10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

అమ్మాయిలకి ఆటో గ్రాఫ్స ఇస్తున్నా సారీ బిజీ

అమ్మాయిలకు ఆటోగ్రాఫ్ ఇస్తున్నా సారీ బిజీ.....

ఒక
నాలుగు పేరాలు బ్లాగ్ లో రాసి ఒకల్లిద్దరి కంట్లో నా రాతలు పడగానే నాకు భలే మతింపు గా ఉంది .. ఒక రచయితఅయినట్లుగా.. పొగరు తో నిన్న రాత్రి పడుకున్నా.. పొద్దున్న లేచి పేపర్ చదువుతుంటే అనుబంధ సంచిక లో నా బ్లాగ్గురించి ఎవరో పేపర్లో వేసేసారు( రాసేసారు) తెగ మెచ్చుకుంటూ... వర్ధమాన రచయిత .. తెలుగు సాహిత్యానికి మళ్ళీమంచి రోజులొచ్చాయి ... పుస్తక ప్రియుల ఆశాకిరణం కాంతి పుంజం అంటూ.. ఇలా తెగ పొగుడుతూ... ఎవరో అభిమానిఅయుంటాడు లే అని సరిపెట్టుకున్నా.
మధ్యాన్నం
నుంచి ఫోన్ల మీద ఫోన్లు మీరేం చేస్తుంటారు ఎక్కడ ఉంటారు అంటూ ప్రశ్నల శర పరంపర అటు మెయిల్చూడ బోతే బాక్స్ నిండిందోయి ఇంకో బిందె పట్రా అంటూ జిమెయిల్ వాళ్ళు అరుపులు ఏంటో అభిమానం ఇంతగాకట్టి పడేస్తున్నారు నన్ను. ఆఫీసు లో ఫైల్స్ అలుక్కుపోయి కనపడుతున్నై ఏంటి సైట్ పెరిగిందా ఏంటి చెప్మా ... అనిచూస్తే కళ్ళు చెమర్చాయని పక్క వాళ్ళు సరి చేసారు. సరే ఇదంతా సరే వారం తిరిగే సరికి రిజిస్టర్ పోస్ట్ లో కేంద్రప్రభుత్వం సాహిత్య అకాడెమి నుంచి ఎమన్నా మీ రచనలు పంపండి అవార్డు ఇస్తాం ( మరీ ఊరికే ఇస్తే బాగుండదు అనికింద PS పెట్టి ). లోపు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తొందర పడింది బ్రేకింగ్ న్యూస్ లో ధర్మవరపు ని తొలగించి ఆ స్థానం లో నన్నుఉంచినట్లు.

సరే
ఇవన్నీ సరే బ్లాగ్ రచయితల కి ఏదో ఛానల్ వాళ్ళు అవార్డ్స్ ఫంక్షన్ పెట్టారు సరిగ్గా టీవీ అవార్డ్స్ లాగా.. ఇక్కడోసంగతి చెప్పాలి పొపులర్ రచయితలు , పెద్ద రచయితలు , పుస్తకాలు అచ్చోయించుకునే రచయితలు బ్లాగ్ జోలికి రానట్లు, బ్లాగ్ లో రాయటం చిన్నతనం అన్నట్లు, సినిమా అర్తిస్త్స్ లకి వివిధ అవార్డ్స్ ఇస్తూ చానల్స్ లైవ్ ప్రోగ్రాం పెడితే దాంట్లో టీవీనటులు వెనక వరుసలలో కూర్చొని తెగ చప్పట్లు కొడితే .. టీవీ అవార్డ్స్ ఫంక్షన్ కి సినిమా వాళ్ళు లైట్ తేస్కోని రానట్లుగా, మన బ్లాగర్స్ ఫంక్షన్ కి పెద్ద రచయితలు రారేమో అన్న అనుమానం ఏమో రోజు దాక వేచి చూడాలి ఏమిచేస్తారో వాళ్ళు . లోపు నేను మా ఇంట్లో మూడో బెడ్ రూం ని నా ఆఫీసు రూం గా మర్చేసుకున్నా . టేబుల్ కుర్చీ ఒకనాలుగు విసిటేర్స్ కుర్చీలు కిటికీ లో ఫెర్న్ మొక్క ,గోడ, దాని మీద ఒక బల్లి, కిటికీ అవతల జాజి తీగ, ఆకాశం లోచంద్రుడు ( ఎప్పుడూ ఉంటాడా అని అడక్కండి) ఇవన్నీ ఏర్పాటు చేసేస్కున్నా.. ఇప్పుడు ప్రెస్ వాళ్ళు టీవీ వాళ్ళురావటమే తరువాయి.

ఇన్ని
జరిగాక మన నానుడి ఉంది కదా తెలుగోడు పైకి వస్తే పక్కోడు కాళ్ళు పట్టి లాగేస్తాడని అదే జరినట్లు అనిపిస్తే తేరిపారా చూసా. తీరా చూస్తే ఆ పక్కోడు మా ఆవిడే .. లేవండి లేవండి ఎప్పటిలాగా రంజాన్ ఇవ్వాళ కాదట రేపట.. ఈ రోజూ మీకు ఆఫీసు ఉంది అంటూ....( పెళ్లాలున్నారే .. ..)

12 కామెంట్‌లు:

  1. అబ్బా, ఈ అడోళ్ళున్నారే..

    కాస్త ఆ వార్డ్ వెరిఫికేషన్ తీసేద్దురు

    రిప్లయితొలగించండి
  2. @thara and rameshsssbd sorry kothani cheppagaa now i removed word verification
    thanks for the suggestion

    రిప్లయితొలగించండి
  3. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది..

    ఇంతకీ మీ ప్రొఫైల్ ఫొటో గురించి కాస్త చెప్పండి, విగ్రహం ఎంత బాగున్నదో

    రిప్లయితొలగించండి
  4. మీరు మరీ ఆకాశందాటి ఎగురుతుంటే ఇంట్లో ఆడాళ్లు కాళ్లు లాగకుంటే ఎలా? మీరు క్రిందపడి బాడీ పార్టులన్నీ విరగ్గొట్టుకుంటే సేవలు చేయాల్సింది వాళ్లే కదా.:) హాలిడే కదా అని తెల్లారుజామున ఇంత భీభత్సమైన కలలుకంటే ఎలా?? పండగ రేపు కదా. మీరు రేపటికి వాయిదా వేసుకుని ఆపీసుపని చూడండి.

    రిప్లయితొలగించండి
  5. మీ రచనలకూ బ్లాగుకూ అక్షరాలా అంతటి రికగ్నిషన్ రావాలని కోరుకుంటూ ఈద్ ముబారక్!

    రిప్లయితొలగించండి
  6. ధన్య వాదములు కొత్త పాళీ గారు

    రిప్లయితొలగించండి
  7. naaku telugu lo rayalani undi comment kaani nakidantha kotha mari..... aa telugu lipi elago emito antha kotheee.... ikapothe mee kalala bhagotham chala bagundi.kadupubba navvinchindi.
    aina antha pagati kalalaithe elagamma... paiga aadavalla paina abhiyogamaaa?hannaaaaaa!

    రిప్లయితొలగించండి