10, అక్టోబర్ 2010, ఆదివారం

సరిగ్గా ఇదే రోజు .....




10-10-10
ఇవేమీ కొలతలు కావు ఒకవేళ కొలతలైన అలా సమానం గా ఉంటే బాగోవు ఈ రోజు తేదీ టీవీ లో పేపర్లలో ఊదర వేస్తున్న విశిష్ట తేదీ ... మంచి ముహూర్తం ,మంచి అంకెల తో వంద ఏళ్ళకి ఒక సారి వచ్చే తేదీ కావటం తో కొంత హడావిడి ఉండటం తప్పని సరి కదా.
కానీ నావరకు ఈ తేదీ కి ప్రత్యేకత ఉండి అది మా నాన్న గారి 75 వ పుట్టిన రోజు. అయన లేరు అయన ఆశయ సాధనల కోసం మేము ఉన్నాం , అనే రొటీన్ మాటలు చెప్పను. ఎందుకంటే అయన బాగా సంపాదించి ఆకస్మికం గా చనిపోయిన రాజ కీయ నాయకుడు కారు. రియల్ ఎస్టేట్లో ఉన్నట్లుండి బాగా సంపాదించి నలుగురును వేనకేస్కోని తిరుగుతూ సెటిల్ మెంట్లు చేసి నింగికెగసిన గల్లీ నాయకుడు కాదు. చావగానే రౌడి షీట్లు పోయి బోలెడు ఆశయాలు ఉండే వ్యక్తిగా మారటానికి అయన థర్డ్ క్లాసు గూండా నాయకుడు కాదు.
ఒక ముప్పై ఆరేళ్ళు ఒకే ఊళ్ళో స్థిరంగా పనిచేసి తన ఆఫీసు వాళ్లకి , ఇంకా కొంతమంది దగ్గర మిత్రులకీ, ఎక్కువగా బంధువులకీ మరింతగా మా కుటుంబ సభ్యులకీ ఎంతో ఇష్ట మయిన మా కుటుంబ నాయకుడు. మా రాజు మహారాజు ....
కానీ అయన ఆశయ సాధన కోసం మేమంతా ఉన్నాం కుటుంబ సభ్యులం. ఇంతకీ అయన ఆశయాలేంతో మకిప్పటికీ తెలియదు. అంత తెలివి మాకు లేదు. కానీ ముప్పైరెండేల్లు అయన కొడుకుగా ఆయన్ని చూసి కొన్ని. అయన మిత్రుల ద్వారా విని, ఇంకా బంధువుల మాటల్లో తెలుసుకొని కొన్ని ముక్ష్య విషయాలు గ్రహించినవి గుర్తుచేస్కుంటా...
మా "డాడీ" అలా అంటేనే నాకు అయన గూర్చి మాట్లాడుతున్నానని అనిపిస్తుంది. ఎలా అలవాటు అయిందో చిన్నప్పటినుంచి మాకు డాడీ అనటం అలవాటు అయింది. నాన్న అనటం అలవాటు లేదు ( అందుకే మా అమ్మాయి తో అమ్మ నాన్న పిలుపు అలవాటు చేసాం ). అందుకే ఇక్కడ డాడీ గానే ప్రస్తావిస్తా...
బాగా చిన్న తనం లోనే తండ్రి పోయి తల్లీ, వయసు లో బాగా చిన్నపిల్లలయిన నలుగురు తమ్ముళ్ళు, ఒక చెల్లీ , సరిగ్గా లేని ఆర్ధిక పరిస్థితి తో 18 ఏళ్ళ వయసులో బతుకు మొదలు పెట్టి ఒక పక్క చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇంకో పక్క చదువు కుంటూ భాద్యత గా ఉండే వారుట. ఇంట్లో పాలు తాగే పసి పిల్లలున్నారని పాల ఖర్చు తట్టుకోలేక ఒక గేదె ని కొని దాని పెంపకం నిర్వహణ కూడా తానె చూసి పోషించిన మంచి అన్నయ్య. అలా కష్టాల్లో పెరిగిన జీవితం కావటం వాళ్ల పెద్దయ్యాక మంచి స్థితి లో ఉన్నాక కూడా నిరాడంబరం గా బతికే వారు. తన సొంత మనుషులనే కాక దూరపు బంధు వర్గం లో కూడ అవసరాలు చూస్తూ సాయాలు చేస్తూ..చేసిన ఏ సాయానికి కూడ ప్రతిఫలం ఆసింపక బతికిన మహాను భావుడు.
తను ఏదైతే మంచి అనుకున్నారో దానికి ఎప్పుడూ లోబడి, తను నమ్మిన నీతి నియమాలను మాకు నిలువెల్లా ఒంట బట్టించిన తండ్రి. జీవితం లో ఎప్పుడూ ఎవరికీ తలవంచక , ఎవరి సొమ్ము పైసా కూడ తినక అదే సూత్రం మాకు నేర్పించారు. ఇల్లు కట్టడానికి తప్ప అప్పు అనేది అయన అస్సలు చేయలేదు.
తలకి మించిన భారం ఎత్తుకోవటం, అడంబరాలకి ఖర్చు చేయటం ఏమాత్రం పడని వ్యక్తి.
మా బంధువులు గానీ , ఆయన మిత్రులు గానీ ఎప్పుడన్నా కలసి అయన గురించి చెప్తుంటే రామాయణ భారత గాధలు వింటున్నట్లని పిస్తుంది.
అందుకే అయన పోయినా అయన ఆశయ సాధన కి మేమంతా ఉన్నాం. ఇదంతా చదివి ఈయన నాన్న ఈయనకి గొప్ప మాకేంటి అనుకుంటున్నారా... నా ఉద్దేశ్యం అడ్డదిడ్డంగా అవినీతి లో సంపాదించి బాగా డబ్బు చేసి ఆనక ఏ జబ్బో చేసి పోయి పోంగానే వెనక మిగిలిన అవినీతి మొలకలు చేసే ప్రకటనలు ఆశయ సాధనకు పాటు పడే వెతలు చూస్తే వాళ్ళ కన్నా మా డాడీ లాంటి సామాన్యులేవరైనా నాకు పూజ్యనీయులే. సమాజానికి చెడు చెయ్యక తన పని తాను చేస్కొని పోయే నీతి మంతులు సరైన ఆశయాలున్నవారు ఉన్నారు . అందుకే మా డాడీ కే కాదు అలాంటి లక్షల మందికీ నా ప్రణామాలు.
అందుకే డాడీ !!
మీ పుట్టిన రోజున మరొక సరి వినమ్రం గా మీకు అంజలి ఘటిస్తున్నా
మీకు ఇష్టం లేని ఏ పనీ జీవితం లో చేయ్యననీ..
మీరు వేసిన బాటనే ఉన్నాననీ...
మీరు కట్టిన రాట నే తిరుగుతాననీ...
మీరిచ్చిన ఆత్మ విశ్వాసం తో..
మసక బారిన కళ్ళతో...
మీ బుజ్జిగాడు

5 కామెంట్‌లు:

  1. శ్రీ ఆత్రేయ గార్కి,
    చాలా బాగా రాసారు.. మా ఆఫీసులో ఎవరైనా నా గురించి అవాకులు చెవాకులు వాగితే, నేనేం మాట్లాడకుండా, వాడికి, వాళ్ళ తల్లితండ్రులు నేర్పిన సంస్కారం అది.. అందులో వాడి తప్పు లేదు ఆంటాను..ఎక్కడో దూరంగా అమ్మా నాన్నలకు దూరంగా ఉండే వాళ్ళకి తల్లితండ్రుల మాటలు, ప్రవర్తనే ఆదర్శం. మన కారక్టెర్ బావుంటేనే మన పిల్లలు కూడా తప్పు చెయ్యకుండా ఆదర్శవంతగా జీవిస్తారు.
    మీ బ్లాగులో బొమ్మలు బావున్నాయి కాని ఫొటోషాప్ లో అయితే ఇంకా బాగా వస్తాయి..ట్రై చెయ్యండి.

    రిప్లయితొలగించండి
  2. థాంక్స్ శ్రీ వోలేటి గారు ,

    కారం గా మొదలైన మన పరిచయం తీయని స్నేహమవ్వాలని కోరుతూ ...
    ఆత్రేయ

    ps : నా పోస్ట్ అన్నిటికీ మీద క్రిటిసిసం తో కూడిన కామెంట్స్ రాయండి it will help me to improve my quality and also correct my errors :

    రిప్లయితొలగించండి
  3. మీ నాన్నగారితో మొదలు పెట్టి నీతిగల అందరికీ ప్రణమిల్లిన మీ సంస్కారం ముందు ప్రణమిల్లాలి.
    నీతి లేని వాళ్ళకి ఎంత తిట్టిన రాదు అసలు వాళ్ల కుటుంబ సభ్యులని అనాలి అవినీతి ఎంగిలి కూడు తినక పోతే చావరు కదా.. పైగా మిగతా మామూలు జనాలని చూస్తే అలుసు.
    మీ పోస్ట్స్ లో తేడా గమనించా అల్లరి హాస్యం తగ్గి సీరియస్ గా మారుతున్నారు మీరు ఏది రాసినా భావ వ్యక్తీకరణ బాగుంటుంది. - నందిని

    రిప్లయితొలగించండి
  4. @ నందిని : నీతి పక్షం ఉండే మీలాంటి వాళ్ళు అందరకీ ప్రణామాలు మీతో సహా..
    @ పూడురి: అవును అయన గ్రేట్ డాడ్ !! నాకైతే మా ఇంటి గాంధీ !!!

    రిప్లయితొలగించండి