9, అక్టోబర్ 2010, శనివారం
మరక మంచిదే ....
. ..ఆ మరక స్వార్ధమయితే
నే చదివిన ఒక బ్లాగ్ పోస్ట్ దానికి నేను రాసిన వ్యాఖ్య ఈ చిన్న పోస్ట్ కి దారి తీసింది. బాగుంటే ఆనందించండి లేకుంటే ఇక్కడే తిట్టండి ..
ఆ బ్లాగ్ పోస్ట్ ఏంటంటే పూడురి రాజి రెడ్డి గారు అడిగిన ప్రశ్న NARCISSIST అనే మాటకి మంచి తెలుగు పదం ఏంటి అని ?
దానికి వ్యాఖ్య రూపం లో నేను " స్వాభిమాని" అని రాసాను
దానికి అయన సమాధానం గా "పదం బాగుందికానీ ఇది పాజిటివ్ కదా. నార్సిసిజాన్ని నెగెటివ్ సెన్సులో కదా వాడేది."
మళ్ళీ దానికి నా జవాబు :అలాగని ఖచ్చితమైన రూలేమీ లేడు. ఉదాహరణకి : introvert . extrovert అనే మాటలు మన popular తెలుగు నవలా రచయితల పుణ్య మా అని negative / positive (respectively ) మాటలుగా స్థిరపడి పోయాయి. నిజానికి introvert గా ఉండటమనేది జబ్బు కాదు ఒక మానసిక స్థితి అనుసరణ !! అయినా మీకు తెలీకుండా ఉంటుందా రాజిరెడ్డి ..? అని రాసాను.
దానికి ఆయనేమంటారో నాకు ఇంకా తెలియలేదు.
కానీ ఆలోచిస్తే నార్సిస్సిసం (NARCISSISM) అనే మాట ఎందుకు వాడతారు ? నిజం గా నెగటివ్ అర్థం లోనే వాడాలా? అని ఆలోచిస్తే నాకిలా అనిపించింది
ఆ మాట ఆంగ్లం లో సిగ్మండ్ ఫ్రాయిడ్ చే నాణెం చేయబడింది ( coined కి వచ్చిన నా తిప్పలు )లేక చేర్చ బడింది.
ఒక గ్రీకు పురాణ పాత్ర నార్సిసస్ ఇతి వృతం మూలం గా ఆ మాట కనుగొనబడింది. అసలు నార్సిసస్ అనే అయన గ్రీకు పురాణాల్లో ఉన్నాడట. అయన మన మన్మధుడి లా ( అంటే నాగార్జున కాదు) మంచి అందగాడు,
కానీ ఆయన్ని అయన ఎప్పుడూ చూస్కోలేదుట. నిమ్ఫ్ ఎకో అనే ఆవిడ గ్రీకు పురాణాల్లో ఒక స్త్రీ . ఆమె మన TV వాళ్ళ లాగా పుకార్లు వ్యాప్తి చేస్తుంటే వాళ్ల గ్రీక్ ఇంద్రుడు శాపం పెట్టాడట : ఎప్పటికి నీ మాట ఆఖరుమాట గా ఉంటుంది అని, అంటే మొదట గా ఆమె మాట్లాడ లేదు ఎవరన్న మాట్లాడితే అదే మాటలు తిరిగి అనగలడు అదీ శాపం. అందుకే చూడండి ఆంగ్లం లో ఎకో మాట తిరిగి వచ్చే ప్రతి ధ్వని గా ఉంచ బడింది, ఆ నిమ్ఫ్ ఎకో గారి పేరిట. సరే మన అసలు కధ లోకి వస్తే మన నార్సిసస్ గారి అడవి లో వెతుంటే మన ఎకో గారు చూసి మాట్లాడామని ప్రయత్నిన్చిందిట. అసలే అయన బాగుంటాడని చెప్పుకున్నాం కదా అందుకని అనుకోండి. కానీ గ్రీకు ఇంద్రుడి శాప ఫలితం గా ఆమె నర్సి గారి వెంట బడింది కానీ మాట్లాడ లేక పోయింది. సదరు నర్సి గారి తిరిగి తిరిగి అలసి దాహమేసి ఒక కొలను లో నీళ్ళు తాగుదామని వంగాడట నీళ్ళలో అయన ప్రతిబింబం ఆయనే చూస్కొని బాగున్నదని ఫీలయి అయన బొమ్మ తో ఆయనే లవ్ లో పడ్డాడట, ఇక ఆ లవ్ ముదిరి మాటలు ఆడుకుంటూ అలా ఉంది పోయాడుట పనిలో పని గా మన ఎకో అమ్మగారు అయన అన్న మాటలే మళ్ళీ అనటం మొదలు పెట్టిందిట .. ఆమె మాటలు తన బొమ్మే ( కొలనులో బింబం) అంటోందని నర్సి గారు ఇంకా తనతో తానె మాట్లాడుకోవటం తద్వారా తనని తానే ప్రేమించు కోవటం మొదలెట్టాడుట ఆక్రమం లో అయన ఒక పువ్వుగా మారి అదే కొలను లో ఉండి తనలో తానే లవ్వాడు కుంటూ ద్యూఎట్స్ పాడుకుంటూ ఉండి పోయాడుట ఆ పురాణం మనకెందుకు కానీ ....
ఇక్కడ అసలు నే చెప్పదలిచిన విషయం ఏంటంటే నర్సిసం మంచిదా కాదా అంటే మన మంటే మనకి ఇష్టం ఉండటం మంచిదేనా?? మన మీద మనకు స్వార్ధం అభిమానం కొండొక చొ దురభిమానం ఉండటం గురించి చర్చ ..... అసలు మన మీద మనకు ఎంత ఇష్టం ఉండాలి మన మీద అంటే మన దేహం మీద మన జీవితం మీద మన మనుషుల మీద ఎంత వరకూ ఇష్టం ఉండాలి . నిస్వార్ధం గా ఉండాలనుకోవటం మంచిదే కానీ పైన చెప్పిన విషయాల్లో ఎక్కువ స్వార్ధం ఉండటమే మంచిది మన దేహం మీద స్వార్ధం, జీవితం మీద స్వార్ధం, మన మనుషుల మీద స్వార్ధం, ఉంటే చాలు ప్రపంచం మీద ప్రేమ ఉన్నట్టే బాగా స్థూల అర్ధం తీస్కోండి మన జీవితం బాగుంటే నే కదా సమాజం బాగున్నట్టు మన మనుషులు బాగుంటేనే కదా లోకం బాగున్నట్టు అసలు లోకం లో అందరూ మన మనుషులే కదా.. మన మానవులే కదా మన సోదరులే కదా మన వసుధైక కుటుంబ సభ్యులే కదా మరి మన బాగు మనం చూస్కోవటం లో స్వార్ధం ఏముంది చెప్పండి.
ఇక పోతే మన దేహం మీద స్వార్ధం మాత్రం కొంచం ఎక్కువ చూపించాలి ..... ఆరోగ్య విషయం లో .. అందం విషయం లో కూడా పెళ్లి కాగానే ఇక మనం ఆకర్షణీయం గా ఉండక్కర్లేదు అనుకునే మానసిక పెద్దలు మధ్య వయసు వచ్హాక మనకు సోకులేందుకు అనుకునే స్థిత ప్రజ్ఞులకు ఈ స్వార్ధం అర్ధం కావాలి అలవాటు కావాలి. ఇంట్లో మాములప్పుడు అప్పలమ్మలాగా అప్పలయ్యలగా ఉండి ఎక్కడో ఎవడో పెళ్లి అంటే పార్లోర్ కో సలూన్ కో పరిగెత్తి మెరుగులు పెట్టించుకునే మధ్య వయసు మానవులకు ఆ సోకులు మన కోసం మన మనుషుల కోసం తప్పని సరి అని తెలియ చెప్పాలి. మనం ఆకర్షణీయం గా ఉంటేనే మన మనవ సంభందాలు త్వరగా బల పడతాయని నా ఉద్దేశ్యం బాలేక పోతే సంభంద భాంధవ్యాలు ఉండవని కాదు. ఇద్దరు కొత్త వ్యక్తుల మధ్య మొదట కనపడేది బాహ్య రూపమే కదా. అలాగే మన వాళ్ల కళ్ళకు కొంచం అందంగా ఆకర్షణీయం గా కన పడటం తప్పేమీ కాదు. ఆ స్వార్ధం మంచిదే ఆరోగ్యకరమైన ఈ స్వార్ధం మన కీ మన మనుషులకీ మన సమాజానికీ అందరికీ ఆరోగ్యమే.. ఏమంటారు ?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
nice one sir ji
రిప్లయితొలగించండిబాగుంది గ్రీకు పురాణం . మాకో కొత్త మాట నార్సిసం గురించి చెప్పారు మీరు రాసింది నిజమే ఆ మాత్రం స్వార్ధం ఉండాలి, ఎదుటి వాళ్ల నాశనం కోరే స్వార్ధం కాదు మన బాగు మనం చూస్కునే స్వార్ధం ఉండాలి.
రిప్లయితొలగించండిఇంకా రాయండి ఇల్లాంటివి- సరస్వతి రామ్ కుమార్
good point.
రిప్లయితొలగించండిమీకు ఇంకో ఉచిత సలహా. మేటర్‌ని పేరాగ్రాఫులుగా విడగొట్టి, రెందు పేరాల మధ్య కనీసం ఒక లైను ఖాళీ ఉంచేలా రాయండి. చదివేవారికి కంటికి ఇంపుగానూ ఉండి హాయిగా చదువుకోవచ్చు.