈ కదా చదివి అక్షింతలు మీ నెత్తి మీద వేస్కో పోతే మీ దగ్గర డ్రగ్స్ దొరికయన్న అపవాడు లేక అధిష్టానికి చెప్పకుండా ఓదార్పు చేసారన్న అపవాడు పడి కష్ట పడతారు తస్మాత్ జాగ్రుత జాగ్రుత ......)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
శుభం
రిప్లయితొలగించండివినయక చవితి శుభాకా౦క్షలు స్వామి గారు
రిప్లయితొలగించండిమీరు వ్రాసిన తీరు ఎంతగానో ఆకట్టు కునే లాగ ఉంది. అభినందనలు.టైపింగ్ లో కొంత శ్రద్ధ కొరవడినట్టుగా తోచింది. ఎక్కువ తప్పులు దొర్లేయి. కొ్త్త బట్టలకి నూనె మరకల్లాగా ఇంత పసందయిన రచనకి అలాంటి అక్షర దోషాలు శోభనివ్వవు. గమనించండి.అన్యధా భావించకండేం?
రిప్లయితొలగించండి@ పంతుల జోగారావు గారు: నిజమే నాకు టైపింగ్ రాదు అందులో తెలుగు టైపింగ్ మరీనూ.. పల్లోచేటప్పుడు వాంతుల్లాగా కొంత కాలం నా బాధ తప్పదేమో... మీ సలహా శిరోధార్యం ధన్య వాదాలు ..ఆత్రేయ
రిప్లయితొలగించండిvinayakachavithi kadha prathi yeta chadivina kothagane untundi. ee yedadi mee kadha kooda okasari gurthosthundi, chavithi kadha chadivinappudu .... bagundi mee kadha. ninajaniki andari kadha ade.
రిప్లయితొలగించండివినయక చవితి శుభాకా౦క్షలు స్వామి గారు
రిప్లయితొలగించండిreadability bagoledu, paragraphs set cheyyandi.
remove word verification pls.
రిప్లయితొలగించండిఆత్రేయ గారు మీది బందరా? కోనేరు సెంటర్ అన్నారు కదా అందుకని డౌట్ వచ్చింది బాగా రాసేరు అండీ కాస్త అటు ఇటూ గా మా ఇంట్లో కూడా ఇదే తతంగం నడిచేది.. :-) వినాయక చవితి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి@ భావన అవున౦డి మాది బ౦దరె ఇప్పుదు కాదు చిన్నప్పుదు మీది కూడా నా..? వినాయక చవితి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిబాగా వ్రాసారు.
రిప్లయితొలగించండిమా చిన్నప్పుడు చవితి ముందు రోజు సాయంత్రం సెలవిచ్చేవారు.
స్నేహితులతో కలిసి సైకిళ్ళమీద పత్రి కోసం ఊరంతా తిరిగేవాళ్ళం.
అవన్నీ గుర్తు చేసారు.
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిఅవునండి. మాది బందరే. మా వూరి పేరు వినగానే సంతోషమనిపించింది. మా వూరి మీద నేనొక పోస్ట్ కూడా రాసుకున్నా చూడండీ. మా వూరంటే నా కంత ఇష్టం. :-)
రిప్లయితొలగించండిhttp://bhavantarangam.blogspot.com/2009/08/blog-post_11.html
నాకు నోట్లో క్రిష్నమ్మ మా వాళ్ళందరూ కి నవ్వుల బంగాళా ఖాతం ... hahahah
రిప్లయితొలగించండి