31, అక్టోబర్ 2010, ఆదివారం

ఒక్కడున్నాడు, అది నేనే !!




ఏంటి నువ్వు కూడానా నేనొక్కడినే అనుకున్నా...

1984
లో రీడర్స్ డైజెస్ట్ మగజైన్ లో చదివిన ఒక కొటేషన్ " friendship is born at the moment when one says to other " what you too... i thought i was only one !! " ఇద్దరు మనుషుల మధ్య స్నేహం మొదలవటానికి ముఖ్యమూలం ఏంటో పై చెప్పబడిన సూత్రం చాలుకదా. ఇద్దరు మనుషులు స్నేహం చెయ్యడానికి ఏదో కారణం ఉండాలిగా.. అవేంటో మాట్లాడుకుందాం కాసేపు...మొట్టమొదటి ఫ్రెండు అంటే అమ్మ నాన్న ఇంక మన సహోదరులు వీళ్ళే కదా మన మొదటి పరిచయం.

మనకీ వీళ్ళకీ ఉండే సామాన్య అంశం ఒకే కుటుంబం ఒకే ఇల్లు ఒకే రక్తం. కాబట్టి వీళ్ళ తో స్నేహం ప్రత్యేకంగా ప్రస్తావించను.
బంధువులు కూడా మన కుటుంబ సభ్యులే గా అందుకే వాళ్ళ తో స్నేహం విషయం కూడా పెద్ద పంచ్ లేని సబ్జెక్ట్.

మరి ఇక ఎవరు మిగిలారు బయటి స్నేహితులే ....
రక్త సంబంధమూ లేకుండా, మన ఇంట్లోవాళ్ళు కాకుండా , మనకి దగ్గరవ్వాలంటే ఏదో సామ్యం ఉండాలి.
అందుకే చిన్నప్పుడు ఒకే వీధి లో ఉండే వాళ్ళు ఒకే ఇంట్లో వేరే వేరే వాటాల్లో ఉండేవాళ్ళు మొదట గా స్నేహితులవుతారు.
బళ్ళో చేరాక ఒకే బడి ఒకే తరగతి లో ఒకే బెంచ్ లో వాళ్ళు స్నేహంగా మసలుతారు.
వాళ్ళంతా మన ఇష్ట అఇష్టాలతో సంబంధం లేకుండా యాదృచ్చికంగా దగ్గరయ్యే వాళ్ళు.

వయసు పెరిగాక మనకు మనమే ఎన్నుకున్న వాళ్ళు కొందరు ఫ్రెండ్స్ అవుతారు.
అందులో మనకు బాగా దగ్గరయ్యే వాళ్ళు మన మనస్తత్వం ,అభిరుచులతో సామ్యం ఉన్న చాలా కొద్ది మంది.

పుస్తాకాలు చదవటం లో కొందరు ఫ్రెండ్స్ అయితే,
మంచి సంగీతం వినటం లో కొందరు ఫ్రెండ్స్ అవుతారు.
సంఘానికి సాయం చేసే పని లో కొందరు కలుస్తే ,
స్వార్ధానికి చేసే పనుల్లో కొందరు కలుస్తారు..
ఇలా స్నేహితులవ్వాలంటే ఏదో సామ్యం ఉండాలి
ఒకే చోట ఉద్యోగం చెయ్యటం
ఒకే చోట కలసి నివసించటం
నుంచి ఒకే చోట కూరగాయలు కొనటం లో కూడా ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళున్నారు
నెట్ లో కొందరు ఆగంతకులు కలిస్తే హాయ్ మీ ఎస్ ఎల్ ఏంటి అని అడిగి చాట్ మేట్స్ అయితే
సెలూన్ లో కూడా కొందరు ఫ్రెండ్స్ అవుతారు "ఏమిటీ మీరు ఇక్కడే హెయిర్ కట్టింగ్ చేయిస్తారా అంటూ.."
ఒకే హాస్పిటల్ లాబీ లో కూడ ఫ్రెండ్స్ అవచ్చు :మీ నాన్న గారికీ కేటరాక్టేనా మా అమ్మ కూ అంతే నంటూ..
పిల్లల బడి బయట సాటి తల్లి తండ్రులు ఫ్రెండ్స్ కావచ్చు మా వాడు సరిగ్గా చదవట్లేదు లేదా మీ అమ్మాయి క్లాస్ టాపర్ కదా అంటూ...
ఇలా ఏదో ఒక కలిసే విషయం తో ఫ్రెండ్స్ కావచ్చు కదా
ఇప్పటి దాక నాకున్న ఫ్రెండ్స్ అంతా నాకున్న నిజం ఫ్రెండ్స్ కారు, ఉహు ఇంకోలా చెప్తా నేనే వాళ్లకి సరైన ఫ్రెండ్ ని కాదు
ఏదో ఒక అవసరానికి లేక అభిప్రాయ భాగస్వామ్యానికీ కలిసే ఇంకో మనిషి.
మరి నాకేంటి ఇన్నేళ్ళు వచ్చినా ఒక్క మంచి ఫ్రెండ్ లేడు లోపం నాలో ఉందా లేక నాతో కలిపే సామ్యం ఇంక వేరే వాళ్ళకీ లేదా ?
మనిషి సాంఘిక జంతువు (సోషల్ అనిమల్ ) అనటారు కదా నేనేంటి ఇలా గణిత జంతువు ( కాలి క్యులేటేడ్ అనిమల్ ) లా ఉన్నాను ?
అసలు ఇది మంచి స్థితా లేక ఏదన్నా మానసిక వ్యాధా.....
నాకే ఒకో సారి అనుమానం వస్తుంది
ఏమైనా మనలో మనం ఒంటరిగా ఉండటం కూడా బాగుంటుంది ( మన చుట్టూ వందల మంది ఉన్నా మనకు మనమే, మనలో మనమే అంతర్ముఖం లో ఉండటం కావాలంటే ప్రయత్నిచండి)

మూడు రోజులు ఒక మనిషి తో సుదీర్ఘం గా మాట్లాడి నేను తెలుసుకున్న విషయమిది.
మీరేమాన్నా సలహా ఇవ్వగలరా ఇలాంటి వ్యక్తికి ?
దాన్ని ఇంగ్లీష్ మానసిక శాస్త్రం లో ఏమంటారు ?
ఆ ...ఇలా మానసిక సమస్యలన్నీ నా ఫ్రెండ్ ఒకడుండే వాడు వాడికి ఈ సమస్య ఉంది అనే మొదలెడతారు అంటారా అది మీ ఇష్టం.....





7 కామెంట్‌లు:

  1. అంతా చదివిన తర్వాత రెండు కొటేషన్లు గుర్తుకొచ్చాయి.
    1.The bank of friendship cannot exist for
    long without deposits.

    2.What could be more a miracle than
    a caterpillar turning into a butterfly,
    an egg yolk into a chicken,
    an acorn into a mighty oak ?
    The acquaintance turning into a
    great friendship.
    ఎప్పుడొ చదివినవి. తప్పులున్న మన్నించవలెను.
    స్నేహం లో తప్పులన్నీ మన దగ్గరే ఉన్నాయనుకుంటే నాలుగు కాలాలు మన్నుతుందనుకుంటాను. స్నేహంలో ’అర్ధాలు’ వెతుకుతే అంతే సంగతులు ఏమో.

    రిప్లయితొలగించండి
  2. There are some other such people. Though I have very good friends, some times I identify myself in a similar situation. But I'm never worried about it. It happens.

    రిప్లయితొలగించండి
  3. Hi Celebrity ji

    Thanks for commenting in my blog. :D

    Su (enti meekkoodaa 2 commentsena ? Inka manam friends!!)

    రిప్లయితొలగించండి
  4. bulusu & madhuri :thanks
    sujata : మనం మనం ఒకే జాతి నో.కా.బ్లో
    " ఆయినా కొట్టు తీసి బేరాలు కోసం ఎదురు చూసే......" ఈ డవిలాగు మీద నాకు పేటంట్ ఉంది జార్త మరి ...

    రిప్లయితొలగించండి
  5. అన్యాయం ఆత్రేయ గారూ. మనిద్దరం కా.లే.బ్లా.స కి అధ్యక్ష పదవి కి పోటీ పడ్డాము. సుజాత గారు కూడా ఈ పేరు కి ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరు పార్టీ మారితే నేనొప్పుకోను.నిజమే సారూ కొట్టు పెట్టి... డవిలాగు కి పేటెంటు హక్కులు అందరివి.

    రిప్లయితొలగించండి
  6. aatreya garu.. antarmukhonmukhulai manalo manam choosukovadalu avee anukuntam kanee, oka friend matram undalandi.. aado, mago, evaro okaru.. aa balame veru unte..

    రిప్లయితొలగించండి
  7. పరిచయస్థులు వేరు, స్నేహితులు వేరు. కలిసి పనిచేసేవారు, ప్రయాణించేవారు అందరూ మనకి మిత్రులవ్వరు. అభిప్రాయాలు కలిసినంతమాత్రాన స్నేహబంధం 'హాయ్' దాటి వెళ్ళకపోవచ్చును; కలవనంతమాత్రాన స్నేహితులు అవ్వకూడదనిలేదు.

    కొన్నేళ్ళముందర ఈ స్నేహబంధాలపై నాకు వచ్చిన ఆలోచనలు నా ఇంగ్లీషు బ్లాగునుండి (అప్పటికి నేను తెలుగులో రాయడం మొదలుపెట్టలేదు) -
    http://jb-journeyoflife.blogspot.com/2008/06/true-friendship.html
    http://jb-journeyoflife.blogspot.com/2008/06/true-friendship-2.html

    రిప్లయితొలగించండి