1, అక్టోబర్ 2010, శుక్రవారం

నేను గాంధీ ని చూసాను ...


సరిగ్గా 365 రోజుల క్రితం ఇదే రోజు ఇది జరిగింది మీతో పంచుకోక పోతే నా మనసు ఆగేట్టు లేదు. ఆ రోజు చాలా ప్రాముఖ్యత ఉన్న రోజు. దానికి వారం ముందే నాకొచ్చిన sms ప్రకారం అక్టోబర్ రెండు న యూత్ హాస్టల్స్ అఫ్ ఇండియా నిర్వహిస్తున్న ఒక ప్రచార యాత్ర లో భాగం గా ఆ రోజు ఉదయం 6 గంటలకు విజయవాడ లో బయలు దేరి అమరావతి వరకు సైకిల్ మీద వెళుతూ దారి పొడుగునా ఉన్న ఊర్లలో లో డెంగూ, మలేరియా విష జ్వరాల నియంత్రణ దోమల నిర్మూలన మీద అవగాహన కల్పించటం. దాంట్లో పాల్గొనమని ఆహ్వానం. ఇలాంటి తిరుగుడు కార్య క్రామాలంటే ఇష్టమైన నేను అందులో పాల్గొనటానికి వెంటనే నిర్ణయించుకున్నా. దానికి సన్నద్ద మవుతూ ఒక సైకిల్ సంపాదించా.
నా దగ్గర లేక పోవటం తో నా స్నేహితుని కొడుకు దగ్గర అరువు తీస్కోని మరీ. ఒక నాలుగు రోజులుగా ఎడ తెరపి లేకుండా పడుతున్న వానల వల్ల వాతావరణం చల్లగా ఉన్నా ముసురు వల్ల కొంచం నిరుశ్చాహం ఉన్నాం. చాలా మంది వస్తారనుకుంటే మొత్తం మీద 12 మంది మాత్రమే చేరాం సైకిల్ యాత్ర కి. పొద్దున్నే 5 30 కల్లా చెప్పిన చోటుకి చేరా .. ఆరున్నర కి ఆ పన్నెండు మందీ పోగయ్యాం. ఆ అవగాహన యాత్ర లో నిజమెంతో గానీ నాకు మాత్రం గాంధి జయంతి కదా సైకిల్ తొక్కుతూ .. అయన చెప్పిన పల్లెల్లో భారతీయం చూద్దామని బయలు దేరా... నిజానికి ఆ బృంద సభ్యులు నాకు ఎవరూ తెలీదు ఒక్క నానీ అన్న అతను తప్ప.
పరస్పర పరిచయాలయ్యాక ఝండా ఊపించుకొని బయలు దేరాం. అప్పటికి నేను సైకిల్ తొక్కి 20 సంవత్సరాలయింది. కాలేజీ రోజుల్లో తొక్కాను. మళ్ళీ ఇదే మొదట్లో చాలా కష్టమని పించింది మెల్లగా తొక్కుతూ సిటీ బయటకి వచ్చాం. అందరి పరిస్థితి అదే అలవాటు పోయిన సైక్లింగ్. కాళ్ళ పిక్కల నొప్పి కూర్చున్న సీటు నొప్పి రక రకాల బాధలు.కబుర్లాడుతూ జోకులకి నవ్వుతూ మా ప్రయాణం సాగింది. మీకు సరిగ్గా గుర్తుంటే అదే రోజు క్రిష్ణమ్మకి వరదలు వచ్చాయి. అన్ని డాములు పూర్తిగా నిండాయి దాంతో నడుల్లోకి నీరు చేరి పరీవాహక ప్రాంతలన్నిట్లో నీరు చేరింది. వరద హెచ్చరికలు జారి అయ్యాయి. మేము వెళ్తున్నది కృష్ణ తీరం వెంబడి కాబట్టి దాదాపు అన్ని గ్రామాల్లో నదీ తీరం చాలా తీవ్రం గా ముంపు కి గురయ్యింది. అందుచేత దారి పొడుగునా రెవిన్యూ శాఖ ఉద్యోగుల్లగా అందరినీ హెచ్చరిస్తూ గ్రామాలు ఖాళీ చేయండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల్లో కి వెళ్ళండి వరద తగ్గక మళ్ళీ వెనక్కి వచేయచ్చు అని చెప్తూ సాగి పోయాం. సైకిల్ మీద వెళ్తూ అలా చెప్తున్నా మమ్మల్ని ఆయా గ్రామస్తులు వింతగా చూస్తూ.. చాలా వరదలు చూసాం మాకేమీ కాదు అంటూ విభిన్న అభిప్రాయలు తెలియ చేసారు.
ముఖ్యం గా పెద్ద వయసు వాళ్ళు మరీ మొండి గా ఉన్నారు. వాళ్ళని చూస్తూ నా మనసులో గాంధి తాత లాగా మొండి వాళ్ళు అనుకున్నా. ఇలాంటి మొండి పట్టుదల లో కాదు, మనసు, చేతా, నిజాయితీ, సత్యం ధర్మం పాలన లో ఎవరైనా గాంధిగారు కనపడతారా అని కొంచం అత్యాస (?) కూడా పడ్డా. అలా సాగిన మా ప్రయాణం నాలుగు గంటల తర్వాత అమరావతి చేరింది. అమరేశ్వరుడిని , తధాగతుడిని ,దర్శించుకొని భోజనం చేసి మళ్ళీ రెండు గంటలకి తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం. కానీ నా మనసులో మాత్రం గాంధి తాతని చూడాలి ఇంతమంది లో ఒక్కళ్ళు కూడా ఉండరా అదీ గాంధీజీ కి ఇష్టమైనా పల్లెల్లో అయన తప్పక కనపడతారు అనుకున్నా..
అలా తొక్కుతూ వస్తున్నాం మధ్యలో నా సైకిల్ వెనక చక్రం ఏదో తేడా వచ్చి చెయిన్ పడిపోతోంది అసలు తొక్క టానికి ఛాన్స్ లేకుండా .. వచేటప్పుడు ఉన్న హుషారు, బృంద భావం వెళ్ళే టప్పుడు కొంచం తగ్గటం చేత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు దాంతో నేను ఇంకో అరవై ఏళ్ళ పెద్దాయన మిగిలిపోయాం. ఆయనకి నేను తోడు కోసం కాక పోయినా నా సైకిల్ బాగా లేక పోవటం వల్ల ఇద్దరం మిగిలాం.. అలా వస్తూ రాయపూడి అనే ఊళ్ళో కి వచ్చాం. పెద్దాయన్ని మెయిన్ రోడ్ మీద మెల్లగా వెళ్తూ ఉండమని నేను రాయపూడి గ్రామం లోకి వెళ్లాను. అక్కడ వాకబ్ చేస్తే ఒక సైకిల్ షాప్ కనపడింది. ఆ షాప్ లో ఉన్న హుస్సేన్ అన్న అబ్బాయికి నా సమస్య చెప్తే ఒక రెంచ్ తో క్షణాల్లో బాగుచేసి తీస్కెళ్ళ మన్నాడు. డబ్బులు ఎంత ఇవ్వను అంటే పెద్ద పనా అది దానికి డబ్బులేంటి అని చిన్నగా నవ్వాడు. అలా ఊరికే చేయించు కోవటం నాకు ఇష్టం లేక పది రూపాయల నోట్ ఇస్తే ఒద్దన్నాడు. అతి బలవంతం మీద తీస్కోని నాకు మళ్ళీ చిల్లర ఇచ్చాడు లెక్క చూస్కంటే ఎనిమిది రూపయలున్నై నా చేతిలో. అంటే రెండు రూపాయలు మాత్రం తీస్కున్నాడు. అదేంటి మరీ అంత తక్కువ తీస్కున్నవంటే..?? అసలు మా ఊళ్ళో దానికి డబ్బులు తీస్కోము మీరు మరీ ఒత్తిడి చేసారుగా అందుకే రెండు రూపాయలు అన్నాడు. నాకు మింగుడు పడని మంచి తనం.
సరే నని అతనికి బై చెప్పి వస్తూ డ్రింక్ కొనుక్కుందామని ఒక కిరాణా షాప్ దగ్గర ఆగి హాఫ్ లీటర్ డ్రింక్ బాటిల్ తీస్కుని మళ్ళీ బయలు దేర బోతే వెనక నుంచి ఆ షాప్ అమ్మాయి పిలుపు అయ్యగారూ మీ చిల్లర.. యాభై రూపాయలిచ్చి మిగతా చిలర తీస్కునే పరిస్థితి లో లేను బడలిక విసుగు తొందరగా వెళ్ళాలనే ఆత్రం లో ..
ఆమె ఇచ్చిన చిల్లర తీస్కోని బాగా ఆశ్చర్య పోతూ ఏంటీ ఈ ఊరు అనుకున్నా... మెల్లగా వస్తూ ఆలోచిస్తే పల్లె టూర్లలో ఇంకా ఇలా నిజాయితీ మిగిలింది ( నిజాయితీ కాదు అమాయకత్వం లేదా మంచితనం?) కాసేపు ఆలోచిస్తే సిటీ లో కార్ లేదా బైక్ సేర్విసింగ్ కి ఇస్తే వచ్చే అనవసరపు బిల్లూ... మొన్నెప్పుడో RTO జరాక్స్ దగ్గర రెండు రూపాయల కోసం వంద ఇచ్చి చిల్లర కోసం మళ్ళీ వస్తా అర్జెంటు పన్లో ఉన్న నంటూ వెళ్లి ఒక పావు గంట లో వెళ్లి చిల్లర అడిగితే ఎవరు నువ్వు అన్న బండ వెధవ గుర్తొచ్చి .... ఎంతైనా పల్లెలు పల్లెలే అనిపించింది. గాంధి గారి వారసులు ఇక్కడే ఉన్నారు ఆయనకిష్టమైన పల్లెల్లోనే..
.
అయితే పట్టణాల్లో గాంధీ లు లేరా ..? అనకండి ఖచ్చితం గా ఉన్నారు
అప్పట్లో తెల్ల వాళ్ళకు వ్యతిరేకం గా భారతీయులే స్వేచ్చ కోసం ఆ గాంధి పోరాడితే
ఇప్పుడు
నల్ల రాజకీయాలకు బలి అవుతూ బరువైన ధరల కింద నలుగుతూ ....
వేర్పాటు, సమైఖ్య వాదాల మధ్య పిల్లల చదువులు ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఆరాట పడుతూ...
ఒక రోజు బంద్ జరగకుండా ఉంటే గుప్పెడు గింజలు దొరుకుతాయి అన్న అత్యాస తో ......
వోటు బ్యాంకు రాజకీయ రక్కసుల కోరలకి దొరక కుండా పారి పోతూ ....
అవినీతి అధికారుల విలాసాల సౌగాధం ధాటి కి ముక్కులు పగిలి పోతూ...
మద్యం ఏరుల మధ్య బ్రతుకు పడవలు తెడ్లేస్తూ ...
సినిమాయ జగం లో డబ్బులు వృధా చేస్తూ....
చాలీ చాలని బ్రతుకు చర్మం జీవితం మీద ఆచ్చాదన కోసం కప్పు కుంటూ...
పీక్కుంటూ ... లాక్కుంటూ ....
బతికే ప్రతీ బక్క ప్రాణీ గాంధీలే నాకంటికి ......
ఇవన్నీ స్వతంత్ర సమరం కంటే తేలికా ఏంటీ........?


1 కామెంట్‌:

  1. enthachoosina netha chesina edo bahda migiluthundi. idi bharatham. mana bharatha desapu bharatham anthe. eppudu maruthundi ee anyayapu aranyam? eppudu gelustham ee anyayapu yudham? manasuni kalachina modati post idi mee ninchi. deeniki veelaithe emi cheyyalo kooda rayadaniki prayathninchandi. manushullo manchithanam, amayakathvam kaapadalante ela?

    రిప్లయితొలగించండి